Bible Books

3
:

1. {హబక్కూకు ప్రార్థన} PS ప్రవక్త అయిన హబక్కూకు చేసిన ప