Bible Versions
Bible Books

2 Kings 25 (ERVTE) Easy to Read Version - Telugu

1 సిద్కియా తిరుగుబాటు చేసి బబులోను రాజుకు విధేయుడై వుండటానికి సమ్మతించలేదు. అందువల్ల, బబులోను రాజైన నెబుకద్నెజరు అతని మొత్తము సైన్యము యెరూషలేముకు ప్రతికూలముగా యుద్ధము చేయడానికి వచ్చింది. సిద్కియా రాజు యొక్క తొమ్మిదో సంవత్సరాన, 10వ నెలలో 10వ రోజున ఇది సంభవించింది. నెబుకద్నెజరు తన సైన్యాన్ని యెరూషలేము చుట్టు ఉంచి, ప్రజలను నగరం నుండి వెలుపలికిగాని లోపలికిగాని రానీయకుండ చేశాడు. తర్వాత నగరం చుట్టు అతను ఒక మురికి గోడ నిర్మించాడు.
2 నెబుకద్నెజరు సైన్యము సిద్కియా యూదా రాజుగా వున్న 11వ సంవత్సరము దాకా యెరూషలేము చుట్టూ ఉండెను.
3 నగరంలో కరువు ఘోరంగా తయారయింది. నాలుగవ నెలలో 9వ రోజున నగరంలోని సామాన్యులకు ఆహారము లేకపోయింది.
4 నెబుకద్నెజరు సైన్యము చివరికి నగర ప్రాకారమున బద్దలు చేసింది. రాత్రి సిద్కియా రాజు అతని సైనికులు పారిపోయారు. వారు రాజుగారి ఉద్యనవనము ద్వారా రహస్య ద్వారాన్ని ఉపయోగించి జంట గోడలద్వారా వెళ్లారు. విరోధి సైనికులు నగరం చుట్టూ వుండిరి. కాని సిద్కియా అతని మనుష్యులు మార్గము మీదికి తప్పించుకుని ఎడారికి పారపోయారు.
5 బబులోని సైన్యము సిద్కియా రాజుని వెన్నంటిపోయి అతనిని యెరికో అనే చోట పట్టుకున్నారు. సిద్కియా సైనికులందరు అతనిని విడిచిపెట్టి పారి పోయారు.
6 బబులోనువారు సిద్కియా రాజుని బబులోను రాజు వద్దకు రిబ్లా అనే చోటికి తీసుకు వెళ్లారు. బబులోనువారు సిద్కియాని శిక్షింప నిశ్చయించారు.
7 వారు సిద్కియా కుమారులను అతని ఎదుటనే చంపివేశారు. తర్వాత సిద్కియా యొక్క కండ్లు పెరికివేశారు. అతనికి గొలుసులు బిగించి అతనిని బబులోనుకు తీసుకువెళ్లారు.
8 నెబుకద్నెజరు బబులోను రాజుగా వున్న 19 సంవత్సరమున, నెబుకద్నెజరు 5 నెలలో 7వ తేదీని యెరూషలేముకు వచ్చాడు. నెబూజరదాను నెబుకద్నెజరు అత్యుత్తమ సైనికులకు అధిపతి
9 నెబూజరదాను యెహోవాయొక్క ఆలయమును దగ్ధం చేశాడు. రాజు భవనాన్ని, యెరూషలేములోని అన్ని ఇళ్లను కూడా దగ్ధం చేశాడు. అతను పెద్ద ఇళ్లను కూడా దగ్ధం చేశాడు.
10 అప్పుడు నెబూజరదానుతో పాటువున్న బబులోను సైన్యము యెరూషలేము పరిసరాలలోవున్న ప్రాకారములను కూలదోసింది.
11 నెబూజరదాను నగరంలో ఇంకా మిగిలివున్న ప్రజలను బంధించాడు. నెబూజరదానుకు లోబడిన వారిని సయితము బందీలుగా తీసుకువెళ్లాడు.
12 సామాన్యులలో అతి పేదవారిని మాత్రం నెబూజరదాను విడిచిపెట్టాడు. ద్రాక్షాలు ఇతర పంటలను చూసే నిమిత్తం వారిని అక్కడే నివసింప జేశాడు.
13 బబులోను సైనికులు యెహోవా యొక్క ఆలయములోని అన్ని ఇత్తడి వస్తువులను ముక్కలు చేశారు. వారు కంచు స్తంభాలను, కంచు మట్లను, పెద్ద ఇత్తడి చెరువుని ధ్వంసం చేశారు. తర్వాత కంచునంతా బబులోనుకు తీసుకువెళ్లాడు.
14 బబులోనువారు యెహోవా యొక్క ఆలయంలో ఉపయోగింపబడే కుండలు, నిప్పు తీసు గరిటలు, దీపాలు చక్కబరిచే ఉపకరణాలు, చెంచాలు, కంచు పాత్రలు మొదలైనవాటిని తీసుకువెళ్లారు.
15 నెబూజరదాను బానలు, పాత్రలు కూడా తీసుకు వెళ్లాడు. బంగారము కోసము బంగారముతో చేయబడిన వస్తువులను వెండి కోసము వెండితో చేయబడిన వస్తువులను కూడా తీసుకువెళ్లాడు.
16 This verse may not be a part of this translation
17 This verse may not be a part of this translation
18 ఆలయము నుండి నెబూజరదాను ప్రధాన యాజకుడైన శెరాయాను పట్టుకున్నాడు. జెఫన్యా అనే రెండవ యాజకుడు, పవేశమును కాచే ఆముగ్గురు మనుష్యులను తీసుకున్నాడు.
19 నగరంనుండి నెబూజరదాను సైన్యానికి అధికారిగా ఉన్న ఉద్యోగిని నగరంలో మిగిలివున్న ఐదుగురు రాజుగారి సహాదారులను తీసుకున్నాడు. సైన్యాధిపతి యొక్క ఒక కార్యదర్శి. అతను సామాన్య ప్రజలను లెక్కించేవాడు. మరియు అతను వారిలోనుండి కొందరు సైనికులను ఎంచుకునేవాడు. నగరంలో అప్పుడున్న 60 మంది ప్రజలను నెబుకద్నెజరు తీసుకున్నాడు.
20 This verse may not be a part of this translation
21 This verse may not be a part of this translation
22 బబులోను రాజైన నెబుద్నెజరు యూదా దేశంలో కొందరు ప్రజలను విడచి పెట్టాడు. షాఫాను కుమారుడైన అహీకాం, అతని కుమారుడైన గెదల్యా అనే అతడు ఒకడుండెను. నెబుద్నెజరు యూదా ప్రజల మీద గెదల్యాను అధిపతిగా నియమించాడు.
23 నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు కారేహకు కుమారుడైన నెటోఫాతుకు చెందిన తన్హుమెతు కుమారుడైన శెరాయా, మాయాకాతు కుమారుడైన యజన్నా మొదలయిన వారు సైన్యాధిపతులు. సైన్యాధితులు, వారి మనుష్యులు, బబులోను రాజు గెదల్యాను అధిపతిగా చేసినట్లు విన్నారు. అందువల్ల గెదల్యాను కలుసుకోవడానికి వారు మిస్సాకి వెళ్లారు.
24 అధికారులకు, వారి మనుష్యులకు గెదల్యా వాగ్దానాలు చేశాడు. గెదల్యా వారితో ఇట్లన్నాడు: “బబులోను అధికారులను చూసి మీరు భయపడకండి. ఇక్కడే ఉండి బబులోను రాజుని కొలవండి. తరువాత, అంతయు మీకు సక్రమముగా ఉంటుంది.”
25 ఎలీషా కుమారుడైన నెతన్యా కుమారుడు ఇష్మాయేలు రాజు కుటుంబము నుండి వచ్చినవాడు. ఏడవ నెలలో ఇష్మాయేలు మరియు పదిమంది అతని మనుష్యులు గెదల్యా మీద దాడిచేసి మిస్పా వద్ద గెదల్యాతో పాటు ఉన్న కల్దీయులను యూదాలను చంపివేశాడు.
26 అప్పుడు సైన్యాధికారులు అందురు మనుష్యులు ఈజిప్టుకు పారిపోయారు. అతి సామాన్యుడు మొదలుకొని అతి ప్రాముఖ్యము కలవాడి వరకు అందరూ పారి పోయ్యారు. ఎందుకనగా, కల్దీయులనగా వారు భయపడ్డారు.
27 తర్వాత ఎవీల్మెరోదకు బబలోనుకు రాజయ్యాడు. అతను యూదా రాజైన యెహోయాకీనును చెరసాలనుండి విముక్తి చేసెను. ఇది యెహోయాకీను బంధింపబడిన 37వ సంవత్సరమున సంభవించింది. ఇది ఎవీల్మెరోదకు పరిపాలన ప్రారంభం చేసిన 12వ నెలనుండి 27వ తేదీ వరకు జరిగింది.
28 ఎవీల్మెరోదకు యెహోయాకీను పట్ల దయకలిగి ఉండెను. అతను యెహోయాకీనుకి బబులోనులో తనతో బాటు ఆసీనులయ్యే ఇతర రాజుల కంటె ఎక్కువ ప్రాముఖ్యముగల చోట ఇచ్చాడు.
29 ఎవీల్మెరోదకు యెహోయాకీను చెరసాల దుస్తులు ధరించడం ఆపివేశాడు. మరియు యెహోయాకీను ఒకే మేజాబల్ల మీద కూర్చుని ఎవీల్మెరోదకుతో కలిసి భుజించాడు. ఇట్లు అతని శేష జీవితము వరకు జరిగింది. 30అందువల్ల ఎవీల్మెరోదకు రాజు యెహోయాకీనుకు అతని శేష జీవితము వరకూ ప్రతిరోజూ భోజనము పెట్టాడు.
30 This verse may not be a part of this translation
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×