|
|
1. “మనుష్యులకు వెండి లభిర చే గనులు ఉన్నాయి. మనుష్యులు బంగారాన్ని కరిగించి, దానిని శుభ్రం చేసే స్థలాలు ఉన్నాయి.
|
1. Surely H3588 there is H3426 a vein H4161 for the silver H3701 , and a place H4725 for gold H2091 where they fine H2212 it .
|
2. మనుష్యలు భూమినుండి ఇనుమును తవ్వుతారు. బండల నుండి రాగి కరిగించబడుతుంది.
|
2. Iron H1270 is taken H3947 out of the earth H4480 H6083 , and brass H5154 is molten H6694 out of the stone H68 .
|
3. పనివాళ్లు గుహల్లోకి దీపం తీసుకొని వస్తారు. ఆ గుహల్లో లోపలికి వారు వెదుకుతారు. లోపలిచీకటిలో బండల కోసం వారు వెదుకుతారు.
|
3. He setteth H7760 an end H7093 to darkness H2822 , and searcheth out H2713 H1931 all H3605 perfection H8503 : the stones H68 of darkness H652 , and the shadow of death H6757 .
|
4. మనుష్యులు నివసించే చోటికి దూరంగా పనివాళ్లు గోతులు తవ్వుతారు. మరి ఏ మనిషీ కూడ గోతులను ఎన్నడూ తాకలేదు. పనివాడు లోతైన ఆ గోతుల్లోనికి తాళ్లతో దిగేటప్పుడు అతడు యితరులకు చాలా దూరంలో ఉంటాడు.
|
4. The flood H5158 breaketh out H6555 from H4480 H5973 the inhabitant H1481 ; even the waters forgotten H7911 of H4480 the foot H7272 : they are dried up H1809 , they are gone away H5128 from men H4480 H582 .
|
5. భూమిపై నుండి ఆహారం వస్తుంది. కానీ భూమి కింద, వస్తువులను మంట మార్చివేసినట్టు, అది మార్చివేయబడుతుంది.
|
5. As for the earth H776 , out of H4480 it cometh H3318 bread H3899 : and under H8478 it is turned up H2015 as it were H3644 fire H784 .
|
6. నేలక్రింద బండలలో నీల రత్నాలు లభ్యమవుతాయి. నేల కింద మట్టిలో బంగారం ఉంది.
|
6. The stones H68 of it are the place H4725 of sapphires H5601 : and it hath dust H6083 of gold H2091 .
|
7. ఆహారం కోసం జంతువులను తినే పక్షులకు భూమికింద మార్గాలు తెలియవు. డేగ కూడా ఈ మార్గం చూడదు.
|
7. There is a path H5410 which no H3808 fowl H5861 knoweth H3045 , and which the vulture H344 's eye H5869 hath not H3808 seen H7805 :
|
8. కృర మృగాలు ఈ మార్గంలో నడవలేదు. సింహాలు ఈ మార్గంలో పయనించలేదు.
|
8. The lion H7830 's whelps H1121 have not H3808 trodden H1869 it, nor H3808 the fierce lion H7826 passed H5710 by H5921 it.
|
9. పనివాళ్లు కఠిన శిలలను తవ్వుతారు. ఆ పనివాళ్లు పర్వతాలను తవ్వి, వాటిని ఖాళీ చేస్తారు.
|
9. He putteth forth H7971 his hand H3027 upon the rock H2496 ; he overturneth H2015 the mountains H2022 by the roots H4480 H8328 .
|
10. పనివాళ్లు బండల్లోనుంచి సొరంగాలు తవ్వుతారు. బండల్లోని ఐశ్వర్యాలు అన్నింటినీ వాళ్లు చూస్తారు.
|
10. He cutteth out H1234 rivers H2975 among the rocks H6697 ; and his eye H5869 seeth H7200 every H3605 precious thing H3366 .
|
11. నీళ్లు ప్రవహించకుండా నిలిపేందుకు పనివాళ్లు ఆన కట్టలు కడతారు. దాగి ఉన్న వాటిని వారు వెలుగు లోనికి తీసికొని వస్తారు.
|
11. He bindeth H2280 the floods H5104 from overflowing H4480 H1065 ; and the thing that is hid H8587 bringeth he forth H3318 to light H216 .
|
12. “అయితే మనిషికి జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? గ్రహించటం ఎలా అనేది నేర్చుకొనేందుకు మనం ఎక్కడికి వెళ్లాలి?
|
12. But where H4480 H370 shall wisdom H2451 be found H4672 ? and where H335 H2088 is the place H4725 of understanding H998 ?
|
13. జ్ఞానం చాలా అమూల్యమయిందని మనుష్యులు గ్రహించరు. భూమి మీద నివసించే మనుష్యులకు జ్ఞానం లేదు.
|
13. Man H582 knoweth H3045 not H3808 the price H6187 thereof; neither H3808 is it found H4672 in the land H776 of the living H2416 .
|
14. ‘జ్ఞానం నాలో లేదు’ అని అగాధ మహాసముద్రం అంటుంది. ‘జ్ఞానం నా దగ్గరా లేదు’ అని సముద్రం అంటుంది.
|
14. The depth H8415 saith H559 , It H1931 is not H3808 in me : and the sea H3220 saith H559 , It is not H369 with H5978 me.
