Bible Language Cross References for the verse Psalms 18:0 in TEV
- 1 యెహోషువ హాయిని పట్టుకొనిన సంగతియు; అతడు యెరికోను దాని రాజును నిర్మూలముచేసినట్టు హాయిని దాని రాజును నిర్మూలముచేసిన సంగతియు, గిబియోను నివాసులు ఇశ్రాయేలీయులతో సంధిచేసికొని వారితో కలిసికొనిన సంగతియు యెరూషలేము రాజైన అదోనీసెదకు వినినప్పుడు అతడును అతని జనులును మిగుల భయపడిరి.
- 2 ఏలయనగా గిబియోను గొప్ప పట్టణమై రాజధానులలో ఎంచబడినది; అది హాయికంటె గొప్పది, అక్కడి జనులందరు శూరులు. అంతట యెరూషలేము రాజైన అదోనీసెదెకుగిబియోనీయులు యెహోషువతోను ఇశ్రాయేలీయులతోను సంధిచేసియున్నారు. మీరు నాయొద్దకు వచ్చి నాకు సహాయము చేసినయెడల మనము వారి పట్టణమును నాశనము చేయుదమని
- 3 హెబ్రోను రాజైన హోహామునొద్దకును, యర్మూతు రాజైన పిరాము నొద్దకును,
- 4 లాకీషురాజైన యాఫీయ యొద్దకును ఎగ్లోను రాజైన దెబీరునొద్దకును వర్తమానము పంపెను.
- 5 కాబట్టి అమోరీయుల అయిదుగురురాజులను, అనగా యెరూష లేము రాజును హెబ్రోను రాజును యర్మూతు రాజును లాకీషు రాజును ఎగ్లోను రాజును కూడుకొని, తామును తమ సేనలన్నియు బయలుదేరి, గిబియోను ముందర దిగి, గిబియోనీయులతో యుద్ధముచేసిరి.
- 6 గిబియోనీయులుమన్యములలో నివసించు అమోరీయుల రాజులందరు కూడి మా మీదికిదండెత్తి వచ్చియున్నారు గనుక, నీ దాసులను చెయ్యి విడువక త్వరగా మాయొద్దకు వచ్చి మాకు సహా యముచేసి మమ్మును రక్షించుమని గిల్గాలులో దిగియున్న పాళెములో యెహోషువకు వర్తమానము పంపగా
- 7 యెహో షువయును అతనియొద్దనున్న యోధులందరును పరాక్రమ ముగల శూరులందరును గిల్గాలునుండి బయలుదేరిరి.
- 8 అప్పుడు యెహోవావారికి భయపడకుము, నీ చేతికి వారిని అప్పగించియున్నాను, వారిలో ఎవడును నీ యెదుట నిలువడని యెహోషువతో సెలవియ్యగా
- 9 యెహోషువ గిల్గాలునుండి ఆ రాత్రి అంతయు నడచి వారిమీద హఠా త్తుగాపడెను.
- 10 అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయుల యెదుట వారిని కలవరపరచగా యెహోషువ గిబియోను నెదుట మహా ఘోరముగా వారిని హతముచేసెను. బేత్ హోరోనుకు పైకి పోవుమార్గమున అజేకావరకును మక్కేదావరకును యోధులు వారిని తరిమి హతము చేయుచు వచ్చిరి.
- 11 మరియు వారు ఇశ్రాయేలీయుల యెదుటనుండి బేత్ హోరోనుకు దిగిపోవుత్రోవను పారి పోవుచుండగా, వారు అజేకాకు వచ్చువరకు యెహోవా ఆకాశమునుండి గొప్ప వడగండ్లను వారిమీద పడవేసెను గనుక వారు దానిచేత చనిపోయిరి. ఇశ్రాయేలీయులు కత్తివాత చంపిన వారికంటె ఆ వడగండ్లచేత చచ్చినవారు ఎక్కువ మందియయిరి.
- 12 యెహోవా ఇశ్రాయేలీయుల యెదుట అమోరీయు లను అప్పగించిన దినమున, ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువులమీద పగతీర్చుకొనువరకు సూర్యుడు నిలిచెను చంద్రుడు ఆగెను. అను మాట యాషారు గ్రంథములో వ్రాయబడియున్నది గదా.
