1. ఇశ్రాయేలూ, నీ పాపం చేత నీవు కూలిపోయావు గనక నీ దేవుడైన యెహోవా వైపు తిరుగు. PEPS
2. ఒప్పుకోలు మాటలు సిద్ధపరచుకుని యెహోవా దగ్గరికి తిరిగి రండి. PEPS మీరు చెప్పవలసినదేమిటంటే “మా పాపాలన్నిటిని పరిహరించు. మమ్మల్ని అనుగ్రహంతో స్వీకరించు. PEPS అప్పుడు మేము మా పెదాల ఫలాలను అంటే స్తుతులను అర్పిస్తాము. PEPS
3. అష్షూరీయులు మమ్మల్ని రక్షించరు. PEPS మేమిక మీదట గుర్రాలెక్కి యుద్ధానికి పోము. PEPS ‘మీరే మాకు దేవుడు’ అని మేమిక మీదట మా చేతి పనితో చెప్పము. PEPS తండ్రిలేని వారికి వాత్సల్యం నీ దగ్గరే దొరుకుతుంది.” PEPS
4. వారు నన్ను వదిలి వెళ్ళిపోయిన తరువాత నేను వారిని బాగు చేస్తాను. PEPS వారి మీదనున్న నా కోపం చల్లారింది. PEPS మనస్ఫూర్తిగా వారిని ప్రేమిస్తాను. PEPS
5. చెట్టుకు మంచు ఉన్నట్టు నేనతనికి ఉంటాను. PEPS తామర పువ్వు పెరిగేలా అతడు అభివృద్ధి పొందుతాడు. PEPS లెబానోను పర్వతాల్లో దేవదారు వృక్షంలాగా వారు వేరు పారుతారు. PEPS
6. అతని కొమ్మలు విశాలంగా పెరుగుతాయి. PEPS ఒలీవచెట్టు కు ఉండే శోభ అతనికి కలుగుతుంది. PEPS లెబానోను దేవదారు చెట్లకు ఉన్నంత సువాసన అతనికి ఉంటుంది. PEPS
7. అతని నీడలో నివసించేవారు తిరిగి వస్తారు. PEPS ధాన్యం వలే వారు తిరిగి మొలుస్తారు. PEPS ద్రాక్షచెట్టులాగా వికసిస్తారు. PEPS లెబానోను ద్రాక్షరసానికి ఉన్న కీర్తి వారికి ఉంటుంది. PEPS
8. ఎఫ్రాయిము ఇలా అంటాడు “బొమ్మలతో నాకిక పనేమిటి?” PEPS నేనే అతనికి జవాబిచ్చి ఆలకిస్తున్నాను. PEPS నేనే ఎఫ్రాయిమునుగూర్చి విచారణ చేస్తున్నాను. PEPS నేను సతత హరిత సరళ వృక్షం వంటి వాణ్ణి. PEPS నావల్లనే నీకు ఫలం కలుగుతుంది. PEPS
9. ఈ సంగతులు వివేచించే జ్ఞానులెవరు? PEPS వాటిని గ్రహించి తెలుసుకునే బుద్ధిమంతులెవరు? PEPS ఎందుకంటే యెహోవా మార్గాలు యథార్థమైనవి. PEPS నీతిమంతులు వాటిలో నడుచుకుంటారు. అయితే తిరుగుబాటు చేసేవారు తడబడి కూలుతారు. PE