Bible Books

:

TEV
1. సొలొమోను యెహోవా మందిరమును తన నగరును కట్టించిన యిరువది సంవత్సరముల కాలము తీరిన తరువాత
1. And it came to pass H1961 at the end H4480 H7093 of twenty H6242 years H8141 , wherein H834 Solomon H8010 had built H1129 the house H1004 of the LORD H3068 , and his own house H1004 ,
2. హీరాము తనకిచ్చిన పట్టణములను సొలొమోను కట్టించి వాటిలో ఇశ్రాయేలీయులను కాపురముంచెను.
2. That the cities H5892 which H834 Huram H2438 had restored H5414 to Solomon H8010 , Solomon H8010 built H1129 them , and caused H853 the children H1121 of Israel H3478 to dwell H3427 there H8033 .
3. తరువాత సొలొమోను హమాతుసొబా అను స్థలమునకు పోయి దానిని పట్టుకొనెను.
3. And Solomon H8010 went H1980 to Hamath H2578 -zobah , and prevailed H2388 against H5921 it.
4. మరియు అరణ్య మందుండు తద్మోరుకును హమాతు దేశమందు ఖజానా ఉంచు పట్టణములన్నిటికిని ప్రాకారములను కట్టించెను.
4. And he built H1129 H853 Tadmor H8412 in the wilderness H4057 , and all H3605 the store H4543 cities H5892 , which H834 he built H1129 in Hamath H2574 .
5. ఇదియు గాక అతడు ఎగువ బేత్‌హోరోను దిగువ బేత్‌హోరోను గవునులు అడ్డగడలుగల ప్రాకారపట్టణములుగా కట్టించెను.
5. Also he built H1129 H853 Beth H1032 -horon the upper H5945 , and Beth H1032 -horon the nether H8481 , fenced H4692 cities H5892 , with walls H2346 , gates H1817 , and bars H1280 ;
6. బయలతును, ఖజానా ఉంచు పట్టణములన్నిటిని, రథములుంచు పట్టణములన్నిటిని, గుఱ్ఱపు రౌతులుండు పట్టణములన్నిటిని కట్టించెను. మరియు యెరూష లేమునందును లెబానోనునందును తాను ఏలు దేశములన్నిటియందును ప్రాకారపురములుగా కట్టించవలెనని తానుద్దేశించిన పట్టణములన్నిటిని సొలొమోను కట్టించెను.
6. And Baalath H1191 , and all H3605 the store H4543 cities H5892 that H834 Solomon H8010 had H1961 , and all H3605 the chariot H7393 cities H5892 , and the cities H5892 of the horsemen H6571 , and all H3605 that H834 Solomon H8010 desired H2837 H2836 to build H1129 in Jerusalem H3389 , and in Lebanon H3844 , and throughout all H3605 the land H776 of his dominion H4475 .
7. ఇశ్రాయేలీయుల సంబంధులు కాని హిత్తీయులలో నుండియు అమోరీయులలోనుండియు, పెరిజ్జీయులలో నుండియు, హివ్వీయులలోనుండియు, యెబూసీయులలో నుండియు, శేషించియున్న సకల జనులను
7. As for all H3605 the people H5971 that were left H3498 of H4480 the Hittites H2850 , and the Amorites H567 , and the Perizzites H6522 , and the Hivites H2340 , and the Jebusites H2983 , which H834 were not H3808 of Israel H4480 H3478 ,
8. ఇశ్రాయేలీ యులు నాశనముచేయక వదలివేసిన యా జనుల సంతతి వారిని సొలొమోను నేటివరకును తనకు వెట్టిపనులు చేయువారినిగా చేసికొనియుండెను.
8. But of H4480 their children H1121 , who H834 were left H3498 after H310 them in the land H776 , whom H834 the children H1121 of Israel H3478 consumed H3615 not H3808 , them did Solomon H8010 make to pay H5927 tribute H4522 until H5704 this H2088 day H3117 .
9. అయితే ఇశ్రా యేలీయులలో ఒకనినైనను సొలొమోను తన పనిచేయుటకు దాసునిగా నియమింపలేదు; వారిని యోధులుగాను తన అధిపతులలో ప్రధానులుగాను రథములకును గుఱ్ఱపు రౌతులకును అధిపతులుగాను నియమించెను.
9. But of H4480 the children H1121 of Israel H3478 did Solomon H8010 make H5414 no H3808 servants H5650 for his work H4399 ; but H3588 they H1992 were men H376 of war H4421 , and chief H8269 of his captains H7991 , and captains H8269 of his chariots H7393 and horsemen H6571 .
10. వీరిలో శ్రేష్ఠులైన రెండువందల ఏబదిమంది రాజైన సొలొమోను క్రింద అధిపతులై ప్రజలమీద అధికారులై యుండిరి.
10. And these H428 were the chief H8269 of king H4428 Solomon H8010 's officers H5324 , even two hundred H3967 and fifty H2572 , that bore rule H7287 over the people H5971 .
11. ఇశ్రాయేలీయుల రాజైన దావీదు నగరునందు నా భార్య నివాసముచేయవలదు, యెహోవా మందసమున్న స్థలములు ప్రతిష్ఠితములు అని చెప్పి, సొలొమోను ఫరోకుమార్తెను దావీదు పట్టణమునుండి తాను ఆమెకొరకు కట్టించిన నగరునకు రప్పించెను.
