|
|
1. “ఒక యువతిని కామవాంఛతో చూడ కూడదని నా కళ్లతో నేను ఒప్పందం చేసుకొన్నాను.
|
1. I made H3772 a covenant H1285 with mine eyes H5869 ; why H4100 then should I think H995 upon H5921 a maid H1330 ?
|
2. సర్వశక్తిమంతుడైన దేవుడు తన ప్రజలకు ఏమి చేస్తున్నాడు? దేవుడు ఉన్నతమైన తన పరలోక గృహంలో ఉండి ప్రజలకు తిరిగి ఎలా ప్రతిఫలం ఇస్తున్నాడు?
|
2. For what H4100 portion H2506 of God H433 is there from above H4480 H4605 ? and what inheritance H5159 of the Almighty H7706 from on high H4480 H4791 ?
|
3. దుర్మార్గులకు దేవుడు కష్టాన్ని, నాశనాన్ని పంపిస్తాడు. తప్పు చేసేవారికి సర్వనాశనం కలిగిస్తాడు.
|
3. Is not H3808 destruction H343 to the wicked H5767 ? and a strange H5235 punishment to the workers H6466 of iniquity H205 ?
|
4. నేను చేసేది ప్రతిదీ దేవునికి తెలుసు. నేను వేసే ప్రతి అడుగూ ఆయన చూస్తున్నాడు.
|
4. Doth not H3808 he H1931 see H7200 my ways H1870 , and count H5608 all H3605 my steps H6806 ?
|
5. “నేను అబద్ధాల జీవితం జీవించి ఉంటే, లేక ప్రజలకు అబద్దాలు చెప్పి, మోసం చేసేందుకు నేను పరుగులెత్తి ఉంటే.
|
5. If H518 I have walked H1980 with H5973 vanity H7723 , or if my foot H7272 hath hasted H2363 to H5921 deceit H4820 ;
|
6. అప్పుడు నన్ను తూచేందుకు దేవుడు న్యాయపుత్రాసు వాడవచ్చును. అప్పుడు నేను నిర్దోషినని దేవునికే తెలుస్తుంది.
|
6. Let me be weighed H8254 in an even H6664 balance H3976 , that God H433 may know H3045 mine integrity H8538 .
|
7. నేను సరియైన మార్గం నుండి తొలగిపోతే నా కళ్లు నా హృదయాన్ని దుష్టత్వానికి నడిపించి ఉంటే లేదా నా చేతులు పాపంతో మైలగా ఉంటే,
|
7. If H518 my step H838 hath turned H5186 out of H4480 the way H1870 , and mine heart H3820 walked H1980 after H310 mine eyes H5869 , and if any blot H3971 hath cleaved H1692 to mine hands H3709 ;
|
8. అప్పుడు నేను నాటిన పంటలను ఇతరులు తిని వేయుదురు గాక, నా పంటలు పెరికి వేయబడును గాక.
|
8. Then let me sow H2232 , and let another H312 eat H398 ; yea , let my offspring H6631 be rooted out H8327 .
|
9. “నేను స్త్రీల పట్ల కామవాంఛ కలిగి ఉంటే లేదా నేను నా పొరుగువాని భార్యతో వ్యభిచార పాపం చేయటానికి అతని ద్వారం దగ్గర వేచి ఉంటే,
|
9. If H518 mine heart H3820 have been deceived H6601 by H5921 a woman H802 , or if I have laid wait H693 at H5921 my neighbor H7453 's door H6607 ;
|
10. అప్పుడు నా భార్య మరొకనికి వంట చేయునుగాక. ఇతర వురుషులు ఆమెతో పండుకొందురు గాక.
|
10. Then let my wife H802 grind H2912 unto another H312 , and let others H312 bow down H3766 upon H5921 her.
|
11. ఎందుకంటే లైంగిక పాపం అవమానకరం. అది శిక్షించబడాల్సిన పాపం.
|
11. For H3588 this H1931 is a heinous crime H2154 ; yea, it H1931 is an iniquity H5771 to be punished by the judges H6414 .
