Bible Books

:
-

1. {మొక్కుబడి} PS మోషే ఇశ్రాయేలు గోత్రాల నాయకులతో ఇలా అన్నాడు,
2. “ఇది యెహోవా ఆజ్ఞ. ఒకడు యెహోవాకు మొక్కుకుంటే లేక ప్రమాణం చేసి ఉంటే, అతడు మాట తప్పకూడదు. తన నోటినుండి వచ్చిన దానంతటినీ అతడు నెరవేర్చాలి.
3. తన తండ్రి ఇంట్లో ఉన్న ఒక స్త్రీ యెహోవాకు చేసిన మొక్కుబడి గురించి ఆమె తండ్రి ఎరిగి, ఏమీ మాట్లాడకపోతే ఆమె మొక్కుబడి నిలిచి ఉంటుంది.
4. ఆమె ప్రమాణాలు అన్నీ నిలిచి ఉంటాయి.
5. అయితే ఆమె చేసిన ప్రమాణాలను ఆమె తండ్రి విని వాటి విషయంలో ఆక్షేపణ తెలిపి ఉంటే, ఆమె మొక్కుబడులు, ప్రమాణాలు, ఏవీ నిలబడవు.
6. ఆమె తండ్రి దానికి ఆక్షేపణ తెలిపాడు కాబట్టి యెహోవా ఆమెను క్షమిస్తాడు. PEPS
7. ఆమె వివాహిత అయితే, ఆమె మొక్కుబడులు, తొందరపాటులో చేసిన ప్రమాణాలు ఆమె భర్త ఎరిగి ఏమీ మాట్లాడకపోతే, ఆమె మొక్కుబడులు, ప్రమాణాలు ఆమెపై నిలిచి ఉంటాయి.
8. అయితే ఆమె మొక్కుబడులు, తొందరపాటులో చేసిన ప్రమాణాలు ఆమె భర్త విని వాటి విషయంలో ఆక్షేపణ తెలిపి ఉంటే, అతడు ఆమె మొక్కుబడులను, తొందరపాటుగా చేసిన ప్రమాణాలను రద్దు చేసిన వాడవుతాడు. యెహోవా ఆమెను క్షమిస్తాడు. PEPS
9. వితంతువు గాని విడాకులు ఇచ్చిన స్త్రీ గాని చేసిన మొక్కుబడులు అన్నీ ఆమె మీద నిలిచి ఉంటాయి.
10. ఆమె తన భర్త ఇంట్లో ఉన్నప్పుడు మొక్కుబడులు, ప్రమాణాలు చేసి ఉంటే,
11. వాటిని గురించి ఆమె భర్త విని ఆక్షేపణా చేయకుండా ఉంటే, ఆమె మొక్కుబడులు, ప్రమాణాలు, అన్నీ నిలిచి ఉంటాయి.
12. ఆమె భర్త వాటి గురించి విన్న రోజునే వాటిని పూర్తిగా రద్దు చేసి ఉంటే, ఆమె మొక్కుబడులు, ప్రమాణాలు గురించిన ఆమె మాటలు ఏవీ నిలబడవు. ఆమె భర్త వాటిని రద్దుచేశాడు కాబట్టి యెహోవా ఆమెను క్షమిస్తాడు.
13. ఒక స్త్రీ చేసిన ప్రతి మొక్కుబడిని, ప్రమాణపూర్వకంగా తన మీద మోపుకొన్న ప్రతి బాధ్యతను ఆమె భర్త స్థిరపరచవచ్చు, రద్దు చేయవచ్చు.
14. అలా కాక ఆమె భర్త ఎప్పటికప్పుడు దాని విషయం మౌనంగా ఉంటూ వస్తే, అతడు ఆమె చేసిన మొక్కుబడులనూ ప్రమాణాలనూ స్థిరపరచిన వాడవుతాడు. అతడు వాటిని విన్న రోజు మౌనంగా ఉండడం ద్వారా వాటిని స్థిరపరిచాడు.
15. అతడు వాటిని గురించి విన్న చాలా కాలం తరువాత వాటిని రద్దుచేస్తే, అతడు ఆమె దోషశిక్షను తానే భరిస్తాడు.”
16. ఇవి భర్తను గూర్చీ భార్యను గూర్చీ, తండ్రిని గూర్చీ బాల్యంలో తన తండ్రి ఇంట్లో ఉన్న కుమార్తెను గూర్చీ యెహోవా మోషేకిచ్చిన ఆజ్ఞలు. PE
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×