Bible Versions
Bible Books

Job 6 (ERVTE) Easy to Read Version - Telugu

1 This verse may not be a part of this translation
2 This verse may not be a part of this translation
3 సముద్రాల ఇసుక కంటె నా దుఃఖం ఎక్కువ బరువయిందని నీవు గ్రహిస్తావు! అందుకే నా మాటలు వెర్రిగా కనిపిస్తాయి.
4 సర్వశక్రిమంతుడైన దేవుని బాణాలు నాలో ఉన్నాయి. బాణాల విషం నా ఆత్మ తాగు తుంది. దేవుని దారుణ విషయాలు అన్నీ కలిపినాకు విరోధంగా ఉంచబడ్డాయి.
5 (ఏ చెడుగూ జరగనప్పుడు మాటలాడడం సులభం) అడవి గాడిద తినేందుకు గడ్డి ఉంటే అదేమి గొడవ చెయ్యదు. ఆవుకు ఆహారం ఉంటే అది ఆరోపణ చెయ్యదు.
6 రుచిలేని భోజనం ఉప్పు లేకుండా తినగలమా? గ్రుడ్డులోని తెల్లసొన రుచిలేనిది.
7 (ఇప్పుడు నీ మాటలు వీటివలెనే ఉన్నాయి) దానిని నేను ముట్టుకో వటానికి గూడా ఒప్పుకోను; అలాంటి భోజనం నన్ను జబ్బు మనిషిలా చేస్తుంది.
8 “నేను అడిగింది నాకు దొరకాలని కోరుకుంటాను. నేను దేనికోసం కనిపెట్టుకొని ఉంటానో, దాన్ని దేవుడు నాకు ఇవ్వాలని కోరుకుంటాను.
9 దేవుడు నన్ను చితకగొట్టేందుకు ఇష్టపడి, నన్ను చంపివేస్తాడని నేను నిరీక్షిస్తున్నాను!
10 ఆయన నన్ను చంపివేస్తే, ఒక్క విషయంలో నేను ఆదరణ పొందుతాను. ఎడతెగని నా బాధల్లోనే నేను ఒక్క విషయంలో సంతోషిస్తాను. పరిశుద్ధుని ఆదేశాలకు విధేయత చూపేందుకు నేను తిరస్కరించలేదు.
11 “నా బలం క్షిణించిపోయింది, గనుక నేను ఇంకా బతుకుతాను అనే ఆశాకిరణం నాకు లేదు. చివరికి నాకు ఏమి జరుగుతుందో నాకు తెలియదు. అందుచేత నేను సహనంగా ఉండాల్సిన కారణం ఏమీ లేదు.
12 బండలాంటి బలం నాకు లేదు. నా శరీరం కంచుతో చేయబడలేదు.
13 ఇప్పుడు నాకు నేను సహాయం చేసుకొనే శక్తినాకు లేదు. ఎందుకంటే విజయం నా వద్దనుండి తొలగించి వేయబడింది.
14 “ఒక మనిషి కష్టాల్లో ఉంటే, అతని స్నేహితులు అతని మీద దయ చూపాలి. ఒక మనిషి, తన స్నేహితుడు సర్వశక్తిమంతుడైన దేవుని నుండి దూరంగా పోయినా సరే అతడు స్నేహితునికి నమ్మకంగా ఉండాలి.
15 కానీ, నా సోదరులారా, మీరు నమ్మకస్థులు కారు. నేను మీ మీద ఆధారపడలేదు. ఒక్కొక్కప్పుడు ప్రవహించి, ఒక్కొక్కప్పుడు నిలిచిపోయే కాలు వల్లా ఉన్నారు మీరు.
16 మంచు గడ్డలు కరిగిపోయే హిమం అడ్డుకొన్నప్పుడు పొంగి ప్రవహించే కాలువల్లా ఉన్నారు మీరు.
17 కానీ కాలువలు ఎండిపోయిన వేళ ప్రవహించవు. వేడిగాలి వీచినప్పుడు నీళ్లు ఉండవు. కాలువలు ప్రవహించవు.
18 వ్యాపారస్థుల బృందాలు వారి మార్గాలలోని మలుపులు కొసలు తిరిగి పనికిమాలిన నేల మీదకు వెళ్లి అక్కడ మరణిస్తారు.
19 తేమా వర్తక బృందాలు నీళ్లకోసం వెదుకుతారు. షేబా ప్రయాణీకులు ఆశగా (నీళ్ల కోసం) చూస్తూరు.
20 నీళ్లు దొరుకునని వారు గట్టిగా నమ్మారు. కానీ ఈసారి వారు అక్కడికి రాగానే నిరాశ చెందారు.
21 ఇప్పుడు మీరూ కాలువల్లా ఉన్నారు. మీరు సహాయం చేయరు. మీరు నా కష్టాలు చూచి భయపడుతున్నారు.
22 నాకు ఏమైనా ఇవ్వండి, మీ ఐశ్వర్యంలోనుండి నాకు ధనం ఇవ్వండి అని నేను ఎన్నడూ చెప్పలేదు.
23 ‘శత్రువు బలంనుండి నన్ను రక్షించండి. మూర్ఖులైన వారి నుండి నన్ను రక్షించండి’ అని నేను ఎన్నడూ చెప్పలేదు.
24 కనుక, ఇప్పుడు నాకు నేర్పించండి. నేను నెమ్మదిగా ఉంటాను. నేను ఏమి తప్పు చేశానో నాకు చూపించండి.
25 నిజాయితీ మాటలు శక్తి గలవి. కానీ మీ వాదాలు దేనినీ రుజువు చేయవు.
26 నేను చెప్పే వాటిని మీరు విమర్శిస్తారా? మరింత నిరుత్సాహం కలిగించే మాటలు పలుకుతారా?
27 అవును, తండ్రులు లేని పిల్లలకు చెందిన వాటిని సంపాదించటం కోసం మీరు జూదమైనా సరే ఆడతారు. మీరు మీ స్నేహితుణ్ణి అమ్ముకొంటారు.
28 కానీ, ఇప్పుడు దయచేసి నా ముఖం పరిశీలించండి. నేను మీతో ఆబద్ధం చెప్పను.
29 కనుక ఇప్పుడు మీ మనసు మార్చుకోండి. అన్యాయంగా ఉండవద్దు. అవును, మళ్లీ ఆలోచించండి. నేను తప్పు ఏమీ చేయలేదు.
30 నేను అబద్ధం చెప్పటం లేదు. నా మాటల్లో చెడు ఏమీ లేదు. తప్పు, ఒప్పు నాకు తెలుసు.”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×