|
|
1. అప్పుడు యోబు మాట్లాడటం కొన సాగించాడు:
|
1. Moreover H3254 Job H347 continued H5375 his parable H4912 , and said H559 ,
|
2. “నిజంగా దేవుడు జీవిస్తున్నాడు. మరియు దేవుడు జీవించటం ఎంత సత్యమో ఆయన నాకు అన్యాయం చేశాడు. అనటం కూడ అంతే సత్యం. అవును, సర్వశక్తిమంతుడైన దేవుడు నా జీవితాన్ని బాధించాడు.
|
2. As God H410 liveth H2416 , who hath taken away H5493 my judgment H4941 ; and the Almighty H7706 , who hath vexed H4843 my soul H5315 ;
|
3. కానీ నాలో జీవం ఉన్నంతవరకు దేవుని జీవవాయువు నా నాసికా రంధ్రాలలో ఉన్నంతవరకు,
|
3. All H3605 the while H5750 my breath H5397 is in me , and the spirit H7307 of God H433 is in my nostrils H639 ;
|
4. నా పెదవులు చెడు సంగతులు మాట్లాడవు. మరియు నా నాలుక ఎన్నడూ ఒక్క అబద్దం చెప్పదు.
|
4. My lips H8193 shall not H518 speak H1696 wickedness H5766 , nor H518 my tongue H3956 utter H1897 deceit H7423 .
|
5. మీదే సరి అని నేను ఎన్నటికీ అంగీకరించను. నేను నిర్దోషిని అని నేను చచ్చే రోజువరకు చెబుతూనే ఉంటాను.
|
5. God forbid H2486 that H518 I should justify H6663 you: till H5704 I die H1478 I will not H3808 remove H5493 mine integrity H8538 from H4480 me.
|
6. నేను చేసిన సరియైన వాటిని నేను గట్టిగా పట్టు కొని ఉంటాను. సరియైన వాటిని చేయటం నేను ఎన్నటికీ మాని వేయను. నేను బతికి ఉన్నంత కాలం నా మనస్సాక్షి నన్ను బాధించదు.
|
6. My righteousness H6666 I hold fast H2388 , and will not H3808 let it go H7503 : my heart H3824 shall not H3808 reproach H2778 me so long as I live H4480 H3117 .
|
7. ప్రజలు నాకు వ్యతిరేకులయ్యారు. నా శత్రువులు దుర్మారులు శిక్షించబడినట్టు శిక్షించబడుదురు గాక.
|
7. Let mine enemy H341 be H1961 as the wicked H7563 , and he that riseth up against H6965 me as the unrighteous H5767 .
|
8. దేవుని లక్ష్యపెట్టని మనిషి చనిపోయినప్పుడు అతనికి ఆశ ఏమీ ఉండదు. అతని జీవాన్ని దేవుడు తీసివేసినప్పుడు అతనికి ఆశ లేదు.
|
8. For H3588 what H4100 is the hope H8615 of the hypocrite H2611 , though H3588 he hath gained H1214 , when H3588 God H433 taketh away H7953 his soul H5315 ?
|
9. ఆ దుర్మార్గునికి కష్టాలు వచ్చి, దేవునికి మొరపెడితే దేవుడు వినడు.
|
9. Will God H410 hear H8085 his cry H6818 when H3588 trouble H6869 cometh H935 upon H5921 him?
|
10. సర్వశక్తిమంతుడైన దేవుడు ఇచ్చే సంతోషాన్ని ఆ వ్యక్తి కోరుకొని ఉండాల్సింది. ఆ వ్యక్తి సదా దేవుని ప్రార్థించి ఉండాల్సింది.
|
10. Will he delight himself H6026 in H5921 the Almighty H7706 ? will he always H3605 H6256 call upon H7121 God H433 ?
|
11. “దేవుని శక్తిని గూర్చి నీకు నేను నేర్పిస్తాను. సర్వశక్తిమంతుడైన దేవుని పథకాలను నేను దాచి పెట్టను.
|
11. I will teach H3384 you by the hand H3027 of God H410 : that which H834 is with H5973 the Almighty H7706 will I not H3808 conceal H3582 .
|
12. దేవుని శక్తిని మీరు మీ కళ్లారా చూశారు. కనుక మీరు అలాంటి పనికిమాలిన మాటలు ఎందుకు చెబుతారు?
|
12. Behold H2005 , all H3605 ye yourselves H859 have seen H2372 it ; why H4100 then are ye thus H2088 altogether H1892 vain H1891 ?
