Bible Versions
Bible Books

Isaiah 12 (ERVTE) Easy to Read Version - Telugu

1 సమయంలో మీరంటారు: “యెహోవా, నిన్ను నేను స్తుతిస్తున్నాను. నీకు నామీద కోపం వచ్చింది. కానీ ఇప్పుడు నామీద కోపగించకుము. నీ ప్రేమ నాకు చూపించు.”
2 దేవుడు నన్ను రక్షిస్తున్నాడు. ఆయన్నే నేను నమ్ముకొంటాను. నాకేం భయంలేదు. ఆయన నన్ను రక్షిస్తాడు. యెహోవా, యెహోవాయే నా బలం . ఆయన నన్ను రక్షిస్తున్నాడు. నేను ఆయనకు స్తోత్రగీతాలు పాడుతాను.
3 రక్షణ ఊటల్లోనుండి మీ నీళ్లు తెచ్చు కోండి. అప్పుడు మీరు సంతోషిస్తారు.
4 “యెహోవాకు స్తోత్రాలు! ఆయన నామం ఆరాధించండి! ఆయన చేసిన కార్యాలను గూర్చి ప్రజలందరితో చెప్పండి” అని అప్పుడు మీరు అంటారు.
5 యెహోవాను గూర్చిన స్తోత్రగీతాలు పాడండి. ఎందుకంటే, ఆయన గొప్ప కార్యాలు చేశాడు గనుక. దేవుని గూర్చిన వార్త ప్రపంచ వ్యాప్తంగా ప్రకటించండి. పజలందర్నీ విషయాలు తెలుసుకోనివ్వండి.
6 సీయోను ప్రజలారా, సంగతులను గూర్చికేకలు వేయండి. ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు శక్తివంతంగా మీతో ఉన్నాడు. అందుచేత, సంతోషంగా ఉండండి!
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×