- 13 సూర్యుడు ఆకాశమధ్యమున నిలిచి యించు మించు ఒక నా డెల్ల అస్తమింప త్వరపడలేదు.
- 14 యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినమువంటి దినము దానికి ముందేగాని దానికి తరువాతనేగాని యుండలేదు; నాడు యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేసెను.
- 15 అప్పుడు యెహోషువయు అతనితోకూడ ఇశ్రాయేలీయులందరును గిల్గాలులోనున్న పాళెములోనికి తిరిగి వచ్చిరి.
- 16 ఆ రాజులయిదుగురు పారిపోయి మక్కేదాయందలి గుహలో దాగియుండిరి.
- 17 మక్కేదాయందలి గుహలో దాగియున్న ఆ రాజులయిదుగురు దొరికిరని యెహోషు వకు తెలుపబడినప్పుడు
- 18 యెహోషువఆ గుహ ద్వార మున కడ్డముగా గొప్ప రాళ్లను దొర్లించి వారిని కాచుటకు మనుష్యులను ఉంచుడి.
- 19 మీ దేవు డైన యెహోవా మీ శత్రువులను మీ చేతికి అప్పగించియున్నాడు గనుక వారిని తమ పట్టణములలోనికి మరల వెళ్లనీయకుండ మీరు నిలువక వారిని తరిమి వారి వెనుకటివారిని కొట్టివేయుడనెను.
- 20 వారు బొత్తిగా నశించువరకు యెహోషువయు ఇశ్రా యేలీయులును బహు జనసంహారముచేయుట కడతేర్చిన తరువాత వారిలో మిగిలియున్నవారు ప్రాకారముగల పట్టణములలో చొచ్చిరి.
- 21 జనులందరు మక్కేదాయందలి పాళెములోనున్న యెహోషువ యొద్దకు సురక్షితముగా తిరిగి వచ్చిరి. ఇశ్రాయేలీయులకు విరోధముగా ఒక మాటయైన ఆడుటకు ఎవనికిని గుండె చాలకపోయెను.
- 22 యెహోషువఆ గుహకు అడ్డము తీసివేసి గుహలోనుండి ఆ అయిదుగురు రాజులను నాయొద్దకు తీసికొనిరండని చెప్పగా
- 23 వారు ఆలాగు చేసి, యెరూషలేము రాజును హెబ్రోను రాజును యర్మూతు రాజును లాకీషు రాజును ఎగ్లోను రాజును ఆ రాజుల నయిదుగురిని ఆ గుహలోనుండి అతనియొద్దకు తీసికొని వచ్చిరి.
- 24 వారు ఆ రాజు లను వెలుపలికి రప్పించి యెహోషువ యొద్దకు తీసికొని వచ్చినప్పుడు యెహోషువ ఇశ్రాయేలీయులనందరిని పిలి పించి, తనతో యుద్ధమునకు వెళ్లివచ్చిన యోధుల అధిపతు లతోమీరు దగ్గరకు రండి; ఈ రాజుల మెడలమీద మీ పాదముల నుంచుడని చెప్పగా వారు దగ్గరకు వచ్చి వారి మెడలమీద తమ పాదములనుంచిరి.
- 25 అప్పుడు యెహోషువ వారితోమీరు భయపడకుడి, జడియకుడి, దృఢత్వము వహించి ధైర్యముగానుండుడి; మీరు ఎవరితో యుద్ధము చేయుదురో ఆ శత్రువులకందరికి యెహోవా వీరికి చేసినట్టు చేయుననెను.
- 26 తరువాత యెహోషువ వారిని కొట్టి చంపి అయిదు చెట్లమీద వారిని ఉరిదీసెను; వారి శవములు సాయంకాలమువరకు ఆ చెట్లమీద వ్రేలాడు చుండెను.
- 27 ప్రొద్దు గ్రుంకు సమయమున యెహోషువ సెలవియ్యగా జనులు చెట్లమీదనుండి వారిని దించి, వారు దాగిన గుహలోనే ఆ శవములను పడవేసి ఆ గుహద్వార మున గొప్ప రాళ్లను వేసిరి. ఆ రాళ్లు నేటివరకున్నవి.
- 28 ఆ దినమున యెహోషువ మక్కేదాను పట్టుకొని దానిని దాని రాజును కత్తివాతను హతముచేసెను. అతడు వారిని దానిలోనున్న వారినందరిని నిర్మూలము చేసెను; యెరికో రాజునకు చేసినట్లు మక్కేదా రాజునకు చేసెను.