|
12. లైంగికపాపం కాల్చివేసి, నాశనంచేసే అగ్నిలాంటిది. లైంగిక పాపంనాకు గల సర్వాన్నీ నాశనం చేస్తుంది.
|
12. For H3588 it H1931 is a fire H784 that consumeth H398 to H5704 destruction H11 , and would root out H8327 all H3605 mine increase H8393 .
|
13. “నా మగ సేవకులు, ఆడ సేవకులు నాకు విరోధంగా ఆరోపణ చేసినప్పుడు, ఒక వేళ నేను వారికి న్యాయం చేకూర్చేందుకు నిరాకరిస్తే,
|
13. If H518 I did despise H3988 the cause H4941 of my manservant H5650 or of my maidservant H519 , when they contended H7378 with H5978 me;
|
14. నేను దేవుణ్ణి ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు నేను ఏమి చేస్త్తాను? నేను చేసిన దాని గూర్చి వివరించు మని దేవుడు నన్ను పిలిచినప్పుడు నేను ఏమి జవాబిస్తాను?
|
14. What H4100 then shall I do H6213 when H3588 God H410 riseth up H6965 ? and when H3588 he visiteth H6485 , what H4100 shall I answer H7725 him?
|
15. దేవుడు నన్ను నా తల్లి గర్భంలోనే చేశాడు. నా సేవకులను కూడా దేవుడే చేసాడు. మమ్ముల్ని ఇద్దరినీ మా తల్లి గర్భంలో దేవుడే రూపొందిచాడు.
|
15. Did not H3808 he that made H6213 me in the womb H990 make H6213 him? and did not one H259 fashion H3559 us in the womb H7358 ?
|
16. “పేద ప్రజలకు సహాయం చేసేందుకు నేను ఎన్నడూ నిరాకరించలేదు. విధవలను దిక్కుమాలిన వారిగా నేను ఎన్నడూ ఉండనియ్యలేదు.
|
16. If H518 I have withheld H4513 the poor H1800 from their desire H4480 H2656 , or have caused the eyes H5869 of the widow H490 to fail H3615 ;
|
17. నా భోజనం విషయంలో నేను ఎన్నడూ స్వార్థంతో ఉండలేదు. అనాధ పిల్లలను నేను ఎన్నడూ ఆకలితో ఉండనీయలేదు.
|
17. Or have eaten H398 my morsel H6595 myself alone H905 , and the fatherless H3490 hath not H3808 eaten H398 thereof H4480 ;
|
18. నా జీవిత కాలం అంతా తండ్రిలేని పిల్లలకు నేను ఒక తండ్రిలా ఉన్నాను. నా జీవిత కాలం అంతా విధవల పట్ల నేను శ్రద్ధ చూపాను.
|
18. ( For H3588 from my youth H4480 H5271 he was brought up H1431 with me , as with a father H1 , and I have guided H5148 her from my mother H517 's womb H4480 H990 ;)
|
19. ఎవరో ఒకరు బట్టలు లేక శ్రమపడటం నేను చూచినప్పుడు, లేక పేదవాడు చొక్కా లేకుండా ఉన్నప్పుడు,
|
19. If H518 I have seen H7200 any perish H6 for want H4480 H1097 of clothing H3830 , or any poor H34 without H369 covering H3682 ;
|
20. నేను ఎల్లప్పుడూ వారికి బట్టలు ఇచ్చాను. వారికి వెచ్చదనం కోసం నా గొర్రెల స్వంతబొచ్చు నేను ఉపయోగించాను. అప్పుడు వారు హృదయపూర్వకంగా నన్ను ఆశీర్వదించారు.
|
20. If H518 his loins H2504 have not H3808 blessed H1288 me , and if he were not warmed H2552 with the fleece H4480 H1488 of my sheep H3532 ;
|
21. న్యాయస్థానంలో నేను గెలుస్తానని తెలిసికూడ ఒక అనాధ బిడ్డను నేను మోసం చేస్తే,
|
21. If H518 I have lifted up H5130 my hand H3027 against H5921 the fatherless H3490 , when H3588 I saw H7200 my help H5833 in the gate H8179 :
|
22. నేను ఒకవేళ అలాచేస్తే నా భుజం నుండి నా చేయి ఊడి పడిపోవును గాక. నా చేయి దాని కీలు నుండి పడిపోవును గాక.
