Bible Versions
Bible Books

Zephaniah 3 (ERVTE) Easy to Read Version - Telugu

1 యెరూషలేమూ, నీ ప్రజలు దేవునికి విరోధంగా యుద్ధం చేశారు! నీ ప్రజలు ఇతరులను బాధించారు, నీవు పాపంతో అపవిత్రమయ్యావు.
2 నీ ప్రజలు నా మాట వినలేదు! వారు నా ప్రబోధాలు అంగీకరించలేదు. యెరూషలేము యెహోవాను నమ్మలేదు. యెరూషలేము తన దేవుని దగ్గరకు వెళ్ళలేదు.
3 యెరూషలేము నాయకులు గర్జించే సింహాల్లా ఉన్నారు. దాని న్యాయమూర్తులు గొర్రెలమీద దాడి చేసేందుకు రాత్రివేళ వచ్చి ఉదయానికి ఏమీ మిగల్చని ఆకలిగొన్న తోడేళ్లలా ఉన్నారు.
4 దాని ప్రవక్తలు ఇంకా, ఇంకా ఎక్కువ సంపాదించటం కోసం ఎల్లప్పుడూ వారి రహస్య పథకాలు వేస్తూనే ఉన్నారు. దాని యాజకులు పవిత్రమైన విషయాలను పవిత్రం కానట్టె చూశారు. దేవుని ప్రబోధాలను వారు అతిక్రమించారు.
5 కాని దేవుడు ఇంకా పట్టణంలో ఉన్నాడు. మరియు ఆయన మంచివాడుగానే కొనసాగుతున్నాడు. దేవుడు తప్పు ఏమీ చేయడు. ఆయన తన ప్రజలకు సహాయం చేస్తూనే ఉంటాడు. ఆయన ప్రజలు మంచి నిర్ణయాలు చేసేందుకు ఆయన వారికి ప్రతి ఉదయం సహాయం చేస్తాడు. కాని దుర్మార్గులు తాము చేసే చెడ్డ పనుల విషయంలో సిగ్గుపడరు.
6 దేవుడు చెవుతున్నాడు: నేను మొత్తం జన సమూహాలను నాశనం చేశాను. నేను వారి సంరక్షణ దుర్గాలను నాశనం చేశాను. నేను వారి వీధులను నాశనం చేశాను, అక్కడ ఇప్పుడు ఎవ్వరూ వెళ్ళరు. వారి పట్టణాలు ఖాళీ, అక్కడ ఇంకెంత మాత్రమూ ఎవ్వరూ నివసించరు.
7 నీవు ఒక పాఠం నేర్చుకోవాలని సంగతులు నీతో నేను చెబుతున్నాను. నీవు నాకు భయపడి నన్ను గౌరవించాలని నేను కోరుతున్నాను. ఒకవేళ నీవు ఇలా చేస్తే, నీ ఇల్లు నాశనం చేయబడదు. నీవు ఇలా చేస్తే నా పథకం ప్రకారం నిన్ను నేను శిక్షించాల్సి ఉండదు.” కాని చెడ్డ ప్రజలు ఇదివరకే చేసిన చెడుకార్యాలనే ఇంకా ఎక్కువ చేయాలను కొన్నారు!
8 యెహోవా చెప్పాడు:” కనుక కొంచెం వేచి ఉండండి! నేను నిలిచి మీకు తీర్పు చెప్పేంతవరకు వేచి ఉండండి. అనేక దేశాల నుండి మనుష్యులను రప్పించి, మిమ్మల్ని శిక్షించేందుకు వారిని వాడుకొనే హక్కు నాకు ఉంది. మీ మీద నా కోపం చూపించేందుకు నేను ప్రజలను వాడుకొంటాను. నాకు ఎంత చికాకు కలిగిందో చూపించేందుకు నేను వారిని వాడు కొంటాను. మరియు మొత్తం దేశం నాశనం చేయబడుతుంది!
9 This verse may not be a part of this translation
10 కూషు దేశంలోని నది ఆవలివైపున, అంత దూరం నుండి ప్రజలు వస్తారు. చెదరిపోయిన నా ప్రజలు నా దగ్గరకు వస్తారు. నా భక్తులు వస్తారు మరియు నాకు వారు కానుకలు తెస్తారు.
11 యెరూషలేమూ, అప్పుడు నీవు, నీ ప్రజలు నాకు విరోధంగా చేసే చెడు విషయాలను గూర్చి ఇంకెంత మాత్రం సిగ్గుపడవు. ఎందుకంటే, దుర్మార్గులందరినీ యెరూషలేము నుండి నేను తొలగించి వేస్తాను. గర్విష్ఠులందరినీ నేను తొలగించివేస్తాను. నా పరిశుద్ధ పర్వతంమీద గర్విష్ఠులు ఎవ్వరూ ఉండరు.
12 దీనులను, సాత్వికులను మాత్రమే నేను నా పట్టణంలో (యెరూషలేము) ఉండనిస్తాను. మరియు వారు యెహోవా నామాన్ని నమ్ముకొంటారు.
13 ఇశ్రాయేలులో మిగిలిన వారు చెడు పనులు చేయరు. వారు అబద్ధాలు చెప్పరు. వారు అబద్ధాలు చెప్పి ప్రజలను మోసగించేందుకు ప్రయత్నించరు. వారు తిని ప్రశాంతంగా పడుకొనే గొర్రెల్లా ఉంటారు - వారిని ఎవరూ ఇబ్బంది పెట్టరు.”
14 యెరూషలేమా! పాడుతూ సంతోషంగా ఉండు! ఇశ్రాయేలూ, ఆనందంగా కేకలు వేయి! యెరూషలేమా, సంతోషించి సరదాగా ఉండు!
15 ఎందుకంటే, నీ శిక్షను యెహోవా నిలిపివేశాడు గనుక! నీ శత్రువుల బలమైన దుర్గాలను ఆయన నాశనం చేశాడు! ఇశ్రాయేలు రాజా, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. చెడు విషయం జరుగుతున్నా దాన్ని గూర్చి నీవు దిగులు వడాల్సిన అవసరం లేదు.
16 సమయంలో యెరూషలేముతో ఇలా చెప్ప బడుతుంది: “బలంగా ఉండు, భయపడవద్దు!
17 నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. ఆయన శక్తిమంతుడైన సైనికునిలా ఉన్నాడు. ఆయన నిన్ను రక్షిస్తాడు. ఆయన నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో అది ఆయన నీకు చూపిస్తాడు. ఆయన నీ గురించి సంతోషపడతాడు, నీవంటే ఆనందిస్తాడు. విందులో పాల్గొన్న వారివలె అయన నీ విషయంలో నవ్వుతూ సంతోషిస్తాడు.
18 అది విందులో పాల్గొన్న ప్రజల్లా ఉంటుంది.” యెహోవా చెప్పాడు: నీ అవమానాన్ని నేను తొలగించివేస్తాను. ప్రజలు నిన్ను బాధించ కుండునట్టు నేను చేస్తాను.
19 సమయంలో, నిన్ను బాధించే వారిని నేను శిక్షిస్తాను. బాధించబడిన నా ప్రజలను నేను రక్షిస్తాను. పారిపోయేలా బలవంతం చేయబడిన ప్రజలను నేను తిరిగి వెనుకకు తీసుకొనివస్తాను. మరియు నేను వారిని ప్రసిద్ధి చేస్తాను. అన్ని చోట్లా ప్రజలు వారిని పొగడుతారు.
20 సమయంలో, నిన్ను నేను వెనుకకు తీసుకొని వస్తాను. నేను నిన్ను కలిపి తీసుకొని వస్తాను. నిన్నునేను ప్రసిద్ధి చేస్తాను. అన్ని చోట్లా ప్రజలు నిన్ను పొగడుతారు. నీ సొంత కళ్ళయెదుట బందీలను తిరిగి నేను వెనుకకు తీసుకొని వచ్చి నప్పుడు అది జరుగుతుంది!” సంగతులు యెహోవా చెప్పాడు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×