Bible Language

Ecclesiastes 6 (ERVTE) Easy to Read Version - Telugu

1 నేను ప్రపంచంలో అసమంజసమైన మరో విషయాన్ని గమనించాను. దాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం.
2 దేవుడు ఒక మనిషికి గొప్ప సంపద, ఆస్తి మరియు గౌరవమూ ప్రసాదిస్తాడు. అతనికి కావలసినవన్నీ, అతను కోరుకోగలిగిన సమస్తం వుంటాయి. అయితే, వ్యక్తి వాటిని అనుభవించకుండా చేస్తాడు దేవుడు. ఒక అపరిచితుడు వస్తాడు, వాటన్నింటినీ చేజిక్కించుకుంటాడు. ఇది కూడా అర్థరహితమైన చాలా చెడ్డ విషయమే.
3 ఒక వ్యక్తి దీర్ఘకాలం జీవించవచ్చు. అతనికి వంద మంది సంతానం ఉండవచ్చు. అయితే, మంచి విషయాలు అతనికి తృప్తి కలిగించలేదనీ, అతని మరణానంతరం ఒక్కరూ అతన్ని జ్ఞాపకం ఉంచుకోరనీ అనుకోండి, అప్పుడు అతనికంటె పురిట్లోనే చనిపోయే శిశువు మెరుగని నేనంటాను.
4 మృత శిశువుగా పుట్టడం నిజంగానే అర్థరహితం. పేరైనా లేని శిశువుని చటుక్కున తీసుకుపోయి సూర్యరశ్మి చొరని చీకటి సమాధిలో పూడ్చేస్తారు.
5 సూర్యరశ్మినైనా చూడని శిశువుకి బొత్తిగా ఏది ఏమాత్రం తెలియదు. కాని, దేవుడు తనకిచ్చిన మంచివాటిని అనుభవించని మనిషికంటె శిశువు ఎక్కువ ప్రశాంతిని అనుభవిస్తుంది.
6 మనిషి రెండు వేల సంవత్సరాలు బతకవచ్చుగాక. అయినా అతను తనకు ఇచ్చిన జీవితాన్ని అనుభవించక పోతే అతనికంటె గర్భంలో చనిపోయిన శిశువు సులభమయిన మార్గంతో అంత్యదశను పొందిందనవచ్చు.
7 మనిషి చచ్చేలా పాటుపడతాడు తిండి కోసం. అయితే, అతను ఎన్నడూ తృప్తి చెందడు.
8 వివేకవంతుడు అవివేకికంటె విశేషమైనవాడు కాడు. అంత కంటె, ఉన్నదున్నట్లు జీవితాన్ని స్వీకరించడం తెలిసిన బీదవాడు మేలు
9 ఉన్నదానితో తృప్తి చెంది సంతోషంగా ఉండటం ఎప్పుడూ ఇంకా ఇంకా ఏదో కావాలని అశించడం మేలు. ఎప్పుడూ ఇంకా ఇంకా కావాలని కోరుకోవడం వృధా ప్రయాసం. అది గాలిని మూట గట్టుకొనేందుకు చేసే ప్రయత్నమే.
10 This verse may not be a part of this translation
11 This verse may not be a part of this translation
12 భూమిమీద స్వల్ప కాలం జీవించే మనిషికి, స్వల్ప కాలంలో అతనికి ఏది అత్యుత్తమమైనదో ఎవరికి తెలుస్తుంది? అతని జీవితం నీడలా గడిచిపోతుంది. తర్వాత ఏమి జరుగుతుందో ఎవరూ అతనికి చెప్పలేరు.