Bible Versions
Bible Books

Ezekiel 41 (ERVTE) Easy to Read Version - Telugu

1 మనిషి నన్ను మధ్య గదికి (పవిత్ర స్థలం) తీసుకొని వచ్చాడు. అతడు దానికి రెండు పక్కలనున్న గోడలను కొలిచాడు. అవి ప్రతి పక్క పది అడుగుల ఆరంగుళాల మందాన ఉన్నాయి.
2 తలుపు పది మూరల వెడల్పు ఉంది. ద్వారపు పక్క భాగాలు ప్రతి పక్కా ఐదు మూరలు ఉన్నాయి. మనిషి గదిని కొలిచాడు. అది నలభై మూరల పొడవు, ఇరవై మూరల వెడల్పు ఉంది.
3 పిమ్మట మనిషి లోపలి చివరి గదికి వెళ్లి ద్వారం పక్క గోడలను కొలిచాడు. ప్రతిగోడా రెండు మూరల మందం, ఏడు మూరల వెడల్పు ఉంది. తలుపు మధ్య ఆరు మూరల ప్రవేశ స్థలం ఉంది.
4 తరువాత మనిషి గది యొక్క పొడవు కొనిచాడు. అది మధ్య గదిలో ప్రవేశించే ఇరవై మూరల పొడవు, ఇరవై మూరల వెడల్పు కలిగి ఉంది. అతను నాతో, “ఇది అతి పవిత్ర స్థలం “అని చెప్పాడు.
5 పిమ్మట అతడు ఆలయపు గోడను కొలిచాడు. అది ఆరు మూరల మందం కలిగి ఉంది. పక్క గదులు ఆలయం చుట్టూ ఉన్నాయి. అవి నాలుగు మూరల వెడల్పు.
6 పక్క గదులు మూడు వివిధ అంతస్థులపై ఉన్నాయి. ఒకదాని మీద ఒకటి అవి ఉన్నాయి. ప్రతి అంతస్థులోను ముప్పయి గదులున్నాయి. ఆలయపు గోడలు రాళ్ళ తిప్పలతో కట్టబడ్డాయి. పక్క గదులకు చుట్టూ గోడ ఆధారం ఉంది. కానీ కేవలం ఆలయం యొక్క గోడే గదులకు ఆధారం కాలేదు.
7 ఆలయం చుట్టూ ఉన్న గదుల ప్రతి అంతస్ధూ దానికింది భాగం కంటె వెడల్పుగా ఉంది. ఆలయం చుట్టూ ఉన్న గదుల గోడలు పైకి పోను పోనూ ఇరుకు కావడం వల్ల పై అంతస్థుల గదులు విశాలంగా ఉన్నాయి. కింది అంతస్థు నుండి పై అంతస్థు వరకు మధ్య అంతస్తుగుండా మెట్లదారి ఉంది.
8 ఆలయానికి చుట్టూ చదును చేసి బండలు పరచిన ఎత్తయిన పునాది ఉన్నట్లు నేను చూశాను. పక్క గదుల పునాదులు పది అడుగుల ఆరంగుళాల ఎత్తున ఉన్నాయి.
9 పక్క గదుల బయటి గోడ ఎనిమిది అడుగుల తొమ్మిది అంగుళాల మందం ఉంది. ఆలయం పక్క గదుల కు, యాజకుల గదులకు మధ్య మరియు
10 ఆలయం చుట్టూ ఖాళీ స్థలం ముప్పయి ఐదు అడుగులు.
11 పక్క గదుల వాకిళ్ళు ఎత్తయిన పునాది స్థలం వరకూ ఉన్నాయి. ఒక వాకిలి ఉత్తర దిశగా ఉంటే, మరొకటి దక్షిణ దిశగా ఉంది.
12 ఆలయానికి పడమట నియమిత స్థలంలో ఒక భవరం ఉంది. అది డెభ్బై మూరల వెడల్పు, తొంభై మూరల పొడవు కలిగి ఉంది. భవనపుగోడ ఆన్ని వైపులా ఐదు మూరల మందం ఉంది.