|
22. Then let mine arm H3802 fall H5307 from my shoulder blade H4480 H7929 , and mine arm H248 be broken H7665 from the bone H4480 H7070 .
|
23. కాని ఆ చెడ్డ పనులు ఏవీ నేను చేయలేదు. ఎందుకంటే, దేవుని శిక్షకు నేను భయపడ్డాను. ఆయన మహాత్మ్యము నన్ను బెదరగొట్టేను.
|
23. For H3588 destruction H343 from God H410 was a terror H6343 to H413 me , and by reason of his highness H4480 H7613 I could H3201 not H3808 endure.
|
24. “నా ఐశ్వర్యాలను నేను ఎన్నడూ నమ్ముకొనలేదు. ‘నీవే నా ఆశ అని’ స్వచ్ఛమైన బంగారంతో నేను ఎన్నడూ చెప్పలేదు.
|
24. If H518 I have made H7760 gold H2091 my hope H3689 , or have said H559 to the fine gold H3800 , Thou art my confidence H4009 ;
|
25. నేను ధనికుడను అని ఎన్నడు గర్వంతో నిండి పోలేదు. లేక నేను సంపాదించిన ఐశ్వర్యాలతో మురిసిపోలేదు.
|
25. If H518 I rejoiced H8055 because H3588 my wealth H2428 was great H7227 , and because H3588 mine hand H3027 had gotten H4672 much H3524 ;
|
26. నేను ఎన్నడూ ప్రకాశమైన సూర్యుణ్ణి లేక అందమైన చంద్రుణ్ణి ఆరాధించలేదు.
|
26. If H518 I beheld H7200 the sun H216 when H3588 it shined H1984 , or the moon H3394 walking H1980 in brightness H3368 ;
|
27. సూర్య చంద్రులకు భక్తితో పూజ చేసేందుకు నేను ఎన్నడూ మోసగించబడలేదు.
|
27. And my heart H3820 hath been secretly H5643 enticed H6601 , or my mouth H6310 hath kissed H5401 my hand H3027 :
|
28. అలాంటిని ఏవైనా, ఎన్నడైనా నేను చేసి ఉంటే అవి నేను శిక్షించబడాల్సిన పాపాలే. ఎందుచేత నంటే ఆ చెడు కార్యాలు చేయటం మూలంగా సర్వశక్తిమంతుడైన దేవునికి నేను అపనమ్మకమైన వాడినవుతాను.
|
28. This H1931 also H1571 were an iniquity H5771 to be punished by the judge H6416 : for H3588 I should have denied H3584 the God H410 that is above H4480 H4605 .
|
29. “నా శత్రువులు నాశనం చేయబడినప్పుడు నేను ఎన్నడూ సంతోషించలేదు. నా శత్రువులకు కష్టాలు కలిగినప్పుడు నేను ఎన్నడూ నవ్వలేదు.
|
29. If H518 I rejoiced H8055 at the destruction H6365 of him that hated H8130 me , or lifted up myself H5782 when H3588 evil H7451 found H4672 him:
|
30. నా శత్రువులను శపించటం ద్వారానూ, వారుచావాలని కోరుకోవటం ద్వారానూ, నేను ఎన్నడూ నా నోటితో పాపం చేయలేదు.
|
30. Neither H3808 have I suffered H5414 my mouth H2441 to sin H2398 by wishing H7592 a curse H423 to his soul H5315 .
|
31. పరాయి వాళ్లకు నేను ఎల్లప్పుడూ భోజనం పెట్టినట్లు నా ఇంట్లోని వాళ్లందరకూ తెలుసు.
|
31. If H518 the men H4962 of my tabernacle H168 said H559 not H3808 , Oh that H4310 we had H5414 of his flesh H4480 H1320 ! we cannot H3808 be satisfied H7646 .
