Bible Versions
Bible Books

Proverbs 30 (ERVTE) Easy to Read Version - Telugu

1 యాకె కుమారుడు ఆగూరు చెప్పిన జ్ఞాన సూక్తులు ఇవి: అతడు ఈతీయేలుకు, ఉక్కాలుకు ఇచ్చిన సందేశం:
2 భూమి మీద నేను అతి దౌర్భాగ్యుడను. నేను గ్రహించాల్సిన విధంగా గ్రహించటంలేదు.
3 జ్ఞానము కలిగి ఉండటం నేను నేర్చుకోలేదు. మరియు దేవుని గురించి నాకు ఏమీ తెలియదు.
4 మనిిషీ ఎన్నడూ పరలోకంలోని సంగతులను గూర్చి నేర్చుకోలేదు. మనిిషీ ఎన్నడూ గాలిని తన చేతిలో పట్టుకోలేదు. మనిిషీ ఎన్నడూ నీటిని ఒక గుడ్డ ముక్కలో పట్టుకోలేడు. మనిిషీ ఎన్నడూ భూమి హద్దులను నిజంగా తెలిసికోలేడు. సంగతులను తెలిసికో గలిగిన మనిషి ఎవరైనా ఉంటే మనిషి ఎవరు? అతని కుటుంబం ఎక్కడ ఉంది?
5 దేవుడు చెప్పే ప్రతి మాటా పరిపూర్ణం. దేవుని దగ్గరకు వెళ్లే మనుష్యులకు ఆయన ఒక క్షేమస్థానం
6 కనుక దేవుడు చెప్పే విషయాలను మార్చేందుకు ప్రయత్నించకు. నీవు అలా చేస్తే ఆయన నిన్ను శిక్షించి, నీవు అబద్ధాలు చెబుతున్నట్టు రుజువు చేస్తాడు.
7 యెహోవా, నేను చనిపోక ముందు నా కోసం రెండు పనులు చేయుమని నేను నిన్ను అడుగుతున్నాను.
8 అబద్ధాలు చెప్పకుండా ఉండేందుకు నాకు సహాయం చేయి. నన్ను మరీ ధనికునిగా లేక మరీ దరిద్రునిగా చేయవద్దు. ప్రతిరోజూ నాకు అవసరమైన వాటిని మాత్రమే అనుగ్రహించు.
9 నాకు అవసరమైన దానికంటే నాకు ఎక్కువగా ఉంటే, అప్పుడు నీతో నాకు అవసరం లేదని నేను తలస్తాను. కాని నేను దరిద్రుడనైతే ఒకవేళ నేను దొంగతనం చేస్తానేమో. అప్పుడు నేను యెహోవా నామానికి అవమానం తెస్తాను.
10 ఒక సేవకునికి విరోధంగా అతని యజమానితో చెడ్డ మాటలు ఎన్నడూ చెప్పవద్దు. నీవు అలా చేస్తే యజమాని నిన్ను నమ్మడు. నీవు దోషివని అతడు తలస్తాడు.
11 కొందరు మనుష్యులు వారి తండ్రులకు విరోధంగా మాట్లాడతారు. మరియు వారి తల్లులను గౌరవించరు.
12 కొందరు చాలా మంచివాళ్లం అనుకొంటారుగాని వారు చాలా చెడ్డవాళ్లు.
13 కొంతమంది చాలా మంచివాళ్లం అనుకొంటారు. వారు యితరులకంటే చాలా మంచివాళ్లు అనుకొంటారు.
14 ఖడ్గాల్లాంటి పళ్లు ఉన్నవారు కొందరు ఉంటారు. వారి దవడలు కత్తుల్లా ఉంటాయి. వారు పేద ప్రజలనుండి సమస్తం దోచుకోవటానికి వారి సమయం అంతా ఉపయోగిస్తారు.
15 కొంతమంది వారికి చేతనైనంత మట్టుకు అంతా తీసికోవాలి అనుకొంటారు. “నాకివ్వు, నాకివ్వు, నాకివ్వు” అనటం మాత్రమే వారు చెప్పేది అంతాను. ఎన్నటికీ తృప్తిపడనివి మూడు ఉన్నాయి వాస్తవానికీ సరిపడినంతగా ఎన్నడూ లేనివి నాలుగు ఉన్నాయి.
