Bible Versions
Bible Books

Zechariah 5 (ERVTE) Easy to Read Version - Telugu

1 నేను మళ్లీ పైకి చూడగా, చుట్టబడిన ఒక ఎగిరే పత్రాన్ని చూశాను.
2 నీవు ఏమి చూస్తున్నావు?” అని దేవదూత నన్ను అడిగినాడు. “నేనొక చుట్టగా వున్న ఎగిరే పత్రాన్ని చూస్తున్నాను. చుట్ట ముప్పై అడుగుల పొడవు, పదిహేను అడుగుల వెడల్పు ఉంది” అని నేను చెప్పాను.
3 అప్పుడు దేవదూత నాతో చప్పాడు, “ఆ చుట్ట బడిన పత్రంమీద ఒక శాపం వ్రాయబడి ఉంది. పత్రంలో ఒక ప్రక్కన దొంగలకు ఒక శాపం ఉంది. పత్రానికి మరొక పక్కన అబద్ధపు వాగ్దానాలు చేసే వారికి ఒక శాపం ఉంది.
4 సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు: దొంగల ఇండ్లకు, నా పేరు మీద దొంగ వాగ్దానాలు చేసేవారి ఇండ్లకు చుట్టబడిన పత్రాన్ని నేను పంపిస్తాను. పత్రం అక్కడ వుండి, ఇండ్లను నాశనం చేస్తుంది. రాళ్లు, కొయ్యస్తంభాలు సహితం నాశనం చేయబడతాయి.
5 తరువాత నాతో మాట్లాడుతూవున్న దేవదూత బయటికి వెళ్లాడు. అతడు నాతో, “చూడు!నీవు ఏమి జరుగుతున్నట్లు చూస్తున్నావు?” అని అన్నాడు.
6 “అదేమిటో నాకు తెలియదు” అని నేను అన్నాను. అతడు ఇలా చెప్పాడు: “అది ఒక కొలతొట్టె. దేశంలో ప్రజలు చేసే పాపాలను కొలవటానికి బుట్ట ఉద్దేశించబడింది.”
7 తొట్టె మీదనుంచి సీసపు మూత తొలగించ బడింది. బుట్టలో ఒక స్త్రీ కూర్చుని ఉంది. దానితో బరువైన (డెబ్బై ఐదు పౌనులు) సీసపు తూనికరాయి ఉంది.
8 “ఈ స్త్రీ చెడును ెతెలియజేస్తుంది” అని దేవ దూత చెప్పాడు. పిమ్మట దేవదూత స్త్రీని తొట్టెలో పడదోసి, దానిమీద సీసపు మూతను పెట్టాడు. పాపాలు ఘోరమైనవని (బరువై నవని) ఇది తెలుపుతుంది.
9 తరువాత నేను పైకి చూశాను. అక్కడ సంకుబుడ్డ కొంగవలె రెక్కలు గల ఇద్దరు స్త్రీలను చూశాను. వారు ఎగిరి వచ్చారు. వారి రెక్కల్లో గాలి ఉంది. వారు బుట్టను పట్టి లేవనెత్తాకు. బుట్టను పట్టుకొని వారు గాలిలోకి పోయారు.
10 “వారు బుట్టను ఎక్కడికి మోసుకు పోతున్నారు?” అని నాతో మాట్లాడుతూ వున్న దేవ దూతను నేనడిగాను.
11 దేవదూత నాతో ఇలా చెప్పాడు: “షీనారులో దానికొక ఆలయం నిర్మించటానికి వారు వెళ్తున్నారు. వారా ఆలయాన్ని నిర్మించాక బుట్టను అక్కడ ఉంచుతారు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×