- 29 యెహోషువయు అతనితో కూడ ఇశ్రాయేలీయు లందరును మక్కేదానుండి లిబ్నాకు వచ్చి లిబ్నా వారితో యుద్ధముచేసిరి.
- 30 యెహోవా దానిని దాని రాజును ఇశ్రాయేలీయులకు అప్పగింపగా వారు నిశ్శేషముగా దానిని దానిలోనున్న వారినందరిని కత్తివాతను హతము చేసిరి. అతడు యెరికో రాజునకు చేసినట్లు దాని రాజు నకును చేసెను.
- 31 అంతట యెహోషువయు అతనితో కూడ ఇశ్రా యేలీయులందరును లిబ్నానుండి లాకీషుకు వచ్చి దాని దగ్గర దిగి లాకీషువారితో యుద్ధముచేయగా
- 32 యెహోవా లాకీషును ఇశ్రాయేలీయులచేతికి అప్పగించెను. వారు రెండవ దినమున దానిని పట్టుకొని తాము లిబ్నాకు చేసి నట్లే దానిని దానిలోనున్న వారినందరిని కత్తివాత హతము చేసిరి.
- 33 లాకీషుకు సహాయము చేయుటకు గెజెరు రాజైన హోరాము రాగా యెహోషువ నిశ్శేషముగా అతనిని అతని జనులను హతముచేసెను.
- 34 అప్పుడు యెహోషువయు అతనితో కూడ ఇశ్రాయేలీయులందరును లాకీషునుండి ఎగ్లోనునకును వచ్చి దానియెదుట దిగి దాని నివాసులతో యుద్ధముచేసి
- 35 ఆ దినమున దానిని పట్టుకొని కత్తివాతను వారిని హతము చేసిరి. అతడు లాకీషుకు చేసినట్లే దానిలో నున్నవారి నందరిని ఆ దినము నిర్మూలముచేసెను.
- 36 అప్పుడు యెహోషువయు అతనితో కూడ ఇశ్రా యేలీయులందరును ఎగ్లోనునుండి హెబ్రోనుమీదికి పోయి దాని జనులతో యుద్ధముచేసి
- 37 దానిని పట్టుకొని దానిని దాని రాజును దాని సమస్త పురములను దానిలోనున్న వారినందరిని కత్తివాతను హతముచేసిరి. అతడు ఎగ్లో నుకు చేసినట్లే దానిని దానిలోనున్న వారినందరిని నిర్మూ లము చేసెను.
- 38 అప్పుడు యెహోషువయు అతనితో కూడ ఇశ్రా యేలీయులందరు దెబీరువైపు తిరిగి దాని జనులతో యుద్ధముచేసి
- 39 దానిని దాని రాజును దాని సమస్త పుర ములను పట్టుకొని కత్తివాతను హతముచేసి దానిలోనున్న వారినందరిని నిర్మూలముచేసిరి. అతడు హెబ్రోనుకు చేసినట్లు, లిబ్నాకును దాని రాజునకును చేసినట్లు, అతడు దెబీరుకును దాని రాజునకును చేసెను.
- 40 అప్పుడు యెహోషువ మన్యప్రదేశమును దక్షిణ ప్రదే శమును షెఫేలాప్రదేశమును చరియలప్రదేశమును వాటి రాజులనందరిని జయించెను. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు అతడు శేషమేమియు లేకుండ ఊపిరిగల సమస్తమును నిర్మూలము చేసెను.
- 41 కాదేషు బర్నేయ మొదలుకొని గాజావరకు గిబియోనువరకు గోషేను దేశమంతటిని యెహోషువ జయించెను.
- 42 ఇశ్రా యేలు దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేయుచుండెను గనుక ఆ సమస్త రాజుల నంద రిని వారి దేశములను యెహోషువ ఒక దెబ్బతోనే పట్టు కొనెను.
- 43 తరువాత యెహోషువయు అతనితోకూడ ఇశ్రాయేలీయులందరును గిల్గాలులోని పాళెమునకు తిరిగి వచ్చిరి.
