Bible Versions
Bible Books

Joshua 19 (TEV) Telegu Old BSI Version

1 రెండవ వంతు చీటి షిమ్యోనీయుల పక్షముగా, అనగా వారి వంశములచొప్పున షిమ్యోనీయుల గోత్ర పక్షముగా వచ్చెను. వారి స్వాస్థ్యము యూదా వంశస్థుల స్వాస్థ్యము మధ్యనుండెను.
2 వారికి కలిగిన స్వాస్థ్య మేదనగా బెయేర్షెబా షెబ మోలాదా
3 హజర్షువలు బాలా ఎజెము ఎల్తోలదు బేతూలు హోర్మా
4 సిక్లగు బేత్మర్కాబోదు హజర్సూసా
5 బేత్లెబాయోతు షారూ హెను అనునవి,
6 వాటి పల్లెలు పోగా పదమూడు పట్టణ ములు.
7 అయీను రిమ్మోను ఎతెరు ఆషానును అనునవి; వాటి పల్లెలు పోగా నాలుగు పట్టణములు.
8 దక్షిణమున రామతను బాలత్బెయేరువరకు పట్టణ ముల చుట్టునున్న పల్లెలన్నియు ఇవి షిమ్యోనీయుల గోత్రమునకు వారి వంశములచొప్పున కలిగిన స్వాస్థ్యము.
9 షిమ్యోనీయుల స్వాస్థ్యము యూదా వంశస్థుల వంతులోని భాగము; ఏలయనగా యూదా వంశస్థుల భాగము వారికి ఎక్కువ గనుక వారి స్వాస్థ్యము నడుమను షిమ్యోనీయులు స్వాస్థ్యము పొందిరి.
10 మూడవవంతు చీటి వారి వంశముచొప్పున జెబూలూ నీయుల పక్షముగా వచ్చెను. వారి స్వాస్థ్యపు సరిహద్దు శారీదువరకు సాగెను.
11 వారి సరిహద్దు పడ మటివైపుగా మరలావరకును దబ్బాషతువరకును సాగి యొక్నెయాము నకు ఎదురుగానున్న యేటివరకు వ్యాపించి
12 శారీదునుండి సూర్యోదయ దిక్కున కిస్లోత్తాబోరు సరిహద్దువరకు దాబె రతునుండి యాఫీయకు ఎక్కి
13 అక్కడనుండి తూర్పు తట్టు గిత్తహెపెరువరకును ఇత్కా చీనువరకును సాగి నేయావరకు వ్యాపించు రిమ్మోనుదనుక పోయెను.
14 దాని సరిహద్దు హన్నాతోనువరకు ఉత్తరదిక్కున చుట్టుకొని అక్కడనుండి యిప్తాయేలు లోయలో నిలిచెను.
15 కట్టాతు నహలాలు షిమ్రోను ఇదలా బేత్లెహేము అను పండ్రెండు పట్టణములును వాటి పల్లెలును.
16 పట్టణము లును వాటి పల్లెలును వారి వంశములచొప్పున జెబూలూ నీయులకు కలిగిన స్వాస్థ్యము.
17 నాలుగవ వంతు చీటి వారి వంశములచొప్పున ఇశ్శా ఖారీయుల పక్షముగా వచ్చెను.
18 వారి సరిహద్దు యెజ్రె యేలు కెసుల్లోతు షూనేము హపరాయిము షీయోను అనహరాతు రబ్బీతు కిష్యోను
19 అబెసు రెమెతు ఏన్గన్నీము
20 ఏన్‌హద్దా బేత్పస్సెసు అను స్థలములవరకు
21 సాగి తాబోరు షహచీమా బేత్షెమెషు
22 అను స్థలములను దాటి యొర్దాను వరకు వ్యాపించెను.
23 వాటి పల్లెలు గాక పదుమూడు పట్టణములు వారి కాయెను. అవి వాటి పల్లెలతో కూడ వారి వంశముల చొప్పున ఇశ్శాఖారీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము.
24 అయిదవ వంతు చీటి వారి వంశములచొప్పున ఆషేరీ యుల పక్షముగా వచ్చెను.
25 వారి సరిహద్దు హెల్క తుహలి బెతెను అక్షాపు
26 అలమ్మేలెకు అమాదు మిషె యలు. పడమట అది కర్మెలువరకును షీహోర్లిబ్నాతు వరకును సాగి
27 తూర్పుదిక్కున బేత్దాగోనువరకు తిరిగి జెబూలూను భాగమును యిప్తాయేలు లోయను దాటి బేతేమెకునకును నెయీయేలునకును ఉత్తర దిక్కునపోవుచు
28 ఎడమవైపున అది కాబూలువరకును హెబ్రోను రెహోబు హమ్మోను కానా పెద్ద సీదోనుల వరకును వ్యాపించెను.
