|
|
1. అబ్రాహాము మరల ఒక స్త్రీని వివాహము చేసికొనెను, ఆమె పేరు కెతూరా.
|
1. Then again H3254 Abraham H85 took H3947 a wife H802 , and her name H8034 was Keturah H6989 .
|
2. ఆమె అతనికి జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు, షూవహు అనువారిని కనెను.
|
2. And she bore H3205 him H853 Zimran H2175 , and Jokshan H3370 , and Medan H4091 , and Midian H4080 , and Ishbak H3435 , and Shuah H7744 .
|
3. యొక్షాను షేబను దెదానును కనెను. అష్షూరీయులు లెతూషీయులు లెయుమీయులు అనువారు ఆ దెదాను సంతతివారు.
|
3. And Jokshan H3370 begot H3205 H853 Sheba H7614 , and Dedan H1719 . And the sons H1121 of Dedan H1719 were H1961 Asshurim H805 , and Letushim H3912 , and Leummim H3817 .
|
4. ఏయిఫా ఏఫెరు హనోకు అబీదా ఎల్దాయా అనువారు ఆ మిద్యాను సంతతివారు.
|
4. And the sons H1121 of Midian H4080 ; Ephah H5891 , and Epher H6081 , and Hanoch H2585 , and Abida H28 , and Eldaah H420 . All H3605 these H428 were the children H1121 of Keturah H6989 .
|
5. వీరందరు కెతూరా సంతతివారు. అబ్రాహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకు కిచ్చెను.
|
5. And Abraham H85 gave H5414 H853 all H3605 that H834 he had unto Isaac H3327 .
|
6. అబ్రాహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానము లిచ్చి, తాను సజీవుడై యుండగానే తన కుమారుడగు ఇస్సాకు నొద్దనుండి తూర్పుతట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివేసెను.
|
6. But unto the sons H1121 of the concubines H6370 , which H834 Abraham H85 had, Abraham H85 gave H5414 gifts H4979 , and sent them away H7971 from H4480 H5921 Isaac H3327 his son H1121 , while he yet H5750 lived H2416 , eastward H6924 , unto H413 the east H6924 country H776 .
|
7. అబ్రాహాము బ్రదికిన సంవత్సరములు నూట డెబ్బదియైదు.
|
7. And these H428 are the days H3117 of the years H8141 of Abraham H85 's life H2416 which H834 he lived H2416 , a hundred H3967 threescore and fifteen H7657 H8141 H2568 years H8141 .
|
8. అబ్రాహాము నిండు వృద్ధాప్య మునకు వచ్చినవాడై మంచి ముసలితనమున ప్రాణమువిడిచి మృతిబొంది తన పితరులయొద్దకు చేర్చబడెను.
|
8. Then Abraham H85 gave up the ghost H1478 , and died H4191 in a good H2896 old age H7872 , an old man H2205 , and full H7649 of years ; and was gathered H622 to H413 his people H5971 .
|
9. హిత్తీయుడైన సోహరు కుమారుడగు ఎఫ్రోను పొలమందలి మక్పేలా గుహలో అతని కుమారులగు ఇస్సాకును ఇష్మాయేలును అతనిని పాతిపెట్టిరి; అది మమ్రే యెదుట నున్నది.
|
9. And his sons H1121 Isaac H3327 and Ishmael H3458 buried H6912 him in H413 the cave H4631 of Machpelah H4375 , in H413 the field H7704 of Ephron H6085 the son H1121 of Zohar H6714 the Hittite H2850 , which H834 is before H5921 H6440 Mamre H4471 ;
|
10. అబ్రాహాము హేతు కుమారులయొద్ద కొనిన పొలములోనే అబ్రాహామును అతని భార్యయైన శారాయును పాతి పెట్టబడిరి.
|
10. The field H7704 which H834 Abraham H85 purchased H7069 of H4480 H854 the sons H1121 of Heth H2845 : there H8033 was Abraham H85 buried H6912 , and Sarah H8283 his wife H802 .
|
11. అబ్రాహాము మృతిబొందిన తరువాత దేవుడు అతని కుమారుడగు ఇస్సాకును ఆశీర్వ దించెను; అప్పుడు ఇస్సాకు బేయేర్ లహాయిరోయి దగ్గర కాపురముండెను.
|
11. And it came to pass H1961 after H310 the death H4194 of Abraham H85 , that God H430 blessed H1288 his son H1121 H853 Isaac H3327 ; and Isaac H3327 dwelt H3427 by H5973 the well Lahai H883 -roi.
