Bible Versions
Bible Books

Genesis 23 (TEV) Telegu Old BSI Version

1 శారా జీవించిన కాలము, అనగా శారా బ్రదికినయేండ్లు నూట ఇరువది యేడు.
2 శారా కనాను దేశమందలి హెబ్రోనను కిర్యతర్బాలో మృతిబొందెను; అప్పుడు అబ్రాహాము శారా నిమిత్తము అంగలార్చు టకును ఆమెను గూర్చి యేడ్చుటకును వచ్చెను.
3 తరువాత అబ్రాహాము మృతిబొందిన తన భార్య యెదుటనుండి లేచి హేతు కుమారులను చూచి
4 మీ మధ్య నేను పరదేశినిగాను పరవాసినిగాను ఉన్నాను. మృతిబొందిన నా భార్య నా కన్నులయెదుట ఉండకుండ, ఆమెను పాతి పెట్టుటకు మీ తావున నా కొక శ్మశానభూమిని స్వాస్థ్యముగా ఇయ్యుడని అడుగ
5 హేతు కుమారులు అయ్యా మా మాట వినుము. నీవు మా మధ్యను మహారాజవై యున్నావు;
6 మా శ్మశాన భూములలో అతి శ్రేష్టమైన దానియందు మృతిబొందిన నీ భార్యను పాతిపెట్టుము; నీవు మృతిబొందిన నీ భార్యను పాతి పెట్టునట్లు మాలో తన శ్మశానభూమి ఇయ్యనొల్లనివాడు ఎవడును లేడని అబ్రాహాము కుత్తరమిచ్చిరి.
7 అప్పుడు అబ్రాహాము లేచి దేశపు ప్రజలైన హేతు కుమారులకు సాగిలపడి
8 మృతిబొందిన నా భార్యను నా యెదుట ఉండకుండ నేను పాతి పెట్టుట మీకిష్టమైతే నా మాట వినుడి.
9 సోహరు కుమారుడైన ఎఫ్రోను తన పొలము చివరను తనకు కలిగియున్న మక్పేలా గుహను నాకిచ్చునట్లు నా పక్షముగా అతనితో మనవిచేయుడి. మీ మధ్యను శ్మశాన భూమిగా నుండుటకు నిండు వెలకు అతడు దానిని నాకు స్వాస్థ్యముగా ఇయ్యవలెనని వారితో చెప్పెను.
10 అప్పుడు ఎఫ్రోను హేతు కుమారుల మధ్యను కూర్చుండి యుండెను. హిత్తీయుడైన ఎఫ్రోను తన ఊరి గవిని ప్రవేశించువారందరి యెదుట హేతు కుమారులకు వినబడు నట్లు అబ్రాహాముతో చె
11 అయ్యా అట్లు కాదు నా మనవి నాలకించుము, పొలమును నీకిచ్చుచున్నాను; దానిలోనున్న గుహను నీకిచ్చు చున్నాను; నా ప్రజల యెదుట అది నీకిచ్చుచున్నాను; మృతిబొందిన నీ భార్యను పాతి పెట్టు మనెన
12 అప్పుడు అబ్రాహాము దేశపు ప్రజల యెదుట సాగిలపడి
13 సరేకాని నా మనవి ఆలకించుము. పొలమునకు వెల యిచ్చెదను; అది నాయొద్ద పుచ్చు కొనినయెడల మృతిబొందిన నా భార్యను పాతి పెట్టెదనని దేశ ప్రజలకు వినబడు నట్లు ఎఫ్రోనుతో చెప్పెను.
14 అందుకు ఎఫ్రోను అయ్యా నా మాట వినుము; భూమి నాలుగు వందల తులముల వెండి చేయును;
15 నాకు నీకు అది యెంత? మృతిబొందిన నీ భార్యను పాతిపెట్టుమని అబ్రాహామున కుత్తరమిచ్చెను;
16 అబ్రాహాము ఎఫ్రోను మాట వినెను. కాబట్టి హేతు కుమారులకు వినబడునట్లు ఎఫ్రోను చెప్పిన వెల అనగా వర్తకులలో చెల్లు నాలుగు వందల తులముల వెండి అబ్రాహాము తూచి అతని కిచ్చెను.
17 ఆలాగున మమ్రే యెదుటనున్న మక్పేలా యందలి ఎఫ్రోను పొలము, అనగా పొలమును దానియందలి గుహయు దాని పొలిమేర అంతటి లోనున్న పొలము చెట్లన్నియు,
18 అతని ఊరి గవిని ప్రవేశించు వారందరిలో హేతు కుమారుల యెదుట అబ్రాహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడెను.
19 తరువాత అబ్రాహాము కనాను దేశములో హెబ్రోనను మమ్రేయెదుట నున్న మక్పేలా పొలము గుహలో తన భార్యయైన శారాను పాతిపెట్టెను.
20 పొలమును దానిలోనున్న గుహయు హేతు కుమారులవలన శ్మశానముకొరకు అబ్రా హామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడెను.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×