Bible Versions
Bible Books

Job 33 (TEV) Telegu Old BSI Version

1 యోబూ, దయచేసి నా వాదము నాలకించుము నా మాటలన్నియు చెవిని బెట్టుము.
2 ఇదిగో నేను మాటలాడ నారంభించితిని నా నోట నా నాలుక ఆడుచున్నది.
3 నామాటలు నా హృదయ యథార్థతను తెలుపుచున్నవినా పెదవులు జ్ఞానమును యథార్థముగా పలుకును.
4 దేవుని ఆత్మ నన్ను సృజించెను సర్వశక్తునియొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను
5 నీ చేతనైనయెడల నాకుత్తరమిమ్ము నా యెదుట నీ వాదము సిద్ధపరచుకొనుము వ్యాజ్యె మాడుము.
6 దేవునియెడల నేనును నీవంటివాడను నేనును జిగటమంటితో చేయబడినవాడనే
7 నావలని భయము నిన్ను బెదరించదు నా చెయ్యి నీమీద బరువుగా నుండదు.
8 నిశ్చయముగా నీ పలుకులు నా చెవినిబడెను నీ మాటల ధ్వని నాకు వినబడెను.
9 ఏమనగానేను నేరములేని పవిత్రుడను మాలిన్యములేని పాపరహితుడను.
10 ఆయన నామీద తప్పులు పట్టించుటకు సమయము వెదకుచున్నాడు నన్ను తనకు పగవానిగా భావించుచున్నాడు.
11 ఆయన నా కాళ్లను బొండలో బిగించుచున్నాడు. నా త్రోవలన్నిటిని కనిపెట్టుచున్నాడని నీ వను చున్నావు.
12 విషయములో నీవు న్యాయము కనిపెట్టలేదు నేను నీకు ప్రత్యుత్తరము చెప్పెదను.
13 తన క్రియలలో దేనిగూర్చియు ఆయన ప్రత్యుత్తర మియ్యడు దేవుడు నరులశక్తికిమించినవాడు, నీవేల ఆయనతో పోరాడుదువు?
14 దేవుడు ఒక్కమారే పలుకును రెండు మారులు పలుకును అయితే మనుష్యులు అది కనిపెట్టరు
15 మంచముమీద కునుకు సమయమున గాఢనిద్ర పట్టు నప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములలో
16 నరులు గర్విష్ఠులు కాకుండచేయునట్లు తాము తలచిన కార్యము వారు మానుకొనచేయునట్లు
17 గోతికి పోకుండ వారిని కాపాడునట్లు కత్తివలన నశింపకుండ వారి ప్రాణమును తప్పించునట్లు
18 ఆయన వారి చెవులను తెరవచేయును వారికొరకు ఉపదేశము సిద్ధపరచును.
19 వ్యాధిచేత మంచమెక్కుటవలనను ఒకని యెముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణము నొందును
20 రొట్టెయు రుచిగల ఆహారమును వానికసహ్యమగును
21 వాని శరీరమాంసము క్షీణించిపోయి వికారమగును బయటికి కనబడకుండిన యెముకలు పైకి పొడుచు కొని వచ్చును
22 వాడు సమాధికి సమీపించును వాని ప్రాణము సంహారకులయొద్దకు సమీపించును.
23 నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియ జేయుటకువేలాది దూతలలో ఘనుడగు ఒకడు వానికి మధ్యవర్తియై యుండినయెడల
24 దేవుడు వానియందు కరుణ జూపి పాతాళములోనికి దిగి వెళ్లకుండ వానిని విడిపించును ప్రాయశ్చిత్తము నాకు దొరకెనని సెలవిచ్చును.
25 అప్పుడు వాని మాంసము బాలురమాంసముకన్న ఆరో గ్యముగా నుండును. వానికి తన చిన్ననాటిస్థితి తిరిగి కలుగును.
26 వాడు దేవుని బతిమాలుకొనినయెడల ఆయన వానిని కటాక్షించును కావున వాడు ఆయన ముఖము చూచి సంతోషిం చును ఈలాగున నిర్దోషత్వము ఆయన నరునికి దయచేయును.
27 అప్పుడు వాడు మనుష్యులయెదుట సంతోషించుచు ఇట్లని పలుకును యథార్థమైనదానిని వ్యత్యాసపరచి నేను పాపము చేసితిని అయినను దానికి తగిన ప్రతికారము నాకు చేయబడ లేదు
28 కూపములోనికి దిగిపోకుండ నా ప్రాణమును ఆయన విమోచించియున్నాడు నా జీవము వెలుగును చూచుచున్నది.
29 ఆలోచించుము, నరులు సజీవులకుండు వెలుగుచేత వెలిగింపబడునట్లు
30 కూపములోనుండి వారిని మరల రప్పింపవలెనని మానవులకొరకు రెండు సారులు మూడు సారులు క్రియలన్నిటిని దేవుడు చేయువాడైయున్నాడు.
31 యోబూ, చెవిని బెట్టుము నా మాట ఆలకింపుము మౌనముగా నుండుము నేను మాటలాడెదను.
32 చెప్పవలసిన మాట యేదైన నీకున్నయెడల నాతో ప్రత్యుత్తరము చెప్పుము మాటలాడుము, నీవు నీతిమంతుడవని స్థాపింప గోరు చున్నాను.
33 మాట యేమియు లేనియెడల నీవు నా మాట ఆలకింపుము మౌనముగా నుండుము, నేను నీకు జ్ఞానము బోధించె దను.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×