29 అక్కడనుండి సరిహద్దు రామావరకును కోటగల సోరను పట్టణమువరకును వ్యాపించి అక్కడనుండి తిరిగి హోసా వరకు సాగి అక్కడనుండి అక్జీబు సరిహద్దునుపట్టి సముద్రమువరకు సాగెను.
30 ఉమ్మా ఆఫెకు రెహోబు వాటి పల్లెలతో కూడ అవి యిరువదిరెండు పట్టణములు.
31 వాటి పల్లెలతో కూడ పట్టణములు వారి వంశములచొప్పున ఆషేరీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము.
32 ఆరవ వంతు చీటి వారి వంశములచొప్పున నఫ్తాలీ యుల పక్షమున వచ్చెను.
33 వారి సరిహద్దు హెలెపును జయనన్నీములోని సిందూరవనమును అదామియను కను మను యబ్నెయేలును మొదలుకొని లక్కూము వరకు సాగి
34 అక్కడనుండి పడమరగా అజనోత్తాబోరు వరకు వ్యాపించి అక్కడనుండి హుక్కోకువరకు దక్షిణదిక్కున జెబూ లూనును, పడమట ఆషేరును దాటి తూర్పున యొర్దాను నొద్ద యూదావరకును వ్యాపించెను.
35 కోటగల పట్ట ణము లేవనగా జిద్దీము జేరు హమ్మతు రక్కతు కిన్నెరెతు
36 అదామా రామా హాసోరు
37 కెదెషు ఎద్రెయీ ఏన్‌హాసోరు
38 ఇరోను మిగ్దలేలు హొరేము బేతనాతు బేత్షెమెషు అను నవి; వాటి పల్లెలుగాక పందొమి్మది పట్టణములు.
39 పట్ట ణములును వాటి పల్లెలును వారి వంశములచొప్పున నఫ్తాలీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము.
40 ఏడవ వంతు చీటి వారి వంశములచొప్పున దానీయుల పక్షముగా వచ్చెను.
41 వారి స్వాస్థ్యపు సరిహద్దు జొర్యా
42 ఎష్తాయోలు ఇర్షెమెషు షెయల్బీను
43 అయ్యా లోను యెతా ఏలోను
44 తిమ్నా ఎక్రోను ఎత్తెకే గిబ్బెతోను
45 బాలాతా యెహుదు బెనేబెరకు
46 గత్రిమ్మోను మేయర్కోను రక్కోను యాపో అను స్థలములకు వ్యాపించెను.
47 దానీ యుల సరిహద్దు వారియొద్దనుండి అవతలకు వ్యాపించెను. దానీయులు బయలుదేరి లెషెముమీద యుద్ధముచేసి దాని పట్టుకొని కొల్లపెట్టి స్వాధీనపరచుకొని దానిలో నివసించి తమ పితరుడైన దాను పేరునుబట్టి లెషెమునకు దానను పేరు పెట్టిరి.
48 వాటి పల్లెలుగాక యీ పట్టణములు వారి వంశ ములచొప్పున దానీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము.
49 సరిహద్దులను బట్టి దేశమును స్వాస్థ్యములుగా పంచి పెట్టుట ముగించిన తర్వాత ఇశ్రాయేలీయులు నూను కుమారుడైన యెహోషువకు స్వాస్థ్యమిచ్చిరి.
50 యెహోవా సెలవిచ్చిన దానినిబట్టి వారు అతడు అడిగిన పట్టణమును, అనగా ఎఫ్రాయిమీయుల మన్యప్రదేశములోనున్న తిమ్న త్సెరహును అతని కిచ్చిరి. అతడు పట్టణమును కట్టించి దానిలోనివసించెను.
51 యాజకుడైన ఎలియాజ రును నూను కుమారుడైన యెహోషువయు ఇశ్రాయేలీ యుల గోత్రములయొక్క పితరుల కుటుంబములలోని ముఖ్యులును షిలోహులోనున్న ప్రత్యక్షపు గుడారము నొద్ద యెహోవా సన్నిధిని చీట్ల వలన పంపకముచేసిన స్వాస్థ్యములు ఇవి. అప్పుడు వారు దేశమును పంచిపెట్టుట ముగించిరి.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×