Bible Language
Telegu Old BSI Version

:

TEV
1. దేవా, రాజునకు నీ న్యాయవిధులను రాజకుమారునికి నీ నీతిని తెలియజేయుము.
1. A Psalm for Solomon H8010 . Give H5414 the king H4428 thy judgments H4941 , O God H430 , and thy righteousness H6666 unto the king H4428 's son H1121 .
2. నీతినిబట్టి నీ ప్రజలకును న్యాయవిధులనుబట్టి శ్రమ నొందిన నీ వారికిని అతడు న్యాయము తీర్చును.
2. He shall judge H1777 thy people H5971 with righteousness H6664 , and thy poor H6041 with judgment H4941 .
3. నీతినిబట్టి పర్వతములును చిన్నకొండలును ప్రజలకు నెమ్మది పుట్టించును.
3. The mountains H2022 shall bring H5375 peace H7965 to the people H5971 , and the little hills H1389 , by righteousness H6666 .
4. ప్రజలలో శ్రమనొందువారికి అతడు న్యాయము తీర్చును బీదల పిల్లలను రక్షించి బాధపెట్టువారిని నలగగొట్టును.
4. He shall judge H8199 the poor H6041 of the people H5971 , he shall save H3467 the children H1121 of the needy H34 , and shall break in pieces H1792 the oppressor H6231 .
5. సూర్యుడు నిలుచునంత కాలము చంద్రుడు నిలుచునంతకాలము తరములన్నిటను జనులు నీయందు భయభక్తులు కలిగియుందురు.
5. They shall fear H3372 thee as long H5973 as the sun H8121 and moon H3394 endure H6440 , throughout all generations H1755 H1755 .
6. గడ్డికోసిన బీటిమీద కురియు వానవలెను భూమిని తడుపు మంచి వర్షమువలెను అతడు విజ యము చేయును.
6. He shall come down H3381 like rain H4306 upon H5921 the mown grass H1488 : as showers H7241 that water H2222 the earth H776 .
7. అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు చంద్రుడు లేకపోవువరకు క్షేమాభివృద్ధి కలుగును.
7. In his days H3117 shall the righteous H6662 flourish H6524 ; and abundance H7230 of peace H7965 so long H5704 as the moon H3394 endureth H1097 .
8. సముద్రమునుండి సముద్రమువరకు యూఫ్రటీసునది మొదలుకొని భూదిగంతములవరకు అతడు రాజ్యము చేయును.
8. He shall have dominion H7287 also from sea H4480 H3220 to H5704 sea H3220 , and from the river H4480 H5104 unto H5704 the ends H657 of the earth H776 .
9. అరణ్యవాసులు అతనికి లోబడుదురు. అతని శత్రువులు మన్ను నాకెదరు.
9. They that dwell in the wilderness H6728 shall bow H3766 before H6440 him ; and his enemies H341 shall lick H3897 the dust H6083 .
10. తర్షీషు రాజులు ద్వీపముల రాజులు కప్పము చెల్లించె దరు షేబరాజులును సెబారాజులును కానుకలు తీసికొని వచ్చెదరు.
10. The kings H4428 of Tarshish H8659 and of the isles H339 shall bring H7725 presents H4503 : the kings H4428 of Sheba H7614 and Seba H5434 shall offer H7126 gifts H814 .
11. రాజులందరు అతనికి నమస్కారము చేసెదరు. అన్యజనులందరు అతని సేవించెదరు.
11. Yea, all H3605 kings H4428 shall fall down H7812 before him: all H3605 nations H1471 shall serve H5647 him.
12. దరిద్రులు మొఱ్ఱపెట్టగా అతడు వారిని విడిపించును. దీనులను నిరాధారులను అతడు విడిపించును.
12. For H3588 he shall deliver H5337 the needy H34 when he crieth H7768 ; the poor H6041 also , and him that hath no H369 helper H5826 .
13. నిరుపేదలయందును బీదలయందును అతడు కనిక రించును బీదల ప్రాణములను అతడు రక్షించును
13. He shall spare H2347 H5921 the poor H1800 and needy H34 , and shall save H3467 the souls H5315 of the needy H34 .
14. కపట బలాత్కారములనుండి అతడు వారి ప్రాణ మును విమోచించును. వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండును.
14. He shall redeem H1350 their soul H5315 from deceit H4480 H8496 and violence H4480 H2555 : and precious H3365 shall their blood H1818 be in his sight H5869 .
15. అతడు చిరంజీవియగును, షేబ బంగారము అతనికి ఇయ్యబడును. అతని క్షేమమునకై జనులు నిత్యము ప్రార్థన చేయు దురు దినమంతయు అతని పొగడుదురు.
15. And he shall live H2421 , and to him shall be given H5414 of the gold H4480 H2091 of Sheba H7614 : prayer H6419 also shall be made for H1157 him continually H8548 ; and daily H3605 H3117 shall he be praised H1288 .
16. దేశములోను పర్వత శిఖరములమీదను సస్య సమృద్ధి కలుగును దాని పంట లెబానోను వృక్షములవలె తాండవమాడు చుండును నేలమీది పచ్చికవలె పట్టణస్థులు తేజరిల్లుదురు.
16. There shall be H1961 a handful H6451 of corn H1250 in the earth H776 upon the top H7218 of the mountains H2022 ; the fruit H6529 thereof shall shake H7493 like Lebanon H3844 : and they of the city H4480 H5892 shall flourish H6692 like grass H6212 of the earth H776 .
17. అతని పేరు నిత్యము నిలుచును అతని నామము సూర్యుడున్నంతకాలము చిగుర్చు చుండును అతనినిబట్టి మనుష్యులు దీవింపబడుదురు అన్యజనులందరును అతడు ధన్యుడని చెప్పుకొందురు.
17. His name H8034 shall endure H1961 forever H5769 : his name H8034 shall be continued H5125 as long H6440 as the sun H8121 : and men shall be blessed H1288 in him: all H3605 nations H1471 shall call him blessed H833 .
18. దేవుడైన యెహోవా ఇశ్రాయేలుయొక్క దేవుడు స్తుతింపబడును గాక ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయువాడు.
18. Blessed H1288 be the LORD H3068 God H430 , the God H430 of Israel H3478 , who only H905 doeth H6213 wondrous things H6381 .
19. ఆయన మహిమగల నామము నిత్యము స్తుతింపబడును గాక సర్వభూమియు ఆయన మహిమతో నిండియుండును గాక. ఆమేన్‌ . ఆమేన్‌.
19. And blessed H1288 be his glorious H3519 name H8034 forever H5769 : and let H853 the whole H3605 earth H776 be filled H4390 with his glory H3519 ; Amen H543 , and Amen H543 .
20. యెష్షయి కుమారుడగు దావీదు ప్రార్థనలు ముగిసెను.
20. The prayers H8605 of David H1732 the son H1121 of Jesse H3448 are ended H3615 .