Bible Versions
Bible Books

Joshua 4 (TEV) Telegu Old BSI Version

1 జనులందరు యొర్దానును దాటుట తుదముట్టిన తరువాత యెహోవా యెహోషువతో నీలాగు సెలవిచ్చెను
2 ప్రతిగోత్రమునకు ఒక్కొక మనుష్యుని చొప్పున పన్ని ద్దరు మనుష్యులను ఏర్పరచి
3 యాజకుల కాళ్లు నిలిచిన స్థలమున యొర్దాను నడుమనుండి పండ్రెండు రాళ్లను తీసి వాటిని ఇవతలకు తెచ్చి, మీరు రాత్రి బసచేయు చోట వాటిని నిలువబెట్టుడని వారి కాజ్ఞాపించుము
4 కావున యెహోషువ ఇశ్రాయేలీయులలో సిద్ధపరచిన పన్నిద్దరు మనుష్యులను, అనగా ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుష్యుని పిలిపించి
5 వారితో ఇట్లనెనుయొర్దాను నడుమనున్న మీ దేవు డైన యెహోవా మంద సము నెదుట దాటిపోయి, ఇశ్రాయేలీయుల గోత్రముల లెక్క చొప్పున ప్రతివాడును ఒక్కొక రాతిని తన భుజముమీద పెట్టుకొని తేవలెను.
6 ఇకమీదట మీ కుమారులుఈ రాళ్లెందు కని అడుగునప్పుడు మీరుయెహోవా మందసము నెదుట యొర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడెను.
7 అది యొర్దానును దాటుచుండగా యొర్దాను నీళ్లు ఆపబడెను గనుక యీ రాళ్లు చిరకాలము వరకు ఇశ్రా యేలీయులకు జ్ఞాపకార్థముగా నుండునని వారితో చెప్పవలెను. అది మీకు ఆనవాలై యుండును,
8 అందుకే దీని చేయవలెను. యెహోషువ ఆజ్ఞాపించినట్లు ఇశ్రా యేలీయులు చేసిరి. యెహోవా యెహోషువతో చెప్పి నట్లు వారు ఇశ్రాయేలీయుల గోత్రముల లెక్కచొప్పున యొర్దాను నడుమనుండి పండ్రెండు రాళ్లను తీసి తాము బసచేసిన చోటికి తెచ్చి అక్కడ నిలువబెట్టిరి.
9 అప్పుడు యెహోషువ నిబంధన మందసమును మోయు యాజకుల కాళ్లు యొర్దాను నడుమ నిలిచిన చోట పండ్రెండు రాళ్లను నిలువ బెట్టించెను. నేటివరకు అవి అక్కడ నున్నవి.
10 ప్రజలతో చెప్పవలెనని యెహోవా యెహోషువకు ఆజ్ఞా పించినదంతయు, అనగా మోషే యెహోషువకు ఆజ్ఞా పించినదంతయు, నెరవేరువరకు యాజకులు మందసమును మోయుచు యొర్దానునడుమ నిలుచుండగా జనులు త్వరపడి దాటిరి.
11 జనులందరు దాటిన తరువాత వారు చూచుచుం డగా యెహోవా మందసము మోయు యాజకులు దాటిరి.
12 మరియు ఇశ్రాయేలీయులు చూచుచుండగా రూబేనీయు లును గాదీయులును మనష్షే అర్ధగోత్రపు వారును మోషే వారితో చెప్పినట్లు యుద్ధసన్నద్ధులై దాటిరి.
13 సేనలో ఇంచుమించు నలువది వేలమంది యుద్ధసన్నద్ధులై యుద్ధము చేయుటకు యెహోవా సన్నిధిని యెరికో మైదానములకు దాటివచ్చిరి.
14 దినమున యెహోవా ఇశ్రాయేలీయు లందరి యెదుట యెహోషువను గొప్పచేసెను గనుక వారు మోషేను గౌరవపరచినట్లు అతని బ్రదుకు దినములన్నిటను అతని గౌరవపరచిరి.
15 యెహోవాసాక్ష్యపు మందసమును మోయు యాజ కులకు యొర్దానులోనుండి యివతలికి రండని
16 ఆజ్ఞాపించు మని యెహోషువతో సెలవియ్యగా
17 యెహోషువ యొర్దానులోనుండి యెక్కి రండని యాజకుల కాజ్ఞా పించెను.
18 యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యొర్దాను నడుమనుండి యెక్కి వచ్చినప్పుడు యాజకుల అరకాళ్లు పొడినేలను నిలువగానే యొర్దాను నీళ్లు వాటిచోటికి ఎప్పటివలెనే మరలి దాని గట్లన్నిటి మీద పొర్లి పారెను.
19 మొదటి నెల పదియవ తేదిని జనులు యొర్దానులోనుండి యెక్కి వచ్చి యెరికో తూర్పు ప్రాంతమందలి గిల్గాలులో దిగగా
20 వారు యొర్దానులో నుండి తెచ్చిన పండ్రెండు రాళ్లను యెహోషువ గిల్గాలులో నిలువబెట్టించి
21 ఇశ్రాయేలీయులతో ఇట్లనెనురాబోవు కాలమున మీ సంతతివారు రాళ్లెందుకని తమ తండ్రులను అడుగుదురుగదా;
22 అప్పుడు మీరుఇశ్రా యేలీయులు ఆరిన నేలమీద యొర్దానును దాటిరి.
23 ఎట్లనగా యెహోవా బాహువు బలమైనదని భూనివాసు లందరు తెలిసికొనుటకును,
24 మీరు ఎల్లప్పుడును మీ దేవు డైన యెహోవాయందు భయభక్తులు నిలుపుటకును, మేము దాటువరకు మీ దేవుడైన యెహోవా తానే మాయెదుట ఎఱ్ఱసముద్రమును ఎండచేసినట్లు మీరు దాటువరకు మీ యెదుట యొర్దాను నీళ్ళను ఎండచేసెనని చెప్పి యీ సంగతి వారికి తెలియపరచవలెను.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×