Bible Versions
Bible Books

Psalms 53 (ERVTE) Easy to Read Version - Telugu

1 తెలివి తక్కువ వాడు మాత్రమే దేవుడు లేడని తలుస్తాడు. అలాంటి మనుష్యులు చెడిపోయిన వారు, చెడు విషయాలను చేస్తారు. సరియైన దాన్ని చేసేవాడు ఒక్కడూ లేడు.
2 నిజంగా దేవుడు పరలోకంలో ఉండి మనల్ని చూస్తూ ఉన్నాడు. దేవునికొరకు చూసే జ్ఞానంగల వాళ్లు ఎవరైనా ఉన్నారేమో అని కనుగొనేందుకు దేవుడు చూస్తూ ఉన్నాడు.
3 కానీ ప్రతి మనిషీ దేవునికి వ్యతిరేకంగా తిరిగి పోయాడు. ప్రతి మనిషీ చెడ్డవాడే. మంచి చేసేవాడు లేడు. ఒక్కడూ లేడు.
4 దేవుడు చెబతున్నాడు, దుర్మార్గులకు సత్యం బాగా తెలుసు. కాని వారు నన్ను ప్రార్థించరు. దుర్మార్గులు వారి భోజనం తినటానికి ఎంత సిద్ధంగా ఉంటారో నా ప్రజలను నాశనం చేయటానికి కూడ అంత సిద్ధంగా ఉంటారు.”
5 కాని దుర్మార్గులు ఇంతకు ముందెన్నడూ భయ పడనంతగా భయపడిపోతారు. దుర్మార్గులు ఇశ్రాయేలీయులకు శత్రువులు. దేవుడు దుర్మార్గులను నిరాకరించాడు. కనుక మీరు వారిని ఓడిస్తారు. దేవుడు మీ శత్రువుల ఎముకలను చెదరగొట్టేస్తాడు.
6 ఇశ్రాయేలు ప్రజలారా, సీయోనుకు విజయాన్ని ఎవరిస్తారు? దేవుడు తన ప్రజలను తిరిగి వర్ధిల్లజేసేటప్పుడు యాకోబు సంతోషిస్తాడు. ఇశ్రాయేలు బహుగా ఆనందిస్తాడు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×