16 చావు స్థలం, పిల్లలు లేని స్త్రీ, వర్షం కావాల్సిన బీడుభూమి, వారించజాలని వేడి నిప్పు.
17 తన తండ్రిని ఎగతాళి చేసే మనిిషీ, తన తల్లికి లోబడని మనిషీ ఎవరైనా సరే శి క్షించబడుతారు. అది అతని కళ్లు రాబందులు, లేక కృ-రపక్షులు తినివేసినట్టు ఉంటుంది.
18 నేను గ్రహించేందుకు కష్టతరమైనవి మూడు సంగతులు ఉన్నాయి వాస్తవానికి నేను గ్రహించనివి నాలుగు సంగతులు ఉన్నాయి.
19 ఆకాశంలో ఎగిరే పక్షిరాజు, ఒక బండ మీద పాకుచున్న ఒక పాము, మహా సముద్రంలో తిరిగే ఓడ, ఒక స్త్రీతో ప్రేమలోవున్న మగవాడు.
20 తన భర్తకు నమ్మకంగా లేని ఒక భార్య తాను ఏమీ తప్పు చేయనట్టు నటిస్తుంది. ఆమె భోంచేస్తుంది, స్నానం చేస్తుంది, నేను ఏమీ తప్పు చేయలేదు అంటుంది.
21 భూమి మీద చిక్కు కలిగించేవి మూడు సంగతులు ఉన్నాయి. వాస్తవానికి భూమి భరించలేనివి నాలుగు ఉన్నాయి.
22 రాజైన ఒక సేవకుడు, తనకు కావాల్సినవి అన్నీ కలిగి ఉన్న ఒక బుద్ధిహీనుడు,
23 ద్వేషంతో పూర్తిగా నిండిపోయినా, ఒక భర్తను పొంద గలిగిన స్త్రీ, స్త్రీ దగ్గర సేవ చేస్తుందో, స్త్రీ మీద అధికారిణి అయిన దాసి.
24 భూమి మీద చిన్నవిగా ఉన్నవి నాలుగు ఉన్నాయి. అయితే ఇవి చాలా జ్ఞానము గలవి.
25 చీమలు చిన్నవి, బలహీనమైనవి. కానీ అవి వేసవి కాలం అంతా ఆహారం నిల్వచేసు కొంటాయి.
26 కుందేలు చిన్న జంతువు. కానీ అది బండల్లో నివాసం ఏర్పాటు చేసు కోగలుగుతుంది.
27 మిడతలకు రాజు లేడు. కానీ అవన్నీ కలిసికట్టుగా పని చేయగలుగుతున్నాయి.
28 బల్లులు నీవు చేతితో పట్టుకోగలిగినంత చిన్నవి. కానీ అవి రాజుల గృహాలలో నివసించటం నీవు చూడ గలవు.
29 నడుస్తున్నప్పుడు ముఖ్యమైనవిగా కనుపించేవి మూడు ఉన్నాయి. నిజానికి నాలుగు ఉన్నాయి. 30సింహం జంతువులలోకెల్ల చాలా బలమైనది. అది దేనికీ భయపడదు.
30 చాలా గర్వంగా నడిచే కోడి పుంజు, ఒక మేక పోతు, తన ప్రజల మధ్య ఉన్న రాజు.
31 నీవు తెలివితక్కువ వాడవై యుండి ఇతరులకంటె నీవే మంచివాడవు అని తలిస్తే, మరియు నీవు దుర్మార్గాన్ని తల పెడితే, నీవు ఆగిపోయి, నీవు చేస్తున్నదాన్ని గూర్చి ఆలోచించాలి.
32 ఒక మనిషి పాలను చిలికి వెన్న చేస్తాడు. ఒకడు మరొకని ముక్కు మీద కొడితే, రక్తం వస్తుంది. అదే విధంగా నీవు ప్రజలకు కోపం పుట్టిస్తే నీవు చిక్కు కలిగిస్తావు.
33 This verse may not be a part of this translation
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×