|
12. ఐగుప్తీయురాలును శారా దాసియునైన హాగరు అబ్రాహామునకు కనిన అబ్రాహాము కుమారుడగు ఇష్మా యేలు వంశావళి యిదే.
|
12. Now these H428 are the generations H8435 of Ishmael H3458 , Abraham H85 's son H1121 , whom H834 Hagar H1904 the Egyptian H4713 , Sarah H8283 's handmaid H8198 , bore H3205 unto Abraham H85 :
|
13. ఇష్మాయేలు జ్యేష్ఠకుమారుడైన నేబాయోతు కేదారు అద్బయేలు మిబ్శాము
|
13. And these H428 are the names H8034 of the sons H1121 of Ishmael H3458 , by their names H8034 , according to their generations H8435 : the firstborn H1060 of Ishmael H3458 , Nebajoth H5032 ; and Kedar H6938 , and Adbeel H110 , and Mibsam H4017 ,
|
14. మిష్మా దూమానమశ్శా
|
14. And Mishma H4927 , and Dumah H1746 , and Massa H4854 ,
|
15. హదరు తేమా యెతూరు నాపీషు కెదెమా
|
15. Hadar H2316 , and Tema H8485 , Jetur H3195 , Naphish H5305 , and Kedemah H6929 :
|
16. ఇవి వారి వారి వంశావళుల ప్రకారము వారి వారి పేరుల చొప్పున ఇష్మాయేలు కుమారులయొక్క పేరులు వారి వారి గ్రామములలోను వారి వారి కోటలలోను ఇష్మాయేలు కుమారులు వీరే, వారి పేరులు ఇవే, వారివారి జనముల ప్రకారము వారు పండ్రెండుగురు రాజులు.
|
16. These H428 are the sons H1121 of Ishmael H3458 , and these H428 are their names H8034 , by their towns H2691 , and by their castles H2918 ; twelve H8147 H6240 princes H5387 according to their nations H523 .
|
17. ఇష్మాయేలు బ్రదికిన సంవత్సరములు నూట ముప్పది యేడు. అప్పుడతడు ప్రాణమువిడిచి మృతిబొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను.
|
17. And these H428 are the years H8141 of the life H2416 of Ishmael H3458 , a hundred H3967 and thirty H7970 and seven H7651 years H8141 : and he gave up the ghost H1478 and died H4191 ; and was gathered H622 unto H413 his people H5971 .
|
18. వారు అష్షూరునకు వెళ్లు మార్గమున హవీలా మొదలుకొని ఐగుప్తు ఎదుటనున్న షూరువరకు నివ సించువారు అతడు తన సహోదరులందరి యెదుట నివాస మేర్పరచుకొనెను.
|
18. And they dwelt H7931 from Havilah H4480 H2341 unto H5704 Shur H7793 , that H834 is before H5921 H6440 Egypt H4714 , as thou goest H935 toward Assyria H804 : and he died H5307 in H5921 the presence H6440 of all H3605 his brethren H251 .
|
19. అబ్రాహాము కుమారుడగు ఇస్సాకు వంశావళియిదే. అబ్రాహాము ఇస్సాకును కనెను.
|
19. And these H428 are the generations H8435 of Isaac H3327 , Abraham H85 's son H1121 : Abraham H85 begot H3205 H853 Isaac H3327 :
|
20. ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియావాడైన బెతూయేలు కుమార్తెయును సిరియావాడైన లాబాను సహోదరి యునైన రిబ్కాను పెండ్లిచేసికొన్నప్పుడు నలుబది సంవత్సరములవాడు.
|
20. And Isaac H3327 was H1961 forty H705 years H8141 old H1121 when he took H3947 H853 Rebekah H7259 to wife H802 , the daughter H1323 of Bethuel H1328 the Syrian H761 of Padan H4480 H6307 -aram , the sister H269 to Laban H3837 the Syrian H761 .
|
21. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య యైన రిబ్కా గర్భవతి ఆయెను.
|
21. And Isaac H3327 entreated H6279 the LORD H3068 for H5227 his wife H802 , because H3588 she H1931 was barren H6135 : and the LORD H3068 was entreated H6279 of him , and Rebekah H7259 his wife H802 conceived H2029 .
|
22. ఆమె గర్భములో శిశువులు ఒకనితో నొకడు పెనుగులాడిరి గనుక ఆమెఈలాగైతే నేను బ్రదుకుట యెందుకని అనుకొని యీ విషయమై యెహోవాను అడుగ వెళ్లెను. అప్పుడు యెహోవా ఆమెతో నిట్లనెను
|
22. And the children H1121 struggled together H7533 within H7130 her ; and she said H559 , If H518 it be so H3651 , why H4100 am I H595 thus H2088 ? And she went H1980 to inquire H1875 of H853 the LORD H3068 .
