|
|
1. “కాని యిప్పుడు నన్ను హేళన చేసే వారు నాకంటే చిన్నావారు. ఆ యువకులకు పనికి మాలిన తండ్రులు ఉన్నారు. వారి తండ్రులను నా గొర్రెలను కాపలా కాసే కుక్కలతో కూడా నేను ఉండనివ్వను.
|
1. But now H6258 they that are younger H6810 H3117 than H4480 I have me in derision H7832 H5921 , whose H834 fathers H1 I would have disdained H3988 to have set H7896 with H5973 the dogs H3611 of my flock H6629 .
|
2. నాకు సహాయం చేసేందుకు వాళ్లకు బలం లేదు. వారు అలసిపోయిన వృద్ధులు.
|
2. Yea H1571 , whereto H4100 might the strength H3581 of their hands H3027 profit me , in whom H5921 old age H3624 was perished H6 ?
|
3. ఆ మనుష్యులు చచ్చిన వాళ్లతో సమానం. ఎందు కంటే వారికి ఏమీ లేక ఆకలితో ఉన్నారు. ఎండి పోయిన ఖాళీ నేలను కూడా వారు తినటానికి ప్రయత్నిస్తున్నారు.
|
3. For want H2639 and famine H3720 they were solitary H1565 ; fleeing H6207 into the wilderness H6723 in former time H570 desolate H7722 and waste H4875 .
|
4. ఆ మనుష్యులు వారి ఎడారిలోని తుత్తి చెట్లను పెరికి వేస్తారు. తంగేడు చెట్టు వేర్లను వారు తింటారు.
|
4. Who cut up H6998 mallows H4408 by H5921 the bushes H7880 , and juniper H7574 roots H8328 for their meat H3899 .
|
5. ఆ మనుష్యులు ఇతర మనుష్యులు దగ్గర నుండి బలవంతంగా వెళ్లగొట్టబడతారు. మనుష్యులు దొంగల మీద అరచినట్టుగా వారి మీద అరుస్తారు.
|
5. They were driven forth H1644 from H4480 among H1460 men , (they cried H7321 after H5921 them as after a thief H1590 ;)
|
6. ఎండిపోయిన నదులలోను, బండలలోను, కొండగుహలలోను, నేలలోని గుంటలలోను నివసించేందుకు వారి వృద్ధులు బలాత్కారం చేయ బడతారు.
|
6. To dwell H7931 in the clefts H6178 of the valleys H5158 , in caves H2356 of the earth H6083 , and in the rocks H3710 .
|
7. వారు పొదలలో అరుస్తారు. ముళ్ల కంపల్లో వారంతా ఒక్కచోట చేరుతారు.
|
7. Among H996 the bushes H7880 they brayed H5101 ; under H8478 the nettles H2738 they were gathered together H5596 .
|
8. వాళ్లు పనికిమాలిన అనామకుల గుంపు. వాళ్లు వారి దేశం నుండి బలవంతంగా వెళ్లగాట్టబడిన వాళ్లు.
|
8. They were children H1121 of fools H5036 , yea H1571 , children H1121 of base men H1097 H8034 : they were viler H5217 than H4480 the earth H776 .
|
9. “ఇప్పుడు ఆ మనుష్యుల కొడుకులు నన్ను హేళన చేసేందుకు నన్ను గూర్చి పాటలు పాడుతారు. వాళ్లకు నా పేరు చెడ్డ మాట అయింది.
|
9. And now H6258 am H1961 I their song H5058 , yea , I am H1961 their byword H4405 .
|
10. ఆ యువకులు నన్ను ద్వేషిస్తారు, వారు నాకు దూరంగా నిలుస్తారు, వారు నాకంటే మంచివాళ్లము అనుకొంటారు. చివరికి వాళ్లు నా ముఖం మీద ఉమ్మి కూడా వేస్తారు.
|
10. They abhor H8581 me , they flee far H7368 from H4480 me , and spare H2820 not H3808 to spit H7536 in my face H4480 H6440 .
