Bible Versions
Bible Books

Isaiah 52 (ERVTE) Easy to Read Version - Telugu

1 మేలుకో! మేలుకో! సీయోనూ మేలుకో. నీవు వస్త్రాలు ధరించు. నీ బలంతొడుగుకో. పవిత్ర యెరూషలేమా, నిలుచో! దేవుణ్ణి వెంబడించేందుకు ఒప్పు కొని ప్రజలు , పవిత్రంగా లేని ప్రజలు నీలో మరల ప్రవేశింపరు.
2 ధూళి దులిపివేయి! అద్భుతమైన నీ వస్త్రాలు ధరించు! సీయోను కుమారీ, యెరూషలేమా, నీవు ఒక ఖైదీవి. కాని ఇప్పుడు నీ మెడ చుట్టూ ఉన్న గొలుసుల నుండి నిన్ను నీవు విడుదల చేసుకో!
3 యెహోవా చెబతున్నాడు, “నీవు డబ్బుకు అమ్మబడలేదు. అందుచేత డబ్బు లేకుండనే నీవు రక్షించబడతావు.”
4 నా ప్రభువు యెహోవా చెబతున్నాడు: “నా ప్రజలు నివాసం ఉండేందుకు మొదట ఈజిప్టుకు దిగిపోయారు, తర్వాత వారు బానిసలయ్యారు. తర్వాత వారిని అష్షూరు బానిసలను చేసింది.
5 ఇప్పుడు చూడండి ఏమయిందో! మరో రాజ్యాం నా ప్రజలను తీసుకొంది. నా ప్రజలను బానిసలుగా తీసుకొన్న రాజ్యం ఏది? నా ప్రజలను తీసుకొనేందుకు రాజ్యం ఏమీ చెల్లించలేదు. రాజ్యం నా ప్రజలను పాలిస్తూ, వారిని చూచి నవ్వుతుంది. మనుష్యులు ఎప్పుడూ నన్ను గూర్చి చెడ్డ మాటలే చెబుతుంటారు.”
6 “నా ప్రజలు నన్ను గూర్చి నేర్చుకొనేందుకు ఇది జరిగింది. నేను ఎవరినో నా ప్రజలు తెలుసుకొంటారు. నా ప్రజలు నా పేరు తెలుసుకొంటారు, ఉన్నవాడను అనే నేను వారితో మాట్లాడుతున్నానని వారు తెలుసుకొంటారు” అని యెహోవా చెబుతున్నాడు.
7 శుభవార్తతో కొండల మీదుగా ఒక వార్తాహరుడు రావటం ఎంతో అద్భుతంగా ఉంటుంది. “శాంతి ఉంది! మేము రక్షించబడ్డాం! మీ దేవుడే రాజు!”అని ఒక వార్తాహరుడు ప్రకటించగా వినటం అద్భుతం.
8 పట్టణపు కావలి వాళ్లు కేకలు వేయటం మొదలు పెట్టారు. వాళ్లంతా కలిసి ఆనందిస్తున్నారు. ఎందుకు? ఎందుకంటే, యెహోవా సీయోనుకు తిరిగి రావటం వారిలో ప్రతి ఒక్కరూ చూస్తారు.
9 యెరూషలేమా, నాశనం చేయబడిన నీ కట్టడాలు మరల సంతోషిస్తాయి. మీరంతా కలిసి ఆనందిస్తారు. ఎందుకంటే, యెరూషలేముమీద యెహోవా దయగలిగి ఉంటాడు. యెహోవా తన ప్రజలను విమోచిస్తాడు.
10 యెహోవా తన పవిత్ర శక్తిని సకల రాజ్యాలకు చూపిస్తాడు. మరియు దేవుడు తన ప్రజలను ఎలా రక్షిస్తాడో అది దూర దేశాలన్నీ చూస్తాయి.
11 ప్రజలారా మీరు బబులోను విడిచిపెట్టాలి. స్థలం విడిచిపెట్టండి! ఆరాధనలో ఉపయెగించే వస్తువలను మోసే మనుష్యులారా మిమ్మల్ని మీరు పవిత్రం చేసుకోండి. అపవిత్రమైన దేన్ని ముట్టుకో వద్దు.
12 మీరు బబులోను విడిచిపెడ్తారు. కానీ మీరు ఆత్రంగా విడిచిపెట్టేందుకు బలవంతం చేయబడరు. పారిపోయేందుకు మీరు బలవంతం చేయబడరు. మీరు బయటకు నడుస్తారు మరియు యెహోవా మీతో నడుస్తాడు. యెహోవా మీకు ముందు ఉంటాడు. ఇశ్రాయేలీయుల దేవుడు మీ వెనుక ఉంటాడు .
13 “నా సేవకుని చూడు. అతనికి విజయం కలుగుతుంది. అతడు చాలా ప్రముఖుడవుతాడు. భవిష్యత్తులో ప్రజలు అతన్ని సన్మానించి, గౌరవిస్తారు.
14 “కానీ చాలా మంది మనుష్యులు నా సేవకుని చూచి అదరిపోయారు. అతణ్ణి ఒక మనిషిగా వారు గుర్తించలేనంతగా అతడు బాధించబడ్డాడు.
15 కానీ అంతకంటె ఎక్కువమంది ప్రజలు ఆశ్చర్యపోతారు. రాజులు అతన్ని చూచి ఆశ్చర్యపోయి, నోట మాట రాకుండా ఉండిపోతారు. నా సేవకుని గూర్చిన కథ వారు వినలేదు- జరిగింది వారు చూశారు. ప్రజలు కథ వినలేదు గాని వారు గ్రహించారు.”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×