- 1 మరియు హన్నా విజ్ఞాపనచేసి యీలాగనెను నా హృదయము యెహోవాయందు సంతోషించుచున్నది.యెహోవాయందు నాకు మహా బలముకలిగెనునీవలని రక్షణనుబట్టి సంతోషించుచున్నానునావిరోధులమీద నేను అతిశయపడుదును.
- 2 యెహోవావంటి పరిశుద్ధ దేవుడు ఒకడునులేడు నీవు తప్ప మరి ఏ దేవుడును లేడుమన దేవునివంటి ఆశ్రయదుర్గమేదియు లేదు.
- 3 యెహోవా అనంతజ్ఞానియగు దేవుడు ఆయనే క్రియలను పరీక్షించువాడుఇకను అంత గర్వముగా మాటలాడకుడిగర్వపుమాటలు మీ నోట రానియ్యకుడి.
- 4 ప్రఖ్యాతినొందిన విలుకాండ్రు ఓడిపోవుదురుతొట్రిల్లినవారు బలము ధరించుదురు.
- 5 తృప్తిగా భుజించినవారు అన్నము కావలెనని కూలికిపోవుదురుఆకలి గొనినవారు ఆకలితీర తిందురు గొడ్రాలు ఏడుగురు పిల్లలను కనును అనేకమైన పిల్లలను కనినది కృశించి పోవును.
- 6 జనులను సజీవులనుగాను మృతులనుగాను చేయువాడు యెహోవాయేపాతాళమునకు పంపుచు అందులోనుండి రప్పించుచుండువాడు ఆయనే.
- 7 యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయు వాడు క్రుంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే.
- 8 దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలోనుండి యెత్తువాడు ఆయనేలేమిగలవారిని పెంటకుప్పమీదినుండి లేవనెత్తు వాడు ఆయనే.భూమియొక్క స్తంభములు యెహోవా వశము,లోకమును వాటిమీద ఆయన నిలిపియున్నాడు.
- 9 తన భక్తుల పాదములు తొట్రిల్లకుండ ఆయన వారిని కాపాడునుదుర్మార్గులు అంధకారమందు మాటుమణుగుదురుబలముచేత ఎవడును జయము నొందడు.
- 10 యెహోవాతో వాదించువారు నాశనమగుదురుపరమండలములోనుండి ఆయన వారిపైన యురుమువలె గర్జించునులోకపు సరిహద్దులలో నుండువారికి ఆయన తీర్పు తీర్చునుతాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చునుతాను అభిషేకించినవానికి అధిక బలము కలుగజేయును.
- 11 తరువాత ఎల్కానా రామాలోని తన యింటికి వెళ్లి పోయెను; అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలీ యెదుట యెహోవాకు పరిచర్యచేయుచుండెను.
- 12 ఏలీ కుమారులు యెహోవాను ఎరుగనివారై మిక్కిలి దుర్మార్గులైయుండిరి.
- 13 జనులవిషయమై యాజకులు చేయుచు వచ్చిన పని యేమనగా, ఎవడైన బలిపశువును వధించిన మీదట మాంసము ఉడుకుచుండగా యాజకుని వారు మూడు ముండ్లుగల కొంకిని తీసికొనివచ్చి
- 14 బొరుసులో గాని తపేలలోగాని గూనలోగాని కుండలోగాని అది గుచ్చినపుడు ఆ కొంకిచేత బయటకు వచ్చినదంతయు యాజకుడు తనకొరకు తీసికొనును. షిలోహుకు వచ్చు ఇశ్రాయేలీయులందరికిని వీరు ఈలాగున చేయుచువచ్చిరి.
- 15 ఇదియు గాక వారు క్రొవ్వును దహింపకమునుపు యాజ కుని పనివాడు వచ్చి బలిపశువును వధించువానితోయాజకునికి వండించుటకై మాంసమిమ్ము, ఉడకబెట్టిన మాంసము అతడు నీయొద్ద తీసికొనడు, పచ్చి మాంసమే కావలెను అని చెప్పుచువచ్చెను.
- 16 ఈ క్షణమందే వారు క్రొవ్వును దహింతురు, తరువాత నీ మనస్సు వచ్చి నంతమట్టుకు తీసికొనవచ్చునని వానితో ఆ మనిషి చెప్పిన యెడల వాడుఆలాగువద్దు ఇప్పుడే యియ్యవలెను, లేని యెడల బలవంతముచేత తీసికొందుననును.
