Bible Versions
Bible Books

Habakkuk 3 (ERVTE) Easy to Read Version - Telugu

1 ప్రవక్తయైన హబక్కూకు చేసిన షిగ్గయోను పార్థన.
2 యెహోవా, నిన్ను గూర్చిన వార్త విన్నాను. యెహోవా, పూర్వం నీవు చేసిన శక్తివంతమైన పనుల విషయంలో నేను విస్మయం చెందాను. అట్టి గొప్ప పనులు మా కాలంలో జరిపించమని నేను నిన్ను వేడుకుంటున్నాను. పనులు మాకాలంలోనే జరిపించమని నేను ప్రార్థిస్తున్నాను. కాని నీ ఆవేశంలో (ఉద్రేకం) మా పట్ల కరుణ చూపటం గుర్తుపెట్టుకొనుము.
3 దేవుడు తేమానులో నుండి వస్తున్నాడు. పరిశుద్ధుడు పారాను పర్వతం మీది నుండి వస్తున్నాడు. యెహోవా మహిమ ఆకాశాన్ని కప్పి వేసింది! ఆయన ప్రభావంతో భూమి నిండి పోయింది!
4 అది ప్రకాశమానమై మెరుస్తున్న వెలుగు. ఆయన చేతినుర డి కాంతి కిరణాలు ప్రసరిస్తున్నియి. అట్టి మహత్తర శక్తి ఆయన చేతిలో దాగివుంది.
5 వ్యాధి ఆయనకు ముందుగా వెళ్లింది. అయన వెనుక వినాశనకారి అనుసరించి వెళ్లింది.
6 యెహోవా నిలుచుండి భూమికి తీర్పు తీర్చాడు. ఆయన అన్ని దేశాల ప్రజలవైవు చూశాడు. వారు భయంతో వణికి పోయారు. అనీదిగా పర్వతాలు బలంగా నిలిచి ఉన్నాయి. కాని పర్వతాలు బద్దలై పోయాయి. పాత పాత కొండలు పడిపోయాయి. దేవుడు ఎల్లప్పుడూ అలానే ఉంటాడు!
7 కుషాను (కూషియుల) నగరాలలో ఆపద సంభవించటం నేను చూశాను. మిద్యాను దేశీయుల ఇండ్లు భయంతో కంపించాయి.
8 యెహోవా, నీవు నదుల పట్ల కోపంగా ఉన్నీవా? వాగుల పట్ల నీవు కోపంగా ఉన్నావా? నీవు నీ గుర్రాలను, రథాలను విజయానికి నడిపించి నప్పుడు నీవు కోపంగా ఉన్నావా?
9 This verse may not be a part of this translation
10 పర్వతాలు నిన్ను చూచి వణికాయి. నీరు నేల విడిచి పట్టు దప్పినందున అది పెద్దగా ధ్వని చేసింది.
11 సూర్యుడు, చంద్రుడు వాటి కాంతిని కోల్పోయాయి. నీ దేదీప్యమానమైన మెరువు కాంతులు చూడగానే అవి వ్రకాశించటం మానివేశాయి. మెరుపులు గాలిలో దూసుకు పోయే ఈటెలు, బాణాలవలె ఉన్నాయి.
12 నీవు కోపంతో భూమిపై నడిచి దేశాలను శిక్షించావు.
13 నీ ప్రజలను రక్షించటానికి నీవు వచ్చావు. అభిషేకం చేయబడిన నీ వ్యక్తిని రక్షించటానికి నీవు వచ్చావు. ప్రతి చెడ్డ కుటుంబంలోనూ మొదట పుట్టిన వానిని నీవు చంపివేశావు. కుటుంబం దేశంలో అతి తక్కువదా?లేక అతి గొప్పదా? అనే విచక్షణ నీవు చూపలేదు.
14 శత్రు సైనికులను ఆపటానికి నీవు మోషే చేతి కర్రను ఉపయోగించావు. సైనికులు మామీద యుద్ధానికి పెనుతుఫానులా వచ్చారు. రహస్యంగా ఒక పేదవాణ్ణి దోచుకున్నట్టు,వారు మమ్మల్ని తేలికగా ఓడించవచ్చనుకున్నారు.
15 కాని నీవు నీ గుర్రాలతో సముద్రం గుండా నడిచావు. మహ జలరాశిని దూరంగా దొర్లిపోయేలా చేశావు.
16 నేనీ విషయాలు విన్నప్పుడు, నా శరీరం వణికింది. పెద్ద శబ్దాలు నేను విన్నప్పుడు నా పెదవులు అదిరాయి. నా ఎముకలు బలహినమయ్యాయి. నా కాళ్లు వణికాయి. కావున వినాశన దినం వచేవరకు ఓపికగా వేచి ఉంటాను. మామీదదాడి చేసేవారికి విపత్కర దినం వస్తోంది.
17 అంజూరపు చెట్టు కాయలు కాయకుండా ఉండవచ్చు. ద్రాక్షలతలపై కాయలు ఉండక పోవచ్చు. చట్చకు ఆలిపు పండ్లు కాయక పోవచ్చు. పోలాల్లో ఆహర ధాన్యాలు పండక పోవచ్చు. దొడ్లలో గొర్రెలు ఉండక పోవచ్చు. కొట్టాలలో పాడి పశువులు లేకపోవచ్చు.
18 అయినా, నేను యెహోవాయందు ఆనందిస్తాను. నా రక్షకుడైన దేవునియందు నేను ఉల్లసిస్తాను.
19 నా ప్రభువైన యెహోవా నాకు బలాన్ని ఇస్తాడు. లేడిలా పరుగెత్తగలిగేలా ఆయన నాకు సహాయపడతాడు. పర్వతాలపై ఆయన నన్ను సురక్షితంగా నడిపిస్తాడు. సంగీత దర్శకునికి. ఇది నా తంతి వాద్యాలతో పాడదగినది.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×