|
11. నా వింటి నారిని దేవుడు తీసుకొని నన్ను బలహీనుణ్ణి చేశాడు. ఆ యువకులు తమని తాము వారించుకొనక నిండు కోపంతో నాకు విరోధంగా తిరుగుతారు.
|
11. Because H3588 he hath loosed H6605 my cord H3499 , and afflicted H6031 me , they have also let loose H7971 the bridle H7448 before H4480 H6440 me.
|
12. నా కుడి ప్రక్క ఆ యువకులు నామీద పడుతున్నారు. నేను పడిపోయేలా వాళ్లు చేస్తున్నారు. వారు నామీద దాడి చేసి, నన్ను నాశనం చేసేందుకు నా చుట్టూరా పట్టణానికి ముట్టడి దిబ్బ వేసినట్లు వేస్తున్నారు.
|
12. Upon H5921 my right H3225 hand rise H6965 the youth H6526 ; they push away H7971 my feet H7272 , and they raise up H5549 against H5921 me the ways H734 of their destruction H343 .
|
13. నేను పారిపోయే మార్గాన్ని ఆ యువకులు కాపలా కాస్తున్నారు. నన్ను నాశనం చేయటంలో వారువిజయం పొందుతున్నారు. వారు నన్ను నాశనం చేయటానికి వారికి ఎవరి సహాయం అవసరం లేదు.
|
13. They mar H5420 my path H5410 , they set forward H3276 my calamity H1942 , they have no H3808 helper H5826 .
|
14. గోడలోని కన్నంగుండా వెళ్లిపోయినట్టు వారు నామీద దాడి చేస్తున్నారు. వారు దూకేసి నా మీదకు విరగబడుతున్నారు.
|
14. They came H857 upon me as a wide H7342 breaking in H6556 of waters : in H8478 the desolation H7722 they rolled themselves H1556 upon me .
|
15. భయాలు నన్ను ఆవరించేస్తున్నాయి. వస్తువులనుగాలి చెదరగొట్టినట్లు ఆ యువకులు నా గౌరవాన్ని అవమానపరుస్తున్నారు. నా భద్రత మబ్బులా మాయమవుతోంది.
|
15. Terrors H1091 are turned H2015 upon H5921 me : they pursue H7291 my soul H5082 as the wind H7307 : and my welfare H3444 passeth away H5674 as a cloud H5645 .
|
16. “ఇప్పుడు నా జీవితం దాదాపు అయిపోయింది. నేను త్వరలోనే మరణిస్తాను. శ్రమదినాలు నన్ను పట్టివేశాయి.
|
16. And now H6258 my soul H5315 is poured out H8210 upon H5921 me ; the days H3117 of affliction H6040 have taken hold upon H270 me.
|
17. రాత్రివేళ నా ఎముకలు అన్నీ నొప్పెడతాయి. బాధ నన్ను నమిలివేయటం ఎన్నడూ ఆగిపోలేదు.
|
17. My bones H6106 are pierced H5365 in H4480 H5921 me in the night season H3915 : and my sinews H6207 take no rest H7901 H3808 .
|
18. దేవుడు మహాబలంగా నా చొక్కా పట్టి లాగుతున్నాడు. ఆయన నా బట్టలను నలిపి వేస్తున్నాడు.
|
18. By the great H7230 force H3581 of my disease is my garment H3830 changed H2664 : it bindeth me about H247 as the collar H6310 of my coat H3801 .
|
19. దేవుడు నన్ను బురదలో పడదోస్తున్నాడు. నేను మట్టిలా, బూడిదలా అయిపోతున్నాను.
|
19. He hath cast H3384 me into the mire H2563 , and I am become H4911 like dust H6083 and ashes H665 .
|
20. “దేవా, సహాయం కోసం నేను నీకు మొరపెడుతున్నాను. కానీ నీవు జవాబు ఇవ్వవు. నేను నిలబడి ప్రార్థన చెస్తాను. కానీ నీవు నాకు జవాబు ఇవ్వవు.
|
20. I cry H7768 unto H413 thee , and thou dost not H3808 hear H6030 me : I stand up H5975 , and thou regardest H995 me not .