|
13. దుర్మార్గులకు దేవుడు తలపెట్టినది ఇదే. సర్వశక్తిమంతుడైన దేవుని నుండి కృర మానవులకు లభించేది ఇదే.
|
13. This H2088 is the portion H2506 of a wicked H7563 man H120 with H5973 God H410 , and the heritage H5159 of oppressors H6184 , which they shall receive H3947 of the Almighty H4480 H7706 .
|
14. ఒకవేళ దుర్మార్గునికి చాలామంది పిల్లలు ఉండ వచ్చునేమో కాని వాని పిల్లలు యుద్ధంలో చంపి వేయబడతారు. దుర్మార్గుని పిల్లలు తినేందుకు సరిపడినంత ఆహారం ఎన్నడూ ఉండదు.
|
14. If H518 his children H1121 be multiplied H7235 , it is for H3926 the sword H2719 : and his offspring H6631 shall not H3808 be satisfied H7646 with bread H3899 .
|
15. దుర్మార్గుడు చనిపోయిన తర్వాత అతని పిల్లలు ఇంకా బతికి ఉంటే భయంకర రోగం వారిని చంపేస్తుంది. అతని కుమారుల విధవలు వారి కోసం విచారించరు.
|
15. Those that remain H8300 of him shall be buried H6912 in death H4194 : and his widows H490 shall not H3808 weep H1058 .
|
16. ఒకవేళ దుర్మార్గుడు దుమ్ములా విస్తారమైన వెండిని రాశిగా పోయవచ్చు. ఒకవేళ మట్టి పోగుల్లా అతనికి చాలా బట్టలు ఉండవచ్చును.
|
16. Though H518 he heap up H6651 silver H3701 as the dust H6083 , and prepare H3559 raiment H4403 as the clay H2563 ;
|
17. దుర్మార్గుడు సంపాదిస్తూ విడిచిపోయిన బట్టలను ఒక మంచి మనిషి ధరిస్తాడు. దుర్మార్గుని వెండిని నిర్దోషులు పంచుకొంటారు.
|
17. He may prepare H3559 it , but the just H6662 shall put it on H3847 , and the innocent H5355 shall divide H2505 the silver H3701 .
|
18. దుర్మార్గుడు నిర్మించే యిల్లు ఎక్కువ కాలం నిలువదు. అది సాలె గూడులా ఉంటుంది లేక కావలివాని గుడారంలా ఉంటుంది.
|
18. He buildeth H1129 his house H1004 as a moth H6211 , and as a booth H5521 that the keeper H5341 maketh H6213 .
|
19. దుర్మార్గుడు ధనికునిగా నిద్రకు ఉపక్రమిస్తాడు. కానీ ఆ తర్వాత అతను కళ్లు తెరిచినప్పుడు అతని సంపదంతా పోయినట్లు అతనికి తెలుస్తంది.
|
19. The rich man H6223 shall lie down H7901 , but he shall not H3808 be gathered H622 : he openeth H6491 his eyes H5869 , and he is not H369 .
|
20. ఆకస్మిక వరదలా భయాలు అతణ్ణి పట్టు కొంటాయి. రాత్రి వేళ ఒక తుఫాను అతణ్ణి కొట్టు కొని పోతుంది.
|
20. Terrors H1091 take hold H5381 on him as waters H4325 , a tempest H5492 stealeth him away H1589 in the night H3915 .
|
21. తూర్పుగాలి అతణ్ణి కొట్టుకొని పొతుంది. అప్పుడు అతడు అంతమై పోతాడు. తుఫాను అతణ్ణి అతని యింటినుండి తుడుచుకుని పోతుంది.
|
21. The east wind H6921 carrieth him away H5375 , and he departeth H1980 : and as a storm hurleth H8175 him out of his place H4480 H4725 .
|
22. తుఫాను బలం నుండి దుర్మార్గుడు పారిపోవాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ తుఫాను అతణ్ణి నిర్దాక్షిణ్యంగా కొడుతుంది.
|
22. For God shall cast H7993 upon H5921 him , and not H3808 spare H2550 : he would fain flee H1272 H1272 out of his hand H4480 H3027 .
|
23. దుర్మార్గుడు పారిపోతూ ఉండగా మనుష్యులు చప్పట్లు కొడతారు. దుర్మార్గుడు తన యింటినుండి పారిపోతూంటే, వానికి విరోధంగా వాళ్లు ఈల వేస్తారు.” PE
|
23. Men shall clap H5606 their hands H3709 at H5921 him , and shall hiss H8319 H5921 him out of his place H4480 H4725 .
|