Bible Versions
Bible Books

Joel 1 (ERVTE) Easy to Read Version - Telugu

1 పెతూయేలు కుమారుడైన యోవేలు సందేశాన్ని యెహోవా దగ్గరనుండి అందుకొన్నాడు:
2 నాయకులారా, సందేశం వినండి! దేశంలోనివసించే మనుష్యులారా, మీరందరూ నామాట వినండి. మీ జీవితకాలలంలో ఇలాంటిదిఏదైనా ఇదివరకు జరిగిందా? లేదు! మీతండ్రుల కాలంలో ఇలాంటిది ఎదైనా జరిగిందా? లేదు!
3 సంగతులను గూర్చి మీరు మీ పిల్లలతో చెపుతారు. మీపిల్లలు వారి పిల్లలతో చెపుతారు. మీ మనుమలు, మనుమరాండ్రు తమ తరువాత తరమువారితో చెపుతారు.
4 కోతమిడుతలు విడిచిపెట్టిన దానిని దండు మిడుతలు తినేస్తాయి దండు మిడుతలు విడిచిపెట్టిన దానిని దూకుడు మిడుతలు తినేస్తాయి. దూకుడు మిడుతలు విడిచి పెట్టిన దానిని వినాశ మిడుతలు తినేశాయి!
5 మద్యపానమత్తులారా మేల్కొని, ఏడ్వండి! ద్రాక్షామద్యం తాగే మీరందరూ ఏడ్వండి. ఎందుకంటే మీ క్రొత్త ద్రాక్షామద్యం అయిపొయింది. ద్రాక్షామద్యం మరోగుక్కెడు మీకు దొరకదు.
6 నా రాజ్యం మీద యుద్ధం చేయటానికి, ఒకపెద్ద శక్తిగల రాజ్యం వస్తోంది. వారు లెక్కించ శక్యంకానంత మంది సైనికులు ఉన్నారు. ఆమిడుతలు (శత్రుసైనికులు) మిమ్మల్ని నిలువునా చీల్చివేయగలవు! అది వారికి సింహపుకోరలు ఉన్నట్టుగా ఉంట్టుంది.
7 నా ద్రాక్షావల్లుల నుండి ద్రాక్షాపళ్ళు అన్నింటినీ “మిడుతలు”తినేస్తాయి! అవి నా అంజూరపు చెట్లను నాశనం చేస్తాయి. మిడుతలు నా చె ట్లబెరడును తినేస్తాయి. కొమ్మలు తెల్లబారి పోతాయి. చెట్లు నాశనం చేయబడతాయి.
8 పెళ్లికి సిద్ధంగా ఉండి తనకు కాబోయే భర్త అప్పుడే చంపి వేయబడిన ఒక యువతిలా ఏడ్వండి.
9 యాజకులారా! యెహోవా సేవకులారా! ఏడ్వండి. ఎందుకంటే యెహోవా ఆలయంలో ధాన్యార్పణం, పానీయార్పణం ఇక ఉండవు.
10 పొలాలు పాడు చేయబడ్డాయి. చివరికి నేలకూడా విలపిస్తుంది. ఎందుకనగా ధాన్యం పాడైపొయింది.కొత్త ద్రాక్షారసం ఎండిపోయింది. ఒలీవ నూనె ఇకలేదు.
11 రైతులారా విచారించండి! ద్రాక్షాతోట రైతులారా గట్టిగా ఏడ్వండి. గోధుమ, బార్లీ కోసం ఏడ్వండి! ఎందుకంటే పొలంలోని పంట నష్టమైంది.
12 ద్రాక్షా వల్లులు ఎండియాయి. అంజూరపుచెట్టు చస్తోంది.దానిమ్మ చెట్టు, ఖర్జూరపుచెట్టు, ఆపిల్ చెట్టు, పొలములోని చెట్లు అన్నీ ఎండి పోయాయి. ప్రజల్లో సంతోషం చచ్చింది.
13 యాజకులారా, మీ విచార సూచక వస్త్రాలు ధరించి గట్టిగా ఏడ్వండి. బలిపీఠపు సేవకులారా, నా దేవుని సేవకులారా, మీరు మీ విచారసూచక వస్త్రాలతోనే నిద్రపోతారు. ఎందుకంటే దేవుని ఆలయంలో ధాన్యార్పణం, పానీయార్పణం ఇకమీదట ఉండవు. మా వేశ పరచు నీ దేవుడైన సమయం ఉయెహోవా ఆలయానికి వారిని తీసుకొని వచ్చి యెహోవాకు ప్రార్థించండి.
14 ఉపవాసం ఉండాల్సిన ఒక ప్రత్యేక సమయం ఉంటుందని ప్రజలతో చెప్పు. ప్రత్యేకమైన ఒక సమావేశం కోసర ప్రజల్నిపిలువుము. దేశంలో నివసిస్తున్న నాయకులను, ప్రజలందరిని సమావేశ పరచు. నీదేవుడైన యెహోవా ఆలయాని కివారిని తీసుకొనివచ్చి యెహోవాకు ప్రార్థించండి.
15 దుఃఖపడండి! ఎందుకంటే యెహోవా ప్రత్యేకదినం సమీపంగా ఉంది. సమయంలో సర్వశక్తిమంతుడైన దేవుని దగ్గర నుండి శిక్ష ఒక దాడిలా వస్తుంది.
16 మన ఆహారం పోయింది. మన దేవుని ఆలయం నుండి ఆనందం, సంతోషం పోయాయి.
17 మనం విత్తనాలు విత్తాం, కాని విత్తనాలు ఎండిపోయి చచ్చి మట్టిలో పడివున్నాయి. మన మొక్కలు ఎండపోయి చచ్చిపోయాయి. మన కొట్టాలు ఖాళీ అయిపోయి పడిపోతున్నాయి.
18 జంతువులు ఆకలితో మూలుగుతున్నాయి. పశువుల మందలు గందరగోళంగా తిరుగుతున్నాయి. అవి మేసేందుకు గడ్డి లేదు. గొర్రెలు చస్తున్నాయి.
19 యెహోవా, సహయంకోసం నీకు నేను మొరపెడుతున్నాను. అగ్ని మా పచ్చటి పొలాలను ఎడారిగా మార్చేసింది. పొలంలొని చెట్లన్నింటినీ జ్వాలలు కాల్చి వేశాయి.
20 అడవి జంతువులకు కూడ నీ సహాయం కావాలి. కాలువలు ఎండిపోయాయి, నీళ్ళు లేవు! మా పచ్చటి పొలాలను అగ్ని ఎడారిగా మార్చివేసింది.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×