Bible Books

:
-

1. {సెలోపెహదు కుమార్తెల భూమి} PS యోసేపు కుమారుడు మనష్షే. మనష్షే కుమారుడు మాకీరు. మాకీరు కుమారుడు గిలాదు. గిలాదు వంశపు నాయకులు మోషేతో, ఇశ్రాయేలు వంశాల నాయకులతో మాట్లాడటానికి వెళ్లారు.
2. వారు ఇలా అన్నారు: “అయ్యా, చీట్లు వేసి భూమిని తీసుకోమని యోహోవా మనకు ఆజ్ఞాపించాడు. మరియు అయ్యా, సెలోపెహదు భూమిని అతడు కుమార్తెలకు ఇవ్వవలెనని యెహోవా ఆజ్ఞాపించాడు. సెలోపెహదు మా సోదరుడు.
3. ఒకవేళ మరేదైనా ఇశ్రాయేలు వంశంలోనుండి మరెవరైనా సెలోపెహదు కుమార్తెల్లో ఒకరిని వివాహము చేసుకోవచ్చు. భూమి మా కుటుంబం నుండి పోతుందా? మరో వంశంవారు భూమిని తీసు కుంటారా? చీట్లు వేయడం ద్వారా మాకు లభించిన భూమిని మేము పొగొట్టు కుంటామా?
4. ప్రజలు వారి భూమిని అమ్మివేయవచ్చు. అయితే బూరధ్వని చేసే మహోత్సవ కాలంలో భూమి అంతా దని అసలైన సొంతదారులకు తిరిగి ఇవ్వబడుతుంది. సమయంలో, సెలోపెహదు కుమార్తెలకు చెందిన భూమి ఎవరికి లభిస్తుంది? అలా గనుక జరిగితే మా కుటుంబం శాశ్వతంగా భూమిని పోగొట్టు కుంటుంది కదా?” PEPS
5. మోషే ఇశ్రాయేలీయులకు ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ యోహోవానుండి వచ్చింది. “యోసేపు వంశపు మనుష్యులు సరిగ్గా చెప్పారు.
6. ఇది సెలోపెహదు కుమార్తెలకు యెహోవా ఇచ్చిన ఆజ్ఞ. మీరు ఎవరినైనా వివాహమాడాలనుకుంటే మీ స్వంతవంశంలో వారినే వివాహము చేసుకోవాలి.
7. విధంగా ఇశ్రాయేలు ప్రజల్లో భూమి ఒక వంశంనుండి మరో వంశానికి మారిపోదు. ఇశ్రాయేలీయులు ప్రతి ఒక్కరూ వారి పూర్వీకులకు చెందిన భూమిని కాపాడాలి.
8. ఒకవేళ ఎవరైవా స్త్రీకి తన తండ్రి భూమి సంక్రమిస్తే, ఆమె తన స్వంత వంశం వారినే ఎవరినైనా వివాహము చేసుకోవాలి. విధంగా ప్రతి వ్యక్తీ తన పూర్వీకులకు చెందిన భూమిని కాపాడాలి.
9. కనుక ఇశ్రాయేలు ప్రజల్లో ఒక వంశంనుండి మరో వంశానికి భూమి పోకూడదు. ఇశ్రాయేలీయులు ప్రతి ఒక్కరూ వారి పూర్వీకులకు చెందిన భూమిని కాపాడాలి.” PEPS
10. మోషేకు యెహోవా ఇచ్చిన ఆజ్ఞకు సెలోపెహదు కుమార్తెలు విధేయులయ్యారు.
11. అందుచేత సెలోపెహదు కుమార్తెలు మహలా, తిర్సా, హొగ్గా, మిల్కా, నోయా, వారి తండ్రి సోదరుని కుమారులను వివాహము చేసుకున్నారు.
12. వారి భర్తలు మనష్షే వంశం వారు గనుక వారు భూమి తమ తండ్రి కుటుంబం, వంశం వారికే చెందినది. PEPS
13. కనుక అర్బోతు మోయాబు ప్రాంతంలో, శ్రేష్ఠయోర్దాను నది ప్రక్కన, యెరికో దగ్గర మోషేకు యెహోవా ఇచ్చిన చట్టాలు, ఆజ్ఞలు అవి. చట్టములను, ఆజ్ఞలను మోషే ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. PE
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×