13 పిమ్మట మనుష్యుడు ఆలయాన్ని కొలిచాడు. ఆలయం నూరు మూరల పొడఉంది. భవనం, నియమిత స్థలం, దాని గోడలతో కలిసి పొడవు నూరు మూరలున్నాయి.
14 ఆలయం ముందు తూర్పు భాగపు నియమిత స్థలం నూరు మూరల పొడఉంది.
15 ఆలయపు చివరి నియమిత స్థలంలో ఉన్న భవనం పొడవును మనిషి కొలిచాడు. ఒక గోడకు మరొక గోడకు నూరు మూరలున్నవి. అతి పవిత్ర స్థలానికి, పవిత్ర స్థలానికి, మండపానికి ఎదురుగా ఉన్న ఆవరణ చుట్టూ మూడింటి గోడలకు నగిషీ పనులు చేసిన కొయ్యపలకలు అన్ని కిటికీలకు, తలుపులకు కొయ్యతో నగిషీలు చెయబడ్డాయి.
16 ఆలయపు గుమ్మం వద్ద కింది నుండి కిటికీల వరకు చుట్టూ బల్ల కూర్పువేయబడింది.
17 ఆలయపు లోపలి, బయటి గదుల గోడలలో నగిషీలు చేయబడ్డాయి. ఆలయం యొక్క లోపలి గది గోడల మీద, బయట గది గోడల మీద
18 కెరూబుల, ఖర్జూరపు చెట్లు చిత్రాలు చెక్కబడ్డాయి. కెరూబుల మధ్య ఒక ఖర్జూరపు చెట్లు చొప్పున ఉన్నాయి. ప్రతీ కెరూబులకు రెండు ముఖాలు ఉన్నాయి.
19 ఒకటి మానవ ముఖం ఆకారంలో ఉండి ఒక పక్క నున్న ఖర్జూరపు చెట్టు వైపు చూస్తూ ఉంటుంది. రెండవది సింహపు ముఖం. అది రెండవ పక్కనున్న ఖర్జూరపు చెట్టును చూస్తూ ఉంటుంది. అవి ఆలయం మీద అన్ని చోట్లా చెక్కబడ్డాయి.
20 నేలనుండి తలుపు మీది వరకూ గల పవిత్ర స్థలగోడల మీద కెరూబుల, ఖర్జూరపు చెట్ల చిత్రాలు చెక్కబడ్డాయి.
21 ఆలయపు పవిత్ర స్థలం పక్కనున్న గోడలు చదరంగా ఉన్నాయి. అతి పవిత్ర స్థలం ముందు
22 కొయ్యతో చేయబడిన బలిపీఠం వంటిది ఒకటుంది. అది మూడు మూరల ఎత్తు, రెండు మూరల పొడవు కలిగి ఉంది. దాని మూలలు, దాని అడుగు, దాని పక్కలు అన్నీ కొయ్యతోనే చేయ బడ్డాయి. “ఇది యోహోవా ఎదుట ఉండే బల్ల” అని మనుష్యుడు నాతో ఇలా చెప్పాడు.
23 పవిత్ర స్థలం మరియు అతి పవిత్ర స్థలం రెండింటికీ రెండు తలుపులున్నాయి.
24 తలుపులలో ప్రతి ఒక్కటి రెండు చిన్న తలుపులతో చేయబడింది. ప్రతి తలుపుకి నిజానికి రెండు మడత తలుపులున్నాయి.
25 పవిత్రమైన గది తలుపుల మీద కూడ కెరూబుల, ఖర్జూరపు చెట్ల చిత్రాలు చెక్కబడ్డాయి. అవి గోడల మీద చెక్కిన చిత్రాల మాదిరిగానే ఉన్నాయి. మండపానికి ముందు భాగం చెక్కలతో కప్పబడి ఉంది.
26 మండపం చుట్టూ దాని మేడ మీద గదులలో కొయ్యతో చేయబడ్డ చట్రపు కిటికీలు, మండపానికి ఇరు పక్కల ఖర్జూరపు చెట్లు ఉన్నాయి.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×