- 17 అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుటయందు అసహ్య పడుటకు ఆ ¸°వనులు కారణమైరి, గనుక వారిపాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయెను.
- 18 బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్యచేయు చుండెను.
- 19 వాని తల్లి వానికి చిన్న అంగీ ఒకటి కుట్టి యేటేట బలి అర్పించుటకు తన పెనిమిటితోకూడ వచ్చినప్పుడు దాని తెచ్చి వాని కిచ్చుచు వచ్చెను.
- 20 యెహోవా సన్నిధిని మనవిచేసికొనగా నీకు దొరకిన యీ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానము నిచ్చునుగాక అని ఏలీ ఎల్కానాను అతని భార్యను దీవించిన తరువాత వారు ఇంటికి వెళ్లిరి.
- 21 యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతియై ముగ్గురు కుమాళ్లను ఇద్దరు కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి యెదుగుచుండెను.
- 22 ఏలీ బహు వృద్ధుడాయెను. ఇశ్రాయేలీయులకు తన కుమారులు చేసిన కార్యములన్నియు, వారు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకువచ్చిన స్త్రీలతో శయనించుటయను మాట చెవిని పడగా వారిని పిలిచి యిట్లనెను
- 23 ఈ జనులముందర మీరుచేసిన చెడ్డకార్యములు నాకు వినబడినవి. ఈలాటి కార్యములు మీరెందుకు చేయుచున్నారు?
- 24 నా కుమారు లారా, యీలాగు చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు, యెహోవా జనులను మీరు అతిక్రమింపచేయు చున్నారు.
- 25 నరునికి నరుడు తప్పుచేసినయెడల దేవుడు విమర్శచేయునుగాని యెవరైన యెహోవా విషయములో పాపము చేసినయెడల వానికొరకు ఎవడు విజ్ఞాపనము చేయును? అనెను. అయితే యెహోవా వారిని చంప దలచి యుండెను గనుక వారు తమ తండ్రియొక్క మొఱ్ఱను వినకపోయిరి.
- 26 బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుష్యుల దయ యందును వర్ధిల్లుచుండెను.
- 27 అంతట దైవజనుడొకడు ఏలీయొద్దకు వచ్చియిట్లనెను యెహోవా నిన్నుగూర్చి సెలవిచ్చినదేమనగా, నీ పిత రుని యింటివారు ఐగుప్తు దేశమందు ఫరో యింటిలో ఉండగా నేను వారికి ప్రత్యక్షమైతిని.
- 28 అతడు నా ముందర ఏఫోదును ధరించి నా బలిపీఠముమీద అర్ప ణమును ధూపమును అర్పించుటకై నాకు యాజకుడగునట్లు ఇశ్రాయేలు గోత్రములలోనుండి నే నతని ఏర్పరచు కొంటిని. ఇశ్రాయేలీయులు అర్పించిన హోమవస్తువులన్నిటిని నీ పితరుని యింటివారికిచ్చితిని.
- 29 నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేల తృణీకరించుచున్నారు? మిమ్మును క్రొవ్వబెట్టుకొనుటకై నా జనులగు ఇశ్రాయేలీయులు చేయు నైవేద్యములలో శ్రేష్ఠభాగములను పట్టుకొనుచు, నాకంటె నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు.
- 30 నీ యింటి వారును నీ పితరుని యింటివారును నా సన్నిధిని యాజ కత్వము జరిగించుదురని యెహోవా ఆజ్ఞ యిచ్చియున్నను ఇప్పుడు అది నా మనస్సునకు కేవలము ప్రతికూలమాయెనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చు చున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగానన్ను ఘనపరచువారిని నేను ఘనపరచుదును. నన్ను తృణీకరించువారు తృణీకారమొందుదురు.
- 31 ఆలకించుము; రాగల దినములలో నీ బలమును నీ పితరుని యింటి బలమును నేను తక్కువచేతును. నీ యింట ముసలివాడు ఒకడును లేకపోవును.
- 32 యెహోవా ఇశ్రాయేలీయులకు చేయదలచిన మేలువిషయములో నా నివాసస్థలమునకు అపాయము కలుగగా నీవు చూతువు. ఎప్పటికిని నీ యింట ముసలివాడు ఉండడు.
