Bible Versions
Bible Books

Proverbs 22 (ERVTE) Easy to Read Version - Telugu

1 ఐశ్వర్యవంతునిగా ఉండుటకంటే గౌరవింపబడటం మేలు. బంగారం, వెండి కంటే మంచి పేరు ఎక్కువ ముఖ్యం.
2 ధనికులు, దరిద్రులు అంతా ఒక్కటే. వాళ్లందంనీ యెహోవాయే సృష్టించాడు.
3 జ్ఞానముగలవారు కష్టం రావటం చూచి దాని దారిలో నుండి తప్పుకొంటారు. కానీ తెలివి తక్కువ వాళ్లు తిన్నగా కష్టంలోనికి వెళ్లి, దాని మూలంగా శ్రమపడతారు.
4 యెహోవాను గౌరవించి దీనుడవుగా ఉండు. అప్పుడు నీకు ఐశ్వర్యం, ఘనత నిజజీవం ఉంటాయి.
5 దుర్మార్గులు అనేక కష్టాలవల్ల పట్టుబడతారు. అయితే తన ఆత్మ విషయం జాగ్రత్త గలవాడు కష్టాలకు దూరంగా ఉంటాడు.
6 ఒక బిడ్డ చిన్నగా ఉన్నప్పుడే, జీవిచుటకు సరైన మార్గం నేర్చించు. అప్పుడు బిడ్డ పెద్దవాడైనప్పుడు కూడ మార్గంలోనే జీవించటానికి కొనసాగిస్తాడు.
7 పేదవాళ్లు ధనికులకు సేవకులు. అప్పు పుచ్చు కొనేవాడు, అప్పు ఇచ్చేవానికి సేవకుడు.
8 కష్టాలను విస్తరించే మనిషి కష్టాల పంటనే కోస్తాడు. మనిషి ఇతరులకు కలిగించిన కష్టాల మూలంగా చివరికి అతడు నాశనం చేయబడతాడు.
9 ధారాళంగా ఇచ్చేవాడు ఆశీర్వదించబడతాడు. అతడు తన ఆహారం పేదవారితో పంచుకొంటాడు. గనుక ఆశీర్వదించబడుతాడు.
10 ఒక వ్యక్తి యితరులకంటె తానే మంచివాడిని అని తలిస్తే, వానిని బలవంతంగా వెళ్లగొట్టండి. అతడు వెళ్లి పోయినప్పుడు అతనితోబాటు కష్టం కూడా వెళ్లిపోతుంది. అంతటితో వివాదాలు అంతరిస్తాయి.
11 పవిత్ర హృదయం, దయగల మాటలను నీవు ప్రేమిస్తే రాజు నీ స్నేహితుడు అవుతాడు.
12 యెహోవాను ఎరిగిన మనుష్యులను ఆయన కాపాడుతూ, భద్రంగా ఉంచుతాడు. కానీ ఆయనకు విరోధంగా ఉండే వారిని ఆయన నాశనం చేస్తాడు.
13 “నేను ఇప్పుడు పనికి వెళ్లలేను. బయట సింహాం ఉంది. అది నన్ను చంపేస్తుందేమో” అంటాడు సోమరివాడు.
14 వ్యభిచార పాపం ఒక లోతైన గొయ్యలాంటిది. గొయ్యలో పడే మనిషి అంటే యెహోవాకు చాలా కోపం వస్తుంది.
15 పిల్లలు తెలివి తక్కువ పనులు చేస్తారు. కానీ నీవు వారిని శిక్షిస్తే, వారు అలాంటి పనులు చేయకుండా ఉండటం నేర్చుకొంటారు.
16 నిన్ను నీవే ధనికుణ్ణి చేసుకొనేందుకుగాను, పేదవాళ్లను బాధించటం, ధనికులకు కానుకలు ఇవ్వటం ఇవి రెండూ నిన్ను దరిద్రునిగా చేస్తాయి.
17 నేను చెప్పే మాటలు విను. జ్ఞానులు చెప్పిన మాటలు నేను నీకు నేర్పిస్తాను. ఉపదేశాల ద్వారా నేర్చుకో.
18 వీటిని నీవు జ్ఞాపకం ఉంచుకోవటం నీకు మంచిది. ఒకవేళ నీ పెదవులు ఒప్పుకొనేందుకు అలవాటు పడితే అది నీకు సహాయంగా ఉంటుంది.
19 విషయాలు ఇప్పుడు నీకు నేను నేర్పిస్తాను. నీవు యెహోవాను సమ్ముకోవాలని నేను కోరుతున్నాను.
20 నీ కోసం నేను ముప్పయి సూక్తులు వ్రాశాను. ఇవి సలహాలు, జ్ఞానముగల మాటలూను.
21 మాటలు సత్యమైన ముఖ్య విషయాలను నీకు నేర్పిస్తాయి. అప్పుడు నిన్ను పంపినవానికి నీవు మంచి జవాబులు ఇవ్వగలవు. 1 -
22 పేదవారివద్ద నుండి దొంగిలించటం సులభం. కానీ అలా చేయవద్దు. న్యాయస్థానంలో పేదవాణ్ణి అణగ తొక్కవద్దు.
23 యెహోవా వారి పక్షంగా ఉన్నాడు. ఆయన వారిని బలపరుస్తాడు, వారివద్ద నుండి తీసి కొన్నవి ఎవరినైనా సరే వారి వస్తువులను ఆయన తీసివేస్తాడు. 2 -
24 త్వరగా కోపపడే వానితో స్నేహంగా ఉండవద్దు. త్వరగా వెర్రి ఎక్కేవానికి దగ్గరగా పోవద్దు.
25 నీవు వెళ్తే, నీవు కూడ అతనిలా ఉండటం నేర్చుకొంటావేమో! అలా అయితే అతనికి ఉన్న చిక్కులే నీకూ ఉంటాయి. 3 -
26 మరో వ్యక్తి అప్పులకు నీదే బాధ్యత అని ప్రమాణం చేయవద్దు.
27 అతని అప్పు నీవు తీర్చలేక పోతే, అప్పుడు నీకు ఉన్నవన్నీ నీవు పోగొట్టుకొంటావు. నీవు పండుకొనే నీ పడకను నీవు ఎందుకు పోగొట్టుకోవాలి? 4 -
28 నీ పూర్వీకులు ఎప్పుడో గుర్తించిన ఆస్తి సరిహద్దు గీతను ఎప్పుడూ జరిపివేయవద్దు. 5 -
29 This verse may not be a part of this translation
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×