|
15. అతి ఖరీదైన బంగారంతో జ్ఞానం కొనలేము. జ్ఞానం ఖరీదు వెండితో లెక్క కట్టబడజాలదు.
|
15. It cannot H3808 be gotten H5414 for gold H2091 H5462 H8478 , neither H3808 shall silver H3701 be weighed H8254 for the price H4242 thereof.
|
16. ఓఫీరు బంగారంతో గాని, విలువైన గోమేధికంతోగాని, నీలంతో గాని, అది కొనబడేది కాదు.
|
16. It cannot H3808 be valued H5541 with the gold H3800 of Ophir H211 , with the precious H3368 onyx H7718 , or the sapphire H5601 .
|
17. బంగారం, స్ఫటికం కంటే జ్ఞానం విలువైనది. బంగారంతో చేయబడిన చాలా ఖరీదైన నగలతో జ్ఞానం కొనబడజాలదు.
|
17. The gold H2091 and the crystal H2137 cannot H3808 equal H6186 it : and the exchange H8545 of it shall not be for jewels H3627 of fine gold H6337 .
|
18. జ్ఞానం పగడాలకంటె, పచ్చలకంటె విలువగలది. జ్ఞానం కెంపువకంటె ఖరీదైనది.
|
18. No H3808 mention shall be made H2142 of coral H7215 , or of pearls H1378 : for the price H4901 of wisdom H2451 is above rubies H4480 H6443 .
|
19. ఇథియోపియా (కూషు)దేశపు పుష్యరాగం జ్ఞానం కంటె విలువైనది కాదు. మేలిమి బంగారంతో మీరు జ్ఞానమును కొనలేరు.
|
19. The topaz H6357 of Ethiopia H3568 shall not H3808 equal H6186 it, neither H3808 shall it be valued H5541 with pure H2889 gold H3800 .
|
20. “అలాగైతే జ్ఞానం కనుగొనాలంటే మనం ఎక్కడికి వెళ్లాలి? అవగాహన చేసికోవటం నేర్చుకోనేందుకు మనం ఎక్కడికి వెళ్లాలి?
|
20. Whence H4480 H370 then cometh H935 wisdom H2451 ? and where H335 H2088 is the place H4725 of understanding H998 ?
|
21. భూమి మీద ప్రతి మనిషి నుండీ జ్ఞానం దాచబడింది. ఎత్తుగా ఆకాశంలో ఉన్న పక్షులు కూడా జ్ఞానాన్ని చూడలేవు.
|
21. Seeing it is hid H5956 from the eyes H4480 H5869 of all H3605 living H2416 , and kept close H5641 from the fowls H4480 H5775 of the air H8064 .
|
22. ‘మేము జ్ఞానమును గూర్చిన ప్రచారం మాత్రమే విన్నాం’ అని మరణం, నాశనం చెబుతాయి.
|
22. Destruction H11 and death H4194 say H559 , We have heard H8085 the fame H8088 thereof with our ears H241 .
|
23. “కానీ జ్ఞానానికి మార్గం దేవునికి మాత్రమే తెలుసు. జ్ఞానం ఎక్కడ నివసిస్తుందో దేవునికి తెలుసు.
|
23. God H430 understandeth H995 the way H1870 thereof , and he H1931 knoweth H3045 H853 the place H4725 thereof.
|
24. భూదిగంతాలకు గల మొత్తం మార్గాన్ని దేవుడు చూస్తాడు గనుక ఆయనకు జ్ఞానం తెలుసు. ఆకాశాల కింద ఉన్న సర్వాన్ని దేవుడే చూస్తాడు.
|
24. For H3588 he H1931 looketh H5027 to the ends H7098 of the earth H776 , and seeth H7200 under H8478 the whole H3605 heaven H8064 ;
|
25. గాలికి దాని శక్తిని దేవుడు ఇచ్చినప్పుడు, మహా సముద్రాలు ఎంత పెద్దవిగా ఉండాలో ఆయన నిర్ణయించినప్పుడు,
|
25. To make H6213 the weight H4948 for the winds H7307 ; and he weigheth H8505 the waters H4325 by measure H4060 .
|
26. వర్షాన్ని ఎక్కడ కురిపించాలి, ఉరుములు తుఫానులు ఎటువైపుగా వెళ్లాలి అని దేవుడు నిర్ణయించి నప్పుడు
|
26. When he made H6213 a decree H2706 for the rain H4306 , and a way H1870 for the lightning H2385 of the thunder H6963 :
|
27. అది దేవుడు జ్ఞానాన్ని చూచిన సమయం, జ్ఞానం యొక్క విలువ ఎంతో చూచేందుకు దానిని పరీ క్షించిన సమయం అవుతుంది. జ్ఞానాన్ని దేవుడు నిర్ధారణ చేశాడు.
|
27. Then H227 did he see H7200 it , and declare H5608 it ; he prepared H3559 it, yea H1571 , and searched it out H2713 .
|
28. ‘యెహోవాకు భయపడి, ఆయనను గౌరవించటం జ్ఞానం అవుతుంది. చెడు సంగతుల నుండి తప్పుకోవటం అవగాహన అవుతుంది’ ” అని దేవుడు ప్రజలతో చెప్పాడు. PE
|
28. And unto man H120 he said H559 , Behold H2005 , the fear H3374 of the Lord H136 , that H1931 is wisdom H2451 ; and to depart H5493 from evil H4480 H7451 is understanding H998 .
|