Bible Books

13
:
-

1. ఎఫ్రాయిము మాటలాడినప్పుడు భయం కలిగింది. PEPS అతడు ఇశ్రాయేలు వారిలో తనను గొప్ప చేసుకున్నాడు. PEPS తరువాత బయలు దేవుణ్ణి బట్టి అపరాధియై అతడు నాశనమయ్యాడు. PEPS
2. ఇప్పుడు వారు ఇంకా పాపం చేస్తూ ఉన్నారు. PEPS తమకు చేతనైనంత నైపుణ్యంతో వెండి విగ్రహాలు పోతపోస్తారు. PEPS అదంతా నిపుణులు చేసే పనే. PEPS “వాటికి బలులు అర్పించే వారు దూడలను ముద్దు పెట్టుకోండి” అని చెబుతారు. PEPS
3. కాబట్టి వారు ఉదయాన కనబడే మబ్బులాగా, PEPS పెందలకడ ఆరిపోయే ప్రాతఃకాలపు మంచులాగా ఉంటారు. PEPS కళ్ళంలో నుండి గాలి ఎగరగొట్టే పొట్టులాగా, PEPS పొగ గొట్టంలో గుండా వెళ్ళిపోయే పొగలాగా ఉంటారు. PEPS
4. మిమ్మల్ని ఐగుప్తు దేశంలో నుండి తెచ్చిన యెహోవానైన నేనే మీ దేవుణ్ణి. PEPS నన్ను తప్ప నీవు దేవుడినీ గుర్తించ కూడదు. PEPS నేను తప్ప వేరే రక్షకుడు లేడు. PEPS
5. మహా ఎండకు కాలిన అరణ్యంలో నిన్నెరిగిన వాణ్ణి నేనే. PEPS
6. తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొందారు. తృప్తి పొంది గర్వించి నన్ను మర్చి పోయారు. PEPS
7. కాబట్టి నేను వారికి సింహం వంటి వాడనయ్యాను. PEPS చిరుత పులి దారిలో పొంచి ఉన్నట్టు నేను వారిని పట్టుకోవడానికి పొంచి ఉంటాను. PEPS
8. పిల్లలు పోయిన ఎలుగుబంటి దాడి చేసినట్టు నేను వారి మీద పడి వారి రొమ్మును చీల్చివేస్తాను. PEPS ఆడసింహం మింగివేసినట్టు వారిని మింగివేస్తాను. PEPS క్రూరమృగాల్లాగా వారిని చీల్చివేస్తాను. PEPS
9. ఇశ్రాయేలూ, నీ మీదికి వచ్చి పడేది నీ నాశనమే. నీ సహాయకర్తనైన నాకు నీవు విరోధివయ్యావు. PEPS
10. నీ రాజు ఏడి? నీ పట్టణాల్లో నీకు సహాయం చేయకుండ నీ రాజు ఏమైపోయాడు? PEPS “రాజును అధిపతులను నా మీద నియమించు” అని నీవు మనవి చేశావు గదా? PEPS
11. కోపంతో నీకు రాజును నియమించాను. PEPS క్రోధంతో అతణ్ణి తీసి పారేశాను. PEPS
12. ఎఫ్రాయిము దోషం పోగుపడింది. PEPS అతని పాపం పోగుపడింది. PEPS
13. ప్రసూతి వేదనలు కలిగినట్టుగా అతనికి వేదన కలుగుతుంది. PEPS ప్రసవం సమయంలో బయటికి రాని శిశువైనట్టుగా అతడు బుద్ధి లేనివాడై వృద్ధికి రాడు. PEPS
14. అయినా పాతాళ వశంలో నుండి నేను వారిని విమోచిస్తానా? PEPS మృత్యువు నుండి వారిని రక్షిస్తానా? PEPS మరణమా, నీవు తెచ్చే బాధలు ఎక్కడ? వాటిని ఇటు తీసుకురా. PEPS పాతాళమా, నీ నాశనం ఏది? దాన్ని ఇటు తీసుకురా. PEPS నాకు కనికరం పుట్టదు. PEPS
15. ఎఫ్రాయిము తన సోదరుల్లో వర్థిల్లినా, PEPS తూర్పు గాలి వస్తుంది. PEPS యెహోవా పుట్టించే గాలి అరణ్యంలో నుండి లేస్తుంది. PEPS అది రాగా అతని నీటిబుగ్గలు ఎండి పోతాయి. PEPS ఎఫ్రాయిము ఊటలు ఇంకిపోతాయి. PEPS అతని బావిలో నీరు ఉండదు. అతని శత్రువులు అతని ధననిధులను అతనికి ప్రియమైన వస్తువులన్నిటిని కొల్లగొడతారు. PEPS
16. షోమ్రోను తన దేవుని మీద తిరుగుబాటు చేసింది గనక, PEPS ప్రజలు కత్తివాత కూలుతారు. PEPS వారి పిల్లలను రాళ్లకేసి కొడతారు. గర్భవతుల కడుపులు చీరేస్తారు. PE
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×