|
|
1. మరియు యెహోవా దూతయెదుట ప్రధాన యాజకు డైన యెహోషువ నిలువబడుటయు, సాతాను ఫిర్యాదియై అతని కుడిపార్శ్వమున నిలువబడుటయు అతడు నాకు కనుపరచెను.
|
1. And he showed H7200 me H853 Joshua H3091 the high H1419 priest H3548 standing H5975 before H6440 the angel H4397 of the LORD H3068 , and Satan H7854 standing H5975 at H5921 his right hand H3225 to resist H7853 him.
|
2. సాతానూ, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొను యెహోవా నిన్ను గద్దించును ఇతడు అగ్నిలోనుండి తీసిన కొరవివలెనే యున్నాడుగదా అని యెహోవా దూత సాతానుతో అనెను.
|
2. And the LORD H3068 said H559 unto H413 Satan H7854 , The LORD H3068 rebuke H1605 thee , O Satan H7854 ; even the LORD H3068 that hath chosen H977 Jerusalem H3389 rebuke H1605 thee: is not H3808 this H2088 a brand H181 plucked H5337 out of the fire H4480 H784 ?
|
3. యెహోషువ మలిన వస్త్రములు ధరించినవాడై దూత సముఖములో నిలువబడియుండగా
|
3. Now Joshua H3091 was H1961 clothed H3847 with filthy H6674 garments H899 , and stood H5975 before H6440 the angel H4397 .
|
4. దూత దగ్గర నిలిచియున్నవారిని పిలిచిఇతని మైలబట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించినేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చెను.
|
4. And he answered H6030 and spoke H559 unto H413 those that stood H5975 before H6440 him, saying H559 , Take away H5493 the filthy H6674 garments H899 from H4480 H5921 him . And unto H413 him he said H559 , Behold H7200 , I have caused thine iniquity H5771 to pass H5674 from H4480 H5921 thee , and I will clothe H3847 thee with change of raiment H4254 .
|
5. అతని తలమీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవిచేయగా వారు అతని తలమీద తెల్లని పాగాపెట్టి వస్త్రములతో అతనిని అలంకరించిరి; యెహోవా దూత దగ్గర నిలు చుండెను.
|
5. And I said H559 , Let them set H7760 a fair H2889 miter H6797 upon H5921 his head H7218 . So they set H7760 a fair H2889 miter H6797 upon H5921 his head H7218 , and clothed H3847 him with garments H899 . And the angel H4397 of the LORD H3068 stood by H5975 .
|
6. అప్పుడు యెహోవా దూత యెహోషువకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను.
|
6. And the angel H4397 of the LORD H3068 protested H5749 unto Joshua H3091 , saying H559 ,
|
7. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగానా మార్గములలొ నడుచుచు నేను నీ కప్పగించిన దానిని భద్రముగా గైకొనిన యెడల, నీవు నా మందిరముమీద అధికారివై నా ఆవరణ ములను కాపాడువాడవగుదువు; మరియు ఇక్కడ నిలువ బడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీ కిత్తును.
|
7. Thus H3541 saith H559 the LORD H3068 of hosts H6635 ; If H518 thou wilt walk H1980 in my ways H1870 , and if H518 thou wilt keep H8104 H853 my charge H4931 , then thou H859 shalt also H1571 judge H1777 H853 my house H1004 , and shalt also H1571 keep H8104 my H853 courts H2691 , and I will give H5414 thee places to walk H4108 among H996 these H428 that stand H5975 by.
|
8. ప్రధానయాజకుడవైన యెహోషువా, నీ యెదుట కూర్చుండు నీ సహకారులు సూచనలుగా ఉన్నారు; నీవును వారును నా మాట ఆలకింపవలెను, ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోవు చున్నాను.
|
8. Hear H8085 now H4994 , O Joshua H3091 the high H1419 priest H3548 , thou H859 , and thy fellows H7453 that sit H3427 before H6440 thee: for H3588 they H1992 are men H376 wondered H4159 at: for H3588 , behold H2009 , I will bring forth H935 H853 my servant H5650 the BRANCH H6780 .
|
9. యెహోషువ యెదుట నేనుంచిన రాతిని తేరి చూడుడి, ఆ రాతికి ఏడు నేత్రములున్నవి, దాని చెక్కడపు పని చేయువాడను నేను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు; మరియు ఒక దినము లోగానే నేను ఈ దేశముయొక్క దోషమును పరిహ రింతును;
|
9. For H3588 behold H2009 the stone H68 that H834 I have laid H5414 before H6440 Joshua H3091 ; upon H5921 one H259 stone H68 shall be seven H7651 eyes H5869 : behold H2009 , I will engrave H6605 the graving H6603 thereof, saith H5002 the LORD H3068 of hosts H6635 , and I will remove H4185 H853 the iniquity H5771 of that H1931 land H776 in one H259 day H3117 .
|
10. ఆ దినమున ద్రాక్షచెట్లక్రిందను అంజూరపు చెట్ల క్రిందను కూర్చుండుటకు మీరందరు ఒకరినొకరు పిలుచుకొని పోవుదురు; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.
|
10. In that H1931 day H3117 , saith H5002 the LORD H3068 of hosts H6635 , shall ye call H7121 every man H376 his neighbor H7453 under H413 H8478 the vine H1612 and under H413 H8478 the fig tree H8384 .
|