- 33 నా బలిపీఠమునొద్దనెవడు ఉండకుండ నేనందరిని నశింపజేయక విడుచు వాడను గనుక అది నీ కన్నులు క్షీణించుటకును నీవు దుఃఖముచేత క్షయమగుటకును సాధనమగును; నీ సంతానపు వారందరు వయఃకాలమందు మరణమవుదురు.
- 34 నీ యిద్దరు కుమారులైన హొఫ్నీకిని ఫీనెహాసునకును సంభ వించునని నేను చెప్పినదానికి నీకు సూచనగా నుండును.ఒక్క నాటియందే వారిద్దరు మరణమవుదురు.
- 35 తరువాత నమ్మక మైన ఒక యాజకుని నేను నియమింతును; అతడు నా యోచననుబట్టి నా కనుకూలముగా యాజకత్వము జరిగించును, అతనికి నేను నమ్మకమైన సంతానము పుట్టిం తును, అతడు నా అభిషిక్తుని సన్నిధిని ఎప్పటికిని యాజ కత్వము జరిగించును.
- 36 తరువాత నమ్మక మైన ఒక యాజకుని నేను నియమింతును; అతడు నా యోచననుబట్టి నా కనుకూలముగా యాజకత్వము జరిగించును, అతనికి నేను నమ్మకమైన సంతానము పుట్టిం తును, అతడు నా అభిషిక్తుని సన్నిధిని ఎప్పటికిని యాజ కత్వము జరిగించును.
- 1 యెహోవాయొద్దనుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు
- 2 మీరు ఈ నిబంధనవాక్యములను వినుడి; యూదా మనుష్యులతోను యెరూషలేము నివాసులతోను నీవీలాగున మాటలాడి తెలియజేయవలెను
- 3 ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగాఈ నిబంధన వాక్యములను విననొల్ల నివాడు శాపగ్రస్తుడగును.
- 4 ఐగుప్తుదేశములోనుండి, ఆ యినుప కొలిమిలోనుండి నేను మీ పితరులను రప్పించిన దినమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చి తినినేడున్నట్టుగా పాలు తేనెలు ప్రవహించు దేశమును మీ పితరులకిచ్చెదనని వారితో నేను చేసిన ప్రమాణమును నేను నెరవేర్చునట్లు, మీరు నా వాక్యము విని నేను మీ కాజ్ఞాపించు విధులన్నిటినిబట్టి యీ నిబంధన వాక్యముల ననుసరించినయెడల మీరు నాకు జనులైయుందురు నేను మీకు దేవుడనైయుందును.
- 5 అందుకుయెహోవా, ఆ ప్రకారము జరుగును గాకని నేనంటిని.
- 6 యెహోవా నాతో సెలవిచ్చినదేమనగానీవు యూదాపట్టణములలోను యెరూషలేము వీధులలోను ఈ మాటలన్నిటిని ప్రకటింపుముమీరు ఈ నిబంధన వాక్యములను విని వాటి ననుసరించి నడుచుకొనుడి.
- 7 ఐగుప్తులోనుండి మీ పితరులను రప్పించిన దినము మొదలు కొని నేటివరకు నేను గట్టిగాను ఖండితముగాను చెప్పుచు వచ్చితిని; నా మాట వినుడి అని పెందలకడ లేచి చెప్పుచు వచ్చితిని
- 8 అయినను వారు తమ దుష్టహృదయములో పుట్టు మూర్ఖతచొప్పున నడుచుచు వినకపోయిరి; చెవి యొగ్గినవారు కాకపోయిరి, వారు అనుసరింపవలెనని నేను వారి కాజ్ఞాపించిన యీ నిబంధన మాటలన్నిటిననుస రించి నడువలేదు గనుక నేను ఆ నిబంధనలోని వాటి నన్నిటిని వారిమీదికి రప్పించుచున్నాను.
- 9 మరియు యెహోవా నాతో ఈలాగు సెలవిచ్చెనుయూదావారిలోను యెరూషలేము నివాసులలోను కుట్ర జరుగునట్లుగా కనబడుచున్నది.
- 10 ఏదనగా వారు నా మాటలు విననొల్లకపోయిన తమ పితరుల దోషచర్యలను జరుప తిరిగియున్నారు; మరియు వారు అన్యదేవతలను పూజించుటకై వాటిని అనుసరించుచు, వారి పితరులతో నేను చేసిన నిబంధనను ఇశ్రాయేలు వంశస్థులును యూదావంశస్థులును భంగము చేసియున్నారు.
