Bible Versions
Bible Books

Isaiah 15 (IRVTE) Indian Revised Version - Telugu

1 {మోయాబు గురించి ప్రకటన} (16:6-12; యిర్మీ 48:29-36) PS మోయాబు గురించి ప్రకటన.
ఒకే రాత్రిలో ఆర్ మోయాబు పాడై నాశనమౌతుంది.
ఒక్క రాత్రిలో కీర్ మోయాబు పాడై నాశనమౌతుంది.
2 ఏడవడానికి మోయాబీయులు గుడికీ,
మెట్ట మీద ఉన్న దీబోనుకూ వెళ్తున్నారు.
నెబో మీద, మేదెబా మీద మోయాబీయులు ప్రలాపిస్తున్నారు.
వాళ్ళందరూ తమ తలలు గొరిగించుకున్నారు,
గడ్డాలు క్షవరం చేయించుకున్నారు.
3 తమ సంత వీధుల్లో గోనెపట్ట కట్టుకున్నారు.
వాళ్ళ మేడల మీద, వాళ్ళ బహిరంగ ప్రాంగణాల్లో వాళ్ళందరూ ప్రలాపిస్తూ కన్నీళ్లు కారుస్తున్నారు.
4 హెష్బోను, ఏలాలే మొర్ర పెడుతున్నాయి.
యాహసు వరకూ వాళ్ళ స్వరం వినిపిస్తూ ఉంది.
మోయాబీయుల యోధులు బిగ్గరగా ఏడుస్తున్నారు.
వాళ్ళ ప్రాణాలు వాళ్ళల్లో వణుకుతున్నాయి.
5 మోయాబు కోసం నా హృదయం అరుస్తూ ఉంది.
దాని ప్రధానులు సోయరు వరకూ పారిపోతారు.
లూహీతు ఎక్కుడు మార్గంలో ఏడుస్తూ ఎక్కుతారు.
నాశనమై పోయామే అని పెద్దగా కేకలు వేస్తూ హొరొనయీము మార్గంలో వెళ్తారు.
6 ఎందుకంటే నిమ్రీములో ఉన్న నీళ్ళు ఎండిపోయాయి.
గడ్డి ఎండిపోయింది. కొత్తగా పుట్టిన గడ్డి కూడా ఎండిపోతుంది. పచ్చదనం ఎక్కడా కనిపించదు.
7 వాళ్ళు సంపాదించిన ఆస్తినీ, వాళ్ళు కూర్చుకున్న పంటనూ నిరవంజి చెట్లున్న నది అవతలకు వాళ్ళు మోసుకు పోతారు.
8 రోదన మోయాబు సరిహద్దుల్లో వినిపించింది.
అంగలార్పు ఎగ్లయీము వరకూ, బెయేరేలీము వరకూ వినిపించింది.
9 ఎందుకంటే దీమోను నీళ్ళు రక్తంతో నిండి ఉన్నాయి.
కాని నేను దీమోను మీదకి మరింత బాధ రప్పిస్తాను.
మోయాబులోనుంచి తప్పించుకున్న వాళ్ళ మీద, దేశంలో మిగిలిన వాళ్ళ మీద ఒక సింహం దాడి చేస్తుంది. PE
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×