|
23. రెండు జనములు నీ గర్భములో కలవు.రెండు జనపదములు నీ కడుపులోనుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదముకంటె ఒక జనపదము బలిష్టమై యుండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను.
|
23. And the LORD H3068 said H559 unto her, Two H8147 nations H1471 are in thy womb H990 , and two H8147 manner of people H3816 shall be separated H6504 from thy bowels H4480 H4578 ; and the one people H3816 shall be stronger H553 than the other people H4480 H3816 ; and the elder H7227 shall serve H5647 the younger H6810 .
|
24. ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి.
|
24. And when her days H3117 to be delivered H3205 were fulfilled H4390 , behold H2009 , there were twins H8380 in her womb H990 .
|
25. మొదటివాడు ఎఱ్ఱనివాడుగా బయటికివచ్చెను. అతని ఒళ్లంతయు రోమ వస్త్రమువలె నుండెను గనుక అతనికి ఏశావు అను పేరు పెట్టిరి.
|
25. And the first H7223 came out H3318 red H132 , all over H3605 like an hairy H8181 garment H155 ; and they called H7121 his name H8034 Esau H6215 .
|
26. తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చి నప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమెను పట్టుకొని యుండెను గనుక అతనికి యాకోబు అను పేరు పెట్ట బడెను. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు అరువదియేండ్లవాడు.
|
26. And after that H310 H3651 came H3318 his brother H251 out , and his hand H3027 took hold H270 on Esau H6215 's heel H6119 ; and his name H8034 was called H7121 Jacob H3290 : and Isaac H3327 was threescore H8346 years H8141 old H1121 when she bore H3205 them.
|
27. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుటయందు నేర్పరియై అరణ్యవాసిగా నుండెను; యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను.
|
27. And the boys H5288 grew H1431 : and Esau H6215 was H1961 a cunning H3045 hunter H6718 , a man H376 of the field H7704 ; and Jacob H3290 was a plain H8535 man H376 , dwelling H3427 in tents H168 .
|
28. ఇస్సాకు ఏశావు తెచ్చిన వేటమాంసమును తినుచుండెను గనుక అతని ప్రేమించెను; రిబ్కా యాకోబును ప్రేమిం చెను.
|
28. And Isaac H3327 loved H157 H853 Esau H6215 , because H3588 he did eat H6310 of his venison H6718 : but Rebekah H7259 loved H157 H853 Jacob H3290 .
|
29. ఒకనాడు యాకోబు కలగూరవంటకము వండుకొను చుండగా ఏశావు అలసినవాడై పొలములోనుండి వచ్చి
|
29. And Jacob H3290 sod H2102 pottage H5138 : and Esau H6215 came H935 from H4480 the field H7704 , and he H1931 was faint H5889 :
|
30. నేను అలసియున్నాను; ఆ యెఱ్ఱయెఱ్ఱగా నున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగెను; అందుచేత అతని పేరు ఎదోము అనబడెను.
|
30. And Esau H6215 said H559 to H413 Jacob H3290 , Feed H3938 me , I pray thee H4994 , with H4480 that same H2088 red H122 pottage ; for H3588 I H595 am faint H5889 : therefore H5921 H3651 was his name H8034 called H7121 Edom H123 .
|
31. అందుకు యాకోబునీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా
|
31. And Jacob H3290 said H559 , Sell H4376 me this day H3117 H853 thy birthright H1062 .
|
32. ఏశావు నేను చావబోవుచున్నాను గదా జ్యేష్ఠత్వము నాకెందుకనెను
|
32. And Esau H6215 said H559 , Behold H2009 , I H595 am at the point H1980 to die H4191 : and what profit H4100 shall this H2088 birthright H1062 do to me?
|
33. యాకోబు నేడు నాతో ప్రమాణము చేయుమనెను. అతడు యాకోబుతో ప్రమాణముచేసి అతనికి జ్యేష్ఠత్వమును అమి్మవేయగా
|
33. And Jacob H3290 said H559 , Swear H7650 to me this day H3117 ; and he swore H7650 unto him : and he sold H4376 H853 his birthright H1062 unto Jacob H3290 .
|
34. యాకోబు ఆహార మును చిక్కుడుకాయల వంటకమును ఏశావు కిచ్చెను; అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను.
|
34. Then Jacob H3290 gave H5414 Esau H6215 bread H3899 and pottage H5138 of lentils H5742 ; and he did eat H398 and drink H8354 , and rose up H6965 , and went his way H1980 : thus Esau H6215 despised H959 H853 his birthright H1062 .
|