Bible Versions
Bible Books

Amos 2 (ERVTE) Easy to Read Version - Telugu

1 యెహోవా విషయాలు చెపుతున్నాడు: “మోయాబు ప్రజలు చేసిన అనేక నేరాలకు నేను వారిని నిశ్చయంగా శిక్షిస్తాను. ఎందుకంటే, ఎదోము రాజు యొక్క ఎముకలు సున్నమయ్యేలా మోయాబు వారు కాల్చివేశారు.
2 కావున మోయాబులో నేను అగ్నిని రగుల్చుతాను. అగ్ని కెరీయోతు ఉన్నత బురుజులను నాశనం చేస్తుంది. భయంకరమైన అరుపులు, బూర నాదాలు వవినబడతాయి. మోయాబు చనిపోతాడు.
3 అలా నేను మోయాబు రాజులను నిర్మూలిస్తాను. మరియు మోయాబు నాయకులందరినీ నేను చంపివేస్తాను.” యెహోవా విషయాలు చెప్పాడు.
4 యెహోవా ఇలా చెపుతున్నాడు: “యూదా వారుచేసిన అనేక నేరాలకు నేను వారిని నిశ్చయంగా శిక్షిస్తాను. ఎందుకంటే, వారు యెహోవా ఆజ్ఞలను పాటించ నిరాకరించారు. వారాయన ఆజ్ఞలను స్వీకరించలేదు. వారి పూర్వీకులు అబద్ధాలను నమ్మారు. అబద్ధాలే యూదా ప్రజలను దేవుని అనుసరించకండా చేశాయి.
5 కావున యూదాలో అగ్నిని పుట్టిస్తాను. అగ్ని యెరూషలేములోగల ఉన్నత బురుజులను నాశనం చేస్తుంది.”
6 యెహోవా ఇది చెపుతున్నాడు: “ఇశ్రాయేలువారు చేసిన అనేక నేరాలకు నేను వారిని నిశ్చయంగా శిక్షిస్తాను. ఎందుకంటే స్వల్పమైన వెండికొరకు వారు మంచివారిని, అమాయకులైన ప్రజలను అమ్మివేశారు. వారు ఒక జత చెప్పుల విలువకు పేదవారిని అమ్మివేశారు.
7 పేద ప్రజలను మట్టికరిచేలా కిందికి తోసి, వారిపై తాము నడిచారు. బాధపడేవారి గోడును వారు ఆలకించరు. తండ్రులు, కొడుకులు ఒకే స్త్రీతో సంభోగిస్తారు. వారు నా పవిత్ర నామాన్ని పాడుచేసారు.
8 పేద ప్రజలవద్ద వారు బట్టలు తీసుకొని, బలిపీఠాల ముందు ఆరాధన జరిపేటప్పుడు వాటిమీద కూర్చుంటారు. వారు పేదవారికి డబ్బు అప్పుగా ఇచ్చి, వారి దుస్తులను తాకట్టు పెట్టుకున్నారు. ప్రజలు అపరాధ రుసుము చెల్లించేలా వారు చేస్తారు. డబ్బును వారు తమ దేవుని అలయంలో తాగటానికి ద్రాక్షా మద్యం కొనడానికి వినియోగిస్తారు.
9 “కాని అమోరీయులను వారి ముందర నాశనం చేసింది నేనే. అమోరీయులు దేవదారు వృక్షమంత ఎత్తయిన వారు. వారు సింధూర వృక్షమంత బలంగల వారు. కాని, పైన వాటి పండ్లును, కింద వాటి వేళ్లను నేను నాశనం చేశాను.
10 ఈజిప్టు దేశం నుండి మిమ్మల్ని తీసుకొని వచ్చినది నేనే. అమోరీయుల దేశాన్ని మీరు ఆక్రమించటంలో నేను మీకు సహాయం చేశాను. దీనికై నలబె సంవత్సరాలు మిమ్మల్ని ఎడారిలో నడిపించాను.
11 మీ కుమారులలో కొంత మందిని నేను ప్రవక్తలుగా చేశాను. యువకులలో కొంత మందిని నాజీరులుగా నియమించాను. ఇశ్రాయేలు ప్రజలారా ఇది నిజం.” యెహోవా విషయాలు చెప్పాడు.
12 “కాని నాజీరులు ద్రాక్షామద్యం తాగేలా మీరు చేశారు. దేవుని మాటలు ప్రకటించవద్దని మీరు ప్రవక్తలకు చెప్పారు.
13 మీరు నాకు పెద్ద భారమైనారు. అధికమైన గడ్డివేసిన బండిలా నేను చాలా కిందికి వంగిపోయాను.
14 ఎవ్వరూ తప్పించుకోలేరు. ఎంత వేగంగా పరుగెత్తగలవాడైనా తప్పించుకోలేడు. బలవంతులు బలంగా లేరు. సైనికులు తమను తాము రక్షించుకోలేరు.
15 విలంబులు, బాణాలు చేతబట్టిన వారు బ్రతకురు. వేగంగా పరుగిడ గలవారు తప్పించుకోలేరు. గుర్రాలు ఎక్కినవారు ప్రాణలతో తప్పించుకోలేరు.
16 సమయంలో మిక్కిలి బలవంతులైన సైనికులు సహితం పారిపోతారు. వారు బట్టలు వేసుకొనటానికి కూడా సమయం తీసుకోరు.” యెహోవా విషయాలు చెప్పాడు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×