Bible Versions
Bible Books

1 Thessalonians 2 (TEV) Telegu Old BSI Version

1 సహోదరులారా, మీయొద్ద మా ప్రవేశము వ్యర్థము కాలేదు గాని
2 మీరెరిగినట్టే మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానముపొంది, యెంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవునియందు ధైర్యము తెచ్చుకొంటిమని మీకు తెలియును.
3 ఏల యనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదుగాని
4 సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవునివలన ఎంచబడిన వారమై, మనుష్యులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము.
5 మీరెరిగియున్నట్టు మేము ఇచ్చకపు మాటలనైనను, ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడును వినియోగింపలేదు; ఇందుకు దేవుడే సాక్షి.
6 మరియు మేము క్రీస్తుయొక్క అపొస్త లులమై యున్నందున అధికారముచేయుటకు సమర్థులమై యున్నను,మీవలననే గాని యితరుల వలననే గాని, మను ష్యులవలన కలుగు ఘనతను మేము కోరలేదు.
7 అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించునట్లుగా, మేము మీ మధ్యను సాధువులమై యుంటిమి.
8 మీరు మాకు బహు ప్రియులైయుంటిరి గనుక మీయందు విశేషా పేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము గాక మా ప్రాణములనుకూడ మీకిచ్చుటకు సిద్ధపడియుంటిమి.
9 అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకమున్నది గదా. మేము మీలో ఎవనికైనను భారముగా ఉండకూడదని రాత్రింబగళ్లు కష్టముచేసి జీవనము చేయుచు మీ
10 మేము విశ్వాసులైన మీయెదుట ఎంత భక్తిగాను, నీతి గాను, అనింద్యముగాను ప్రవ ర్తించితిమో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి
11 తన రాజ్యమునకును మహిమ కును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతివానిని హెచ్చ రించుచు, ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు,
12 తండ్రి తన బిడ్డల యెడల నడుచుకొనురీతిగా మీలో ప్రతివానియెడల మేము నడుచుకొంటిమని మీకు తెలియును.
13 హేతువుచేతను, మీరు దేవునిగూర్చిన వర్తమాన వాక్యము మావలన అంగీకరించినప్పుడు, మనుష్యుల వాక్య మని యెంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది.
14 అవును సహోదరులారా, మీరు యూదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకొనిన వారైతిరి. వారుయూదులవలన అనుభవించినట్టి శ్రమలే మీరును మీ సొంతదేశ
15 యూదులు తమ పాపములను ఎల్లప్పుడు సంపూర్తి చేయు టకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మును హింసించి,
16 అన్యజనులు రక్షణపొందుటకై వారితో మేము మాటలాడకుండ మమ్మును ఆటంకపరచుచు,దేవునికి ఇష్టులు కానివారును మనుష్యులకందరికి విరోధులునై యున్నారు; దేవుని ఉగ్రత తుదముట్ట
17 సహోదరులారా, మేము శరీరమునుబట్టి కొద్ది కాలము మిమ్మును ఎడబాసియున్నను, మనస్సును బట్టి మీదగ్గర ఉండి, మిగుల అపేక్షతో మీ ముఖము చూడవలెనని మరి యెక్కువగా ప్రయత్నము చేసితివిు.
18 కాబట్టి మేము మీయొద్దకు రావలెనని యుంటిమి;పౌలను నేను పలుమారు రావలెనని యుంటిని గాని సాతాను మమ్మును అభ్యంతరపరచెను.
19 ఏలయనగా మా నిరీక్షణయైనను ఆనందమైనను అతిశయకీరీటమైనను ఏది? మన ప్రభువైన యేసుయొక్క రాకడ సమయమున ఆయన యెదుట మీరే గదా.
20 నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనంద మునై యున్నారు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×