11. And Solomon H8010 brought up H5927 the daughter H1323 of Pharaoh H6547 out of the city H4480 H5892 of David H1732 unto the house H1004 that H834 he had built H1129 for her: for H3588 he said H559 , My wife H802 shall not H3808 dwell H3427 in the house H1004 of David H1732 king H4428 of Israel H3478 , because H3588 the places are holy H6944 , whereunto H834 H413 the ark H727 of the LORD H3068 hath come H935 .
12. అది మొదలుకొని సొలొమోను తాను మంటపము ఎదుట కట్టించిన యెహోవా బలిపీఠముమీద దహనబలులు అర్పించుచు వచ్చెను. అతడు అనుదిన నిర్ణ యముచొప్పున
12. Then H227 Solomon H8010 offered H5927 burnt offerings H5930 unto the LORD H3068 on H5921 the altar H4196 of the LORD H3068 , which H834 he had built H1129 before H6440 the porch H197 ,
13. మోషే యిచ్చిన ఆజ్ఞనుబట్టి విశ్రాంతి దినములయందును, అమావాస్యలయందును, నియామక కాలములయందును, సంవత్సరమునకు ముమ్మారుజరుగు పండుగలయందును, అనగా పులియని రొట్టెల పండుగయందును వారముల పండుగయందును పర్ణశాలల పండుగయందును యెహోవాకు దహనబలులు అర్పించుచు వచ్చెను.
13. Even after a certain rate H1697 every day H3117 H3117 , offering H5927 according to the commandment H4687 of Moses H4872 , on the sabbaths H7676 , and on the new moons H2320 , and on the solemn feasts H4150 , three H7969 times H6471 in the year H8141 , even in the feast H2282 of unleavened bread H4682 , and in the feast H2282 of weeks H7620 , and in the feast H2282 of tabernacles H5521 .
14. అతడు తన తండ్రియైన దావీదు చేసిన నిర్ణయమునుబట్టి వారి వారి సేవాధర్మములను జరుపుకొనుటకై వారి వారి వంతుల చొప్పున యాజకులను వారి సేవకును, కట్టడనుబట్టి అను దినమున యాజకుల సముఖమున స్తుతిచేయుటకును, ఉప చారకులుగా ఉండుటకును, వంతులచొప్పున లేవీయులను, ద్వారములన్నిటి దగ్గర కావలి యుండుటకై వారి వారి వంతులచొప్పున ద్వారపాలకులను నియమించెను; దైవ జనుడైన దావీదు ఆలాగుననే యాజ్ఞ ఇచ్చియుండెను.
14. And he appointed H5975 , according to the order H4941 of David H1732 his father H1 , H853 the courses H4256 of the priests H3548 to H5921 their service H5656 , and the Levites H3881 to H5921 their charges H4931 , to praise H1984 and minister H8334 before H5048 the priests H3548 , as the duty H1697 of every day required H3117 H3117 : the porters H7778 also by their courses H4256 at every gate H8179 H8179 : for H3588 so H3651 had David H1732 the man H376 of God H430 commanded H4687 .
15. విషయమును గూర్చియేగాని బొక్కసములను గూర్చియే గాని రాజు యాజకులకును లేవీయులకును చేసియున్న నిర్ణ యమును బట్టి వారు సమస్తమును జరుపుచువచ్చిరి
15. And they departed H5493 not H3808 from the commandment H4687 of the king H4428 unto H5921 the priests H3548 and Levites H3881 concerning any H3605 matter H1697 , or concerning the treasures H214 .
16. యెహోవా మందిరమునకు పునాదివేసిన దినము మొదలుకొని అది సంపూర్ణమగువరకు సొలొమోను పని యంతయు చేయించెను; అప్పుడు యెహోవా మందిరము సమాప్త మాయెను.
16. Now all H3605 the work H4399 of Solomon H8010 was prepared H3559 unto H5704 the day H3117 of the foundation H4143 of the house H1004 of the LORD H3068 , and until H5704 it was finished H3615 . So the house H1004 of the LORD H3068 was perfected H8003 .
17. సొలొమోను ఎదోము దేశముయొక్క సముద్రపు దరినున్న ఎసోన్గెబెరునకును ఏలతునకును పోగా
17. Then H227 went H1980 Solomon H8010 to Ezion H6100 -geber , and to H413 Eloth H359 , at H5921 the sea H3220 side H8193 in the land H776 of Edom H123 .
18. హీరాము తన పనివారిద్వారా ఓడలను ఓడ నడుపుటయందు యుక్తి గల పనివారిని పంపెను. వీరు సొలొమోను పనివారితో కూడ ఓఫీరునకు పోయి అక్కడనుండి తొమి్మదివందల మణుగుల బంగారమును ఎక్కించుకొని రాజైన సొలొమోను నొద్దకు తీసికొని వచ్చిరి.
18. And Huram H2361 sent H7971 him by the hands H3027 of his servants H5650 ships H591 , and servants H5650 that had knowledge H3045 of the sea H3220 ; and they went H935 with H5973 the servants H5650 of Solomon H8010 to Ophir H211 , and took H3947 thence H4480 H8033 four H702 hundred H3967 and fifty H2572 talents H3603 of gold H2091 , and brought H935 them to H413 king H4428 Solomon H8010 .
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×