Bible Language

Song of Solomon 6 (ERVTE) Easy to Read Version - Telugu

1 అతిలోక సుందరి, ఎచ్చటికి వెళ్ళాడు నీ ప్రియుడు? దిక్కు కెళ్లాడు? నీ ప్రియుని మాకు తెలుపు వెదుకుటకు మేము నీకు తోడ్పడతాము.
2 ఎర్రటి పద్మాలను ఏరుకొనుటకు నా ప్రియుడు వెళ్లాడు ఉద్యాన వనానికి సుగంధాలు వెదజల్లు పూలమొక్కల మళ్లకి గొర్రెల మేప పోయాడు తోటలకు కెందామరల కోసి రాశి వేయుటకు
3 మేపు నా ప్రియుడు నావాడు నేనతనిదానను ఈనాడు ఏనాడు. నేను ఎర్రని పద్మాల నడుమ గొర్రెలు మేపుతున్న నా ప్రియునిదానను.
4 నా ప్రియసఖీ, నీవు తిర్సా నగరమంత సుందర మైనదానివి, యెరూషలేమంత ఆహ్లాదకరమైన దానివి, నగర దుర్గాలంతటి భయంకరురాలివి .
5 నీవు నా వైపు చూడకు! నీ చూపులు నన్ను పురికొల్పి ఉన్మత్తున్ని చేస్తాయి గిలాదు పర్వత చరియల నుండి గెంతులేస్తూ దిగివచ్చే గొర్రెపిల్లల మాదిరిగా నీ సుదీర్ఘ శిరోజాలు జాలువారు తున్నాయి.
6 జోడు జోడు పిల్లల్ని కని ( వాటిలో ఒక్కటి పిల్లల్ని కోల్పోని) అప్పుడే శుభ్రంగా స్నానం చేసి వస్తున్న తెల్లటి ఆడ గొర్రెల బారులా ఉంది నీ పలువరుస
7 బురఖా కింద నీ కణతలు దానిమ్మ చెక్కల్లా వున్నాయి.
8 అరవై మంది రాణులు ఎనభై మంది సేవకురాండ్రు లెక్కకు మించిన కన్యలు ఉందురుగాక నాకు.
9 కాని, నా గువ్వ పిట్ట నిష్కళంకురాలు ఒక్కతే (నాకైన స్త్రీ) ఆమె తన తల్లికి ముద్దుబిడ్డ. తన తల్లికి గారాల కూచి! కన్యలే ఏమి, రాణులు,సేవకు రాండ్రు కూడా ఆమెను చూచినంతనే ప్రశంసిస్తారు.
10 ఎవరా యువతి? అరుణోదయంలా మెరుస్తోంది. చంద్రబింబమంత అందమైనది సూర్యుడంత ధగ ధగలాడుతోంది, పరలోక సేనకులంతటి విభ్రాంతి గొలుపు యువతి ఎవరు?
11 నేను బాదం తోపుకి వెళ్లాను ఫలసాయమెలా ఉందో చూసేందుకు ద్రాక్షా తీగెలు పూశాయేమో చూసేందుకు దానిమ్మలు మొగ్గతొడిగాయేమో చూసేందుకు,
12 నేనింకా గ్రహించక ముందే నా తనువు నన్ను రాజోద్యోగుల రథాల్లోకి చేర్చినది షూలమ్మీతీ తిరిగిరా, తిరిగిరా మేము నిన్ను చూసేందుకు తిరిగి రా, తిరిగి రా, మహనయీము నాట్యమాడు షూలమ్మీతీ నేల తేరిపార చూస్తారు?
13 This verse may not be a part of this translation