|
21. దేవా, నీవు నా ఎడల అసహ్యంగా ప్రవర్తిస్తున్నావు. నన్ను బాధపెట్టేందుకు నీవు నీ శక్తిని ప్రయోగిస్తున్నావు.
|
21. Thou art become H2015 cruel H393 to me : with thy strong H6108 hand H3027 thou opposest thyself against H7852 me.
|
22. దేవా, బలమైన గాలి నన్ను కొట్టుకొని పోయేటట్టు నీవు చేస్తున్నావు. నీవు నన్ను తుఫానులో పడదోస్తున్నావు.
|
22. Thou liftest me up H5375 to H413 the wind H7307 ; thou causest me to ride H7392 upon it , and dissolvest H4127 my substance H7738 .
|
23. నీవు నన్ను నా మరణానికి తీసుకొని పోతున్నావని నాకు తెలుసు. మరణం ప్రతి మనిషికి ఏర్పాటు చేయబడిందే.
|
23. For H3588 I know H3045 that thou wilt bring H7725 me to death H4194 , and to the house H1004 appointed H4150 for all H3605 living H2416 .
|
24. “కానీ అప్పటికే నాశనమయి, సహాయంకోసం అలమటించేవాణ్ణి నిశ్చయంగా ఎవ్వరూ బాధించరు.
|
24. Howbeit H389 he will not H3808 stretch out H7971 his hand H3027 to the grave H1164 , though H518 they cry H7769 in his destruction H6365 .
|
25. దేవా, కష్టాల్లో ఉన్న ప్రజల పక్షంగా నేను మొర్ర పెట్టానని నీకు తెలుసు. పేద ప్రజల కోసం నా హృదయం ఎంతో విచారించిందని నీకు తెలుసు.
|
25. Did not H3808 I weep H1058 for him that was in trouble H7186 H3117 ? was not my soul H5315 grieved H5701 for the poor H34 ?
|
26. కానీ నేను మంచివాటి కోసం ఎదురు చూస్తే వాటికి బదులు చెడ్డవి జరిగాయి. వెలుగుకోసం నేను చూస్తే చీకటి వచ్చింది.
|
26. When H3588 I looked for H6960 good H2896 , then evil H7451 came H935 unto me : and when I waited H3176 for light H216 , there came H935 darkness H652 .
|
27. అంతరంగంలో నేను చీల్చివేయబడ్డాను. శ్రమలు ఎన్నటికీ ఆగిపోవు. శ్రమకాలాలు నా యెదుట ఉన్నాయి.
|
27. My bowels H4578 boiled H7570 , and rested H1826 not H3808 : the days H3117 of affliction H6040 prevented H6923 me.
|
28. నేను ఎల్లప్పుడూ ఎంతో విచారంగా ఉంటానుగాని, నాకు ఆదరణ లభ్యం కాదు. నేను సమాజంలో నిలబడి సహాయం కోసం కేకలు వేస్తాను.
|
28. I went H1980 mourning H6937 without H3808 the sun H2535 : I stood up H6965 , and I cried H7768 in the congregation H6951 .
|
29. నేను అడవి కుక్కలకు సోదరుడినయ్యాను. నిప్పుకోళ్లు నాకు జతగాళ్లు.
|
29. I am H1961 a brother H251 to dragons H8577 , and a companion H7453 to owls H1323 H3284 .
|
30. నా చర్మం చాలా నల్లబడిపోయింది. నా శరీరం జ్వరంతో వేడిగా ఉంది.
|
30. My skin H5785 is black H7835 upon H4480 H5921 me , and my bones H6106 are burned H2787 with H4480 heat H2721 .
|
31. దుఃఖమయ గీతాలు వాయించేందుకు నా స్వర మండలములను శృతి చేయబడింది. విచారంగా ఏడుస్తున్న శబ్దాలు నా పిల్లనగ్రోవి చేస్తుంది. PE
|
31. My harp H3658 also is H1961 turned to mourning H60 , and my organ H5748 into the voice H6963 of them that weep H1058 .
|