Bible Versions
Bible Books

Leviticus 24 (TEV) Telegu Old BSI Version

1 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెల విచ్చెను
2 దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనెను తేవలెనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము.
3 ప్రత్యక్షపు గుడార ములో శాసనముల అడ్డ తెరకు వెలుపల అహరోను సాయంకాలము మొదలుకొని ఉదయమువరకు అది వెలుగు నట్లుగా యెహోవా సన్నిధిని దాని చక్కపరచవలెను. ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ.
4 అతడు నిర్మల మైన దీపవృక్షము మీద ప్రదీపములను యెహోవా సన్నిధిని నిత్యము చక్కపరచవలెను.
5 నీవు గోధుమలపిండిని తీసికొని దానితో పండ్రెండు భక్ష్యములను వండవలెను. ఒక్కొక్క భక్ష్యమున సేరు సేరు పిండి యుండవలెను.
6 యెహోవా సన్నిధిని నిర్మల మైన బల్లమీద ఆరేసి భక్ష్యములు గల రెండు దొంతులుగా వాటిని ఉంచవలెను.
7 ఒక్కొక్క దొంతిమీద స్వచ్ఛమైన సాంబ్రాణి ఉంచవలెను. అది యెహోవాయెదుట మీ ఆహారమునకు జ్ఞాపకార్థమైన హోమముగా ఉండును.
8 యాజకుడు ప్రతి విశ్రాంతి దినమున నిత్య నిబంధననుబట్టి ఇశ్రాయేలీయుల యొద్ద దాని తీసికొని నిత్యము యెహోవా సన్నిధిని చక్కపరచవలెను.
9 అది అహరోనుకును అతని సంతతి వారికి ఉండవలెను. వారు పరిశుద్ధస్థలములో దాని తినవలెను. నిత్యమైన కట్టడ చొప్పున యెహోవాకు చేయు హోమములలో అది అతి పరిశుద్ధము.
10 ఇశ్రాయేలీయురాలగు ఒక స్త్రీకిని ఐగుప్తీయుడగు ఒక పురుషునికిని పుట్టినవాడొకడు ఇశ్రాయేలీయుల మధ్యకు వచ్చెను.
11 ఇశ్రాయేలీయురాలి కుమారునికిని ఒక ఇశ్రాయేలీయునికిని పాళెములో పోరుపడగా ఇశ్రాయేలీయురాలి కుమారుడు యెహోవా నామమును దూషించి శపింపగా జనులు మోషేయొద్దకు వాని తీసి కొనివచ్చిరి. వాని తల్లిపేరు షెలోమీతు; ఆమె దాను గోత్రికుడైన దిబ్రీకుమారె
12 యెహోవా యేమి సెల విచ్చునో తెలిసికొనువరకు వానిని కావలిలో ఉంచిరి.
13 అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను.
14 శపించినవానిని పాళెము వెలుపలికి తీసి కొనిరమ్ము; వాని శాపవచనమును వినినవారందరు వాని తలమీద తమ చేతు లుంచిన తరువాత సర్వసమాజము రాళ్లతో వాని చావ గొట్టవలెను.
15 మరియు నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుముతన దేవుని శపించువాడు తన పాపశిక్షను భరింపవలెను.
16 యెహోవా నామమును దూషించువాడు మరణశిక్ష నొందవలెను; సర్వసమాజము రాళ్లతో అట్టి వానిని చావ గొట్టవలెను. పరదేశియేగాని స్వదేశియేగాని యెహోవా నామమును దూషించిన యెడల వానికి మరణశిక్ష విధింపవలెను.
17 ఎవడైనను ఒకనిని ప్రాణహత్యచేసిన యెడల వానికి మరణశిక్ష విధింపవలెను.
18 జంతు ప్రాణహత్య చేసినవాడు ప్రాణమునకు ప్రాణమిచ్చి దాని నష్టము పెట్టుకొనవలెను.
19 ఒకడు తన పొరుగు వానికి కళంకము కలుగజేసినయెడల వాడు చేసినట్లు వానికి చేయవలెను.
20 విరుగగొట్టబడిన దాని విషయ ములో విరుగగొట్టబడుటయే శిక్ష. కంటికి కన్ను పంటికి పల్లు, చెల్లవలెను. వాడు ఒకనికి కళంకము కలుగజేసి నందున వానికి కళంకము కలుగజేయవలెను.
21 జంతువును చావగొట్టినవాడు దాని నష్టము నిచ్చుకొనవలెను. నరహత్య చేసినవానికి మరణశిక్ష విధింపవలెను.
22 మీరు పక్షపాతము లేక తీర్పుతీర్చవలెను. మీలోనున్న పరదేశికి మీరు చేసినట్టు మీ స్వదేశికిని చేయవలెను. నేను మీ దేవుడ నైన యెహోవానని వారితో చెప్పుము అనెను.
23 కాబట్టి మోషే ఇశ్రాయేలీయులతో ఈలాగు చెప్పెనుశపించిన వానిని పాళెము వెలుపలికి తీసికొనిపోయి రాళ్లతో వాని చావగొట్టవలెను, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు ఇశ్రాయేలీయులు చేసిరి.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×