- 11 కాబట్టి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుతాము తప్పించుకొనజాలని కీడు వారిమీదికి రప్పింపబోవు చున్నాను, వారు నాకు మొఱ్ఱపెట్టినను నేను వారి మొఱ్ఱను వినకుందును.
- 12 యూదాపట్టణస్థులును యెరూష లేము నివాసులును పోయి తాము ధూపార్పణము చేయు దేవతలకు మొఱ్ఱపెట్టెదరు గాని వారి ఆపత్కాలములో అవి వారిని ఏమాత్రమును రక్షింపజాలవు.
- 13 యూదా, నీ పట్టణముల లెక్కచొప్పున నీకు దేవతలున్నవి గదా? యెరూషలేము నివాసులారా, బయలు దేవతకు ధూపము వేయవలెనని మీ వీధుల లెక్కచొప్పున లజ్జాకరమైన దానిపేరట బలిపీఠములను స్థాపించితిరి.
- 14 కావున నీవు ఈ ప్రజలనిమిత్తము ప్రార్థనచేయకుము; వారి నిమిత్తము మొఱ్ఱపెట్టకుము ప్రార్థనచేయకుము, వారు తమ కీడును బట్టి నాకు మొఱ్ఱపెట్టునప్పుడు నేను వినను.
- 15 దుర్వ్యాపారము జరిగించిన నా ప్రియురాలికి నా మందిరముతో నిమిత్తమేమి? మ్రొక్కుబళ్లచేతను ప్రతిష్ఠిత మాంసము తినుటచేతను నీకు రావలసిన కీడు నీవు పోగొట్టు కొందువా? ఆలాగైతే నీవు ఉత్సహించుదువు.
- 16 అది చక్కని ఫలముగల పచ్చని ఒలీవ చెట్టని యెహోవా నీకు పేరు పెట్టెను; గొప్ప తుపాను ధ్వనితో దానిమీద మంటపెట్టగా దాని కొమ్మలు విరిగిపోవుచున్నవి.
- 17 ఇశ్రా యేలు వంశస్థులును యూదా వంశస్థులును బయలునకు ధూపార్పణముచేసి నాకు కోపము పుట్టించుటచేత తమంతట తామే చేసిన చెడుతనమునుబట్టి మిమ్మును నాటిన సైన్యములకధిపతియగు యెహోవా మీకు కీడుచేయ నిర్ణయించుకొని యున్నాడు.
- 18 దానిని యెహోవా నాకు తెలియజేయగా నేను గ్రహించితిని; ఆయన3 వారి క్రియలను నాకు కనుపర చెను.
- 19 అయితే నేను వధకు తేబడుచుండు సాధువైన గొఱ్ఱపిల్లవలె ఉంటిని;మనము చెట్టును దాని ఫలమును నశింపజేయుదము రండి, వాని పేరు ఇకను జ్ఞాపకము చేయబడకపోవునట్లు బ్రదుకువారిలో నుండకుండ వాని నిర్మూలము చేయుదము రండని వారు నామీద చేసిన దురాలోచనలను నేనెరుగకయుంటిని.
- 20 నీతినిబట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను, హృదయమును శోధించు వాడు సైన్యములకధిపతియగు యెహోవాయే. యెహోవా, నా వ్యాజ్యెభారమును నీమీదనే వేయుచున్నాను; వారికి నీవు చేయు ప్రతి దండనను నన్ను చూడనిమ్ము.
- 21 కావున నీవు మాచేత చావకుండునట్లు యెహోవా నామమున ప్రవచింపకూడదని చెప్పు అనాతోతు వారినిగూర్చి యెహోవా ఇట్లని సెలవిచ్చుచున్నాడు
- 22 సైన్యముల కధిపతియగు యెహోవా వారినిగూర్చి సెలవిచ్చునదే మనగానేను వారిని శిక్షింపబోవుచున్నాను, వారి ¸°వనులు ఖడ్గముచేత చంపబడెదరు, వారి కుమారులును కూమార్తెలును క్షామమువలన చచ్చెదరు;
- 23 వారికి శేష మేమియు లేకపోవును, నేను వారిని దర్శించు సంవత్సర మున అనాతోతు కీడును వారిమీదికి రప్పింతును.