Bible Versions
Bible Books

Leviticus 17 (TEV) Telegu Old BSI Version

1 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెల విచ్చెను.
2 నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఇశ్రాయేలీయులందరితోను ఈలాగుచెప్పుముఇది యెహోవా ఆజ్ఞాపించిన మాట
3 ఇశ్రాయేలీయుల కుటుంబములలో యెహోవా మందిరము ఎదుట యెహో వాకు అర్పణము అర్పించుటకు పూనుకొను వాడు అది ఎద్దేగాని గొఱ్ఱయేగాని మేకయేగాని
4 ప్రత్యక్షపు గుడా రముయొక్క ద్వారమునొద్దకు దానిని ముందు తేక పాళె ములో వధించినను పాళెమునకు వెలుపల వధించినను మనుష్యుడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును;
5 వాడు రక్తమును ఒలికించిన వాడు; ఇశ్రాయేలీయులు బయట వధించుచున్న బలి పశువులను ఇక బయట వధింపక యెహోవా పేరట యాజకునియొద్దకు ప్రత్యక్షపు గుడా రముయొక్క ద్వారమునకే తీసికొని వచ్చి సమాధాన బలిగా అర్పించునట్లు మనుష్యుడు జనులలోనుండి కొట్టి వేయబడవలెను.
6 యెహోవాకు ఇంపైన సువాసన గలుగునట్లు యాజకుడు ప్రత్యక్షపు గుడార ముయొక్క ద్వారము నొద్దనున్న యెహోవా బలిపీఠముమీద వాటి రక్తమును ప్రోక్షించి వాటి క్రొవ్వును దహింపవలెను.
7 వారు వ్యభిచారులై అనుసరించుచు వచ్చిన దయ్యముల పేరట వధించినట్లు ఇకమీదట తమ బలిపశువులను వధింప రాదు. ఇది వారి తర తరములకు వారికి నిత్యమైన కట్టడ.
8 మరియు నీవు వారితో ఇట్లనుముఇశ్రాయేలీయుల కుటుంబములలోగాని మీలో నివసించు పరదేశులలో గాని ఒకడు దహనబలినైనను వేరొక యే బలినైనను
9 యెహోవాకు అర్పింప నుద్దేశముగలవాడై ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్దకు తీసికొని రానియెడల మనుష్యుడు జనులలోనుండి కొట్టివేయబడును.
10 మరియు ఇశ్రాయేలీయుల కుటుంబములలోనేమి, మీలో నివసించు పరదేశులలోనేమి, ఒకడు దేని రక్త మునుతినినను రక్తము తినువానికి నేను విముఖుడనై జను లలోనుండి వాని కొట్టివేయుదును.
11 రక్తము దేహమునకు ప్రాణము. మీనిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠముమీద పోయుటకై దానిని మీకిచ్చితిని. రక్తము దానిలోనున్న ప్రాణమునుబట్టి ప్రాయశ్చిత్తము చేయును.
12 కాబట్టి మీలో ఎవడును రక్తము తినకూడదనియు, మీలో నివసించు పరదేశియు రక్తము తినకూడదనియు నేను ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించితిని.
13 మరియు ఇశ్రాయేలీయులలోనేగాని మీలో నివ సించు పరదేశులలోనేగాని ఒకడు తినదగిన మృగమునైనను పక్షినైనను వేటాడి పట్టినయెడల వాడు దాని రక్తమును ఒలికించి మంటితో కప్పవలెను; ఏలయనగా అది సమస్త దేహములకు ప్రాణాధారము;
14 దానిరక్తము దాని ప్రాణమున కాధారము. కాబట్టి మీరు దేహరక్తమును తినకూడదు. వాటి రక్తము సర్వ దేహములకు ప్రాణా ధారము; దానిని తిను ప్రతివాడు మరణశిక్ష నొందునని నేను ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించితిని.
15 మరియు కళే బరమునైనను చీల్చబడిన దానినైనను తిను ప్రతివాడు దేశ మందు పుట్టినవాడేమి పరదేశియేమి వాడు తన బట్టలను ఉదుకుకొని నీళ్లతో దేహమును కడుగుకొని సాయం కాలమువరకు అపవిత్రుడగును. తరువాత పవిత్రుడగును.
16 అయితే వాడు వాటిని ఉదుకుకొనకయు తన దేహమును కడుగుకొనకయు ఉండినయెడల వాడు తన దోషశిక్షను భరించును.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×