Bible Versions
Bible Books

Psalms 110 (ERVTE) Easy to Read Version - Telugu

1 “నీ శత్రువులను నీ పాదాల కింద పీఠంగా నేను ఉంచేవరకు ఇక్కడ నా కుడి పక్కన కూర్చో.” అని నా ప్రభువుతో యెహోవా చెప్పాడు.
2 నీ రాజ్యం విస్తరించేలా యెహోవా సహాయం చేస్తాడు. నీ రాజ్యం సీయోను వద్ద మొదలై నీవు నీ శత్రువులను వారి స్వంత దేశాలలో పాలించునంత వరకు అది విస్తరిస్తుంది.
3 నీవు రాజువైన రోజుననే నీ ప్రజలు నీతో కలుస్తారు. నీవు పుట్టినప్పటినుండి పవిత్రమైన అందం నీకు ఉంది. ఇప్పుడు నీ బాల్యం నుండి నీకు ఉన్న ఆశీర్వాదం రాజుగా నీ కొత్త జీవితంలోనికి వస్తుంది .
4 యెహోవా ఒక వాగ్దానం చేసాడు. యెహోవా తన మనస్సు మార్చుకోడు. “నీవు నిత్యము యాజకుడివే గాని అహరోను కుటుంబ వర్గం నుండి కాదు. నీది వేరైన యాజకత్వం. అది మెల్కీసెదెక్ వర్గానికి చెందిన యాజకునిలా వున్నట్లు ఉంది.”
5 నా ప్రభువు నీ కుడి పక్కన వున్నాడు. ఆయన కోపమముతో రాజులను చితకగొడతాడు.
6 దేవుడు రాజ్యాలకు తీర్పు తీర్చాడు. గొప్ప దేశంలో దేవుడు చచ్చిన వారి శవాలతో నేలనిండి పోయింది!
7 మార్గంలోని సెలయేటినుండి రాజు మంచినీరు తాగుతాడు. ఆయన నిజంగా తన తల ఎత్తుతాడు, చాలా శక్తివంతంగా ఉంటాడు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×