Bible Versions
Bible Books

Haggai 2 (ERVTE) Easy to Read Version - Telugu

1 దేవుడైన యెహోవా వాక్కు ఏడవనెల ఇరవై ఒకటో రోజున హగ్గయికి వినవచ్చింది. వాక్కు ఇలా చెప్పింది:
2 ఇప్పుడు షయల్తీయేలు కుమారుడు, యూదారాజ్య పాలనాధికారి అయిన జెరుబ్బాబెలుతోను, యెహోజాదాకు కుమారుడు, ప్రధాన యాజకుడు అయిన యెహోషవాతోను, మరియు జనులం దరితోను మాట్లాడి ఇలా చెప్పు:
3 “ఈ ఆలయం యొక్క గత వైభవాన్ని చూసినవారు మీలో ఎవ్వరు మిగిలారు? ఇప్పుడు మీరు దీనిని ఎలా చూస్తున్నారు? చాలా సంవత్సరాలక్రితం ఉన్న ఆలయంతో పోల్చిచూస్తే, మీ కండ్లకు ఇప్పటిది ఎందుకూ పనికిరానిదిగా ఉన్నట్లు అనిపిస్తూవుందా?
4 కాని ఇవ్పుడు యెహోవా చెపుతున్నాడు, ‘జెరుబ్బాబెలూ! అధైర్యపడవద్దు. ‘యెహోజాదాకు కుమారుడు, ప్రధాన యాజకడునైన యెహోషవా! ‘అధైర్యపడవద్దు. దేశనివాసులైన మీరందరు అధైర్యపడవద్దు’ అని యెహోవా చెపుతున్నాడు. ‘ఈ పనిని కొనసాగించండి,ఎందు కంటే, నేను మీతో ఉన్నాను.’ సర్వశక్తిమంతుడైన ప్రభువు విషయాలు చెప్పాడు!”
5 “మీరు ఈజిప్టు నుండి బయటికి వచ్చినప్పుడు నేను మీతో చేసిన ఒడంబడిక ప్రకారం, నా ఆత్మ మీ మధ్య ఉంది. భయపడవద్దు!
6 ఎందువల్లనంటే సర్యశక్తి మంతుడైన యెహోవా ఇది చెవుతున్నాడు! కొద్ది వ్యవధిలో మరొక్కసారి పరలోకాలను, భూమిని, సముద్రాన్ని, ఎండిన నేలను కంపించేలా చేస్తాను.
7 దేశాలన్నింటినీ కుదిపివేస్తాను. వారంతా, వివిధ దేశాలలోవున్న ధనసంపదతో వస్తారు. అప్పుడు ఆలయాన్ని మహిమతో నింపుతాను. సర్వశక్తిమంతుడైన యెహోవా ఇది చెపుతున్నాడు.
8 This verse may not be a part of this translation
9 This verse may not be a part of this translation
10 దర్యావేషు కాలంలో రెండవ సంవత్సరం తొమ్మిదవ నెల ఇరవై నాలుగవ రోజున దేవుడైన యెహోవా వాక్కు ప్రవక్త హగ్గయికి ఇలా వినవచ్చింది:
11 సర్వశక్తి మంతుడైన యెహోవా ఇది చెపుతున్నాడు: ధర్మ శాస్త్రం వీటిని గురించి ఏమి చెవుతున్నదో ఇప్పుడు యాజకులను అడుగు.
12 “ఒకడు తన వస్త్రముల మడతలో పవిత్ర బలి మాంసాన్ని పెట్టుకుని వెళ్లినాడనుకో. పవిత్ర మాంసాన్ని ఉంచిన తన వస్త్రం రొట్టెనుగాని, వండిన ఆహారాన్నిగాని, ద్రాక్షారసం, నూనె లేక ఇతర తినుబండారాలను తాకినదనుకో. అలా ముట్టబడిన పదార్థం పవిత్రమౌతుందా?” యాజకులు “కాదు” అని సమాధానమిచ్చారు.
