Bible Books

:
-

1. ఎఫ్రాయిము కొండ ప్రాంతంలో మీకా అనే ఒక వ్యక్తి నివసించేవాడు.
2. అతడు తన తల్లితో “నీ దగ్గర నుండి నేను తీసుకున్న పదకొండు వందల వెండి * పదకొండు వందల వెండి 13 కిలోగ్రాములు ఇదిగో. వాటిని తీసుకున్న వాణ్ణి నువ్వు శపించడం నేను విన్నాను. చూడు, అవి నా దగ్గరే ఉన్నాయి. నేనే వాటిని దొంగిలించాను” అన్నాడు. అతని తల్లి అతణ్ణి చూసి “కొడుకా, యెహోవా నిన్ను ఆశీర్వదించు గాక!” అంది. PEPS
3. అతడు పదకొండు వందల వెండిని తిరిగి తన తల్లికి ఇచ్చేశాడు. ఆమె “ఈ సొమ్మును నేను యెహోవాకు ఇచ్చేస్తున్నాను. దీనితో నా కొడుకు కోసం ఒక చెక్క విగ్రహమూ, మరొక పోత విగ్రహమూ తయారు చేయిస్తాను. అందుకని ఇవి నీకే తిరిగి ఇచ్చేస్తాను” అంది.
4. అతడు నాణేలను తన తల్లికి ఇచ్చాడు. ఆమె వాటిలో రెండు వందలు తీసి ఒక కంసాలికి ఇచ్చింది. వాడు వాటితో ఒక విగ్రహాన్ని చెక్కాడు. లోహంతో మరో విగ్రహాన్ని పోత పోశాడు. విగ్రహాన్ని మీకా ఇంట్లోనే ఉంచారు. PEPS
5. మీకా ఇంట్లో విగ్రహాలున్న పూజ గది ఒకటుంది. అతడు ఒక ఎఫోదునూ కొన్ని విగ్రహాలనూ చేయించి అందులో ఉంచాడు. తన కొడుకుల్లో ఒకణ్ణి పూజారిగా ప్రతిష్టించాడు. అతని కొడుకే అతనికి యాజకుడు అయ్యాడు.
6. రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలకు రాజు లేడు. ప్రతి ఒక్కరూ తమ తమ ఇష్టానుసారం జీవిస్తున్నారు. PEPS
7. అక్కడ యూదా గోత్రంలో చేరిన ఒక లేవీ యువకుడు ఉండేవాడు. ఇతడు యూదా ప్రాంతానికి చెందిన బేత్లెహేము నుండి వచ్చాడు.
8. వ్యక్తి తనకో నివాస స్థలం కోసం యూదా బేత్లెహేము నుండి బయలుదేరి ప్రయాణం చేస్తూ ఎఫ్రాయిము కొండ ప్రాంతంలో ఉన్న మీకా యింటికి వచ్చాడు.
9. అతణ్ణి మీకా “నీవు ఎక్కడ నుంచి వచ్చావు?” అని అడిగాడు. దానికతడు “నేను యూదా బేత్లెహేమునుంచి వచ్చిన లేవీయుణ్ణి. నాకో నివాస స్థలం కోసం వెదుకుతున్నాను.” అన్నాడు.
10. అప్పుడు మీకా “నువ్వు నా దగ్గరే ఉండు. నాకు తండ్రిగా, యాజకుడుగా ఉండు. నీకు సంవత్సరానికి పది వెండి నాణేలూ, బట్టలూ, ఆహారమూ ఇస్తాను.” అన్నాడు. దానికి లేవీయుడు అంగీకరించాడు.
11. వ్యక్తి దగ్గర ఉండిపోడానికి ఒప్పుకున్నాడు. యువకుడు అతని కొడుకుల్లో ఒకడిగా ఉన్నాడు.
12. మీకా లేవీయుణ్ణి ప్రతిష్టించాడు. అతడు మీకాకు యాజకుడుగా ఉన్నాడు.
13. అప్పుడు మీకా “ఈ లేవీయుడు నాకు యాజకుడుగా ఉన్నాడు కాబట్టి యెహోవా నాకు తప్పక మేలు చేస్తాడని నాకు తెలుసు” అన్నాడు. PE
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×