|
32. పరాయి వాళ్లు రాత్రి పూట వీధుల్లో నిద్రపోవాల్సిన అవసరం లేకుండా నేను అలాంటి వారిని ఎల్లప్పుడూ నా ఇంటికి ఆహ్వానించేవాడను.
|
32. The stranger H1616 did not H3808 lodge H3885 in the street H2351 : but I opened H6605 my doors H1817 to the traveler H734 .
|
33. ఇతరులు తమ పాపాలు దాచిపెట్టేందుకు ప్రయత్నిస్తారు. కాని నేను నా దొషాన్ని దాచిపెట్టలేదు.
|
33. If H518 I covered H3680 my transgressions H6588 as Adam H121 , by hiding H2934 mine iniquity H5771 in my bosom H2243 :
|
34. ఎందుకంటే, ప్రజలు ఏమనుకుంటారో అని నేను ఎన్నడూ భయపడలేదు. నేను ఎన్నడూ మౌనంగా ఉండలేదు. బయటకు వెళ్లకుండా ఉండలేదు. ఎందుకంటే, ప్రజలు నన్ను ద్వేషిస్తారనే భయంనాకు లేదు గనుక.
|
34. Did I fear H6206 a great H7227 multitude H1995 , or did the contempt H937 of families H4940 terrify H2865 me , that I kept silence H1826 , and went not out H3318 H3808 of the door H6607 ?
|
35. “ఆహా, ఎవరైనా నా మాటలు వినేవారు ఉంటే బాగుండును. ఇప్పుడు నేను నా వాదం చెబుతాను. సర్వశక్తిమంతుడైన దేవుడు నాకు జవాబిచ్చును గాక. నన్ను నిందించే ఆయన, నేను చేశానని నిందించబడుతున్న సంగతులను రాసి పెట్టును గాక.
|
35. Oh that H4310 one would H5414 hear H8085 me! behold H2005 , my desire H8420 is, that the Almighty H7706 would answer H6030 me , and that mine adversary H376 H7379 had written H3789 a book H5612 .
|
36. నిశ్చయంగా ఆ రాతను నేను నా భుజం మీద ధరిసాను. నేను దానిని కిరీటంలా ధరిస్తాను.
|
36. Surely H518 I would take H5375 it upon H5921 my shoulder H7926 , and bind H6029 it as a crown H5850 to me.
|
37. నేను చేసినది సమస్తం దేవునికి నేను వివరిస్తాను. నేను ఒక అధికారిలా నా తలపైకి ఎత్తుకొని దేవుని దగ్గరకు వస్తాను.
|
37. I would declare H5046 unto him the number H4557 of my steps H6806 ; as H3644 a prince H5057 would I go near unto H7126 him.
|
38. “నేను సాగుచేస్తున్న భూమిని దాని సొంతదారుని దగ్గర దొంగిలించి తీసుకొని ఉంటే, ఆ భూమిదాని సొంత కన్నీళ్లతో తడిసి ఉంటే,
|
38. If H518 my land H127 cry H2199 against H5921 me , or that the furrows H8525 likewise H3162 thereof complain H1058 ;
|
39. ఆ భూమి పండించిన వాటిని రైతులకు విలువ చెల్లించకుండానే నేను దొంగిలించి ఉంటే,
|
39. If H518 I have eaten H398 the fruits H3581 thereof without H1097 money H3701 , or have caused the owners H1167 thereof to lose H5301 their life H5315 :
|
40. అవును, ఈ చెడుకార్యాలు నేను కనుక చేసి ఉంటే పొలాల్లో గోధుమకు బదులు ముండ్లు, యవలకు బదులుగా కలుపు మొక్కలు మొలుచును గాక!” PS యోబు మాటలు సమాస్తం. PE
|
40. Let thistles H2336 grow H3318 instead H8478 of wheat H2406 , and cockle H890 instead H8478 of barley H8184 . The words H1697 of Job H347 are ended H8552 .
|