13 పిమ్మట హగ్గయి అన్నాడు: ఒకడు శవాన్ని ముట్టినాడనుకో. అతడు అపవిత్రుడవుతాడు. అతడు గనుక దేన్నయినా ముట్టుకుంటే వస్తువు అపవిత్ర మౌతుందా?” అది అపవిత్రమౌతుంది” అని యాజకులు సమాధానమిచ్చారు.
14 పిమ్మట హగ్గయి చెప్పాడు: దేవుడైన యెహోవా ఇలా చెవుతున్నాడు: జనులకు సంబంధించినంత వరకూ విషయం కూడా నిజమే. వాళ్లు నా ముందు అపరిశుద్ధులు, అపవిత్రులు. వాళ్ల చేతులతో తాకినవన్నీ అపరి శుద్ధమైనవి.
15 యెహోవా ఆలయవు పని ప్రారంభించేందుకు ముందు జరిగిన సంగతుల విషయమై ఆలోచించు.
16 ప్రజలు ఇరవై బస్తాల ధాన్యం అవుతుందను కొన్నారు. కాని పది బస్తాల ధాన్యం అవుతుందను కొన్నారు. కాని పది బస్తాల ధాన్యం మాత్రమే కుప్పలో ఉంది. ద్రాక్షారసం ఏభై కొలలు తీసికోటానికి ఒక తొట్టివద్దకు రాగా, వారికి ఇరవై కొలలు మాత్రమే దొరికేవి.
17 ఎందుకంటే నేను మిమ్మల్ని, మీ చేతులు చేసిన వస్తువులను శిక్షించాను. మొక్కలను చీడలతోను, బూజుతోనూ, మిమ్మల్ని వడగండ్లతోను శిక్షించాను. కాని మీరింకా నా వద్దకు రారు. దేవుడైన యెహోవా ఇలా చెపుతున్నాడు.
18 “ఈ రోజు తొమ్మిదవ నెలలో ఇరవైనాల్గవ దినం. మీరు యెహోవీ ఆలయానికి పునాది వేయటం ముగించారు. కావున రోజునుండి ఏమి జరుగుతుందో చూడండి.
19 గోదాముల్లో ధాన్యం నిలవవుందా? ద్రాక్షాలతలు, అంజూరపుచెట్టు, దానిమ్మ చెట్టు ఇంకను పండ్లనీయటం లేదా? (లేదు).అయితే మిమ్మల్ని రోజునుండి ఆశీర్వదిస్తాను!”
20 మళ్లీ తొమ్మిదవనెల, ఇరవై నాలుగవరోజు రెండవ సారి దేవుడైన యెహోవా వాక్కు హగ్గయికి వినవచ్చింది. వాక్కు ఇలా చెప్పింది:
21 జెరుబ్బాబెలుకు చెప్పు: పరలోకాన్ని, భూమిని కదుపుతాను.
22 రాజ్యాల సింహాసనాలను తల్లక్రిందులు చేస్తాను. ఇతర రాజ్యాలవారిని నాశనం చేస్తాను. రథాలను వాటిమీద ఉన్నవారిని పడదోస్తాను. గుర్రాలు, రౌతులు కూలిపోతారు. సైన్యాలు ప్రస్తుతం మిత్రులు. కానివాళ్లు ఒకరినొకరు ప్రతికూలులై, కత్తులతో ఒకరినొకరు పొడుచుకొని చంవుకొంటారు.
23 సర్వశక్తి మంతుడైన యెహోవా ఇది చెవుతున్నాడు: ‘షయల్తీయేలు కుమారుడవు, నా సేవకుడైన జెరుబ్బాబెలూ, నిన్ను నేను ఎన్నుకొన్నాను. దేవుడైన యెహోవా ఇలా చెపుతున్నాడు. సమయాన నేను నిన్నొక ముద్ర వేసే ఉంగరంగా చేస్తాను. (ఈ పనులు నేను చేశానని మీరే ఋజువు.)” సర్వశక్తిమంతుడైన యెహోవా ఇది చెవుతున్నాడు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×