Bible Versions
Bible Books

Malachi 4 (ERVTE) Easy to Read Version - Telugu

1 “తీర్పు సమయం వస్తుంది. అది కాలుతున్న అగ్ని గుండంలా ఉంటుంది. గర్విష్ఠులు అందరూ శిక్షించబడతారు. దుర్మార్గులు అందరూ గడ్డిలా కాలిపోతారు. సమయంలో వారు అగ్నిలో మండుతున్న ఒక పొదలా ఉంటారు - దాని కొమ్మగాని వేరుగాని మిగలదు.” సర్వశక్తిమంతుడైన యెహోవా విషయాలు చెప్పాడు.
2 “అయితే నా అనుచరులారా, ఉదయిస్తున్న సూర్యునిలా, మంచితనం మీమీద ప్రకాశిస్తుంది. మరియు సూర్యకిరణాలవలె అది స్వస్థతా శక్తిని తెచ్చి పెడ్తుంది. పాక నుండి విడిచిపెట్టబడిన దూడల్లా, మీరు స్వేచ్ఛగా, సంతోషంగా ఉంటారు.
3 అప్పుడు మీరు దుర్మార్గుల మీద సడుస్తారు - వారు మీ పాదాలకింద బూడిదలా ఉంటారు. తీర్పు సమయంలో సంగతులను నేను సంభవింపజేస్తాను.” సర్వశక్తి మంతుడైన యెహోవా విషయాలు చెప్పాడు!
4 మోషే ధర్మశాస్త్రాన్ని జ్ఞాపకం ఉంచుకొని, విధేయత చూపండి. మోషే నా సేవకుడు. హోరేబు (సీనాయి) కొండమీద ఇశ్రాయేలీయులందరి కోసం చట్టాలు, నియమాలు నేను అతనికి ఇచ్చాను.”
5 “చూడండి, ఏలీయా ప్రవక్తను నేను మీ దగ్గరకు వంపిస్తాను. యెహోవా నుంచి వచ్చే మహాభయంకర తీర్పు సమయానికి ముందు ఆయన వస్తాడు.
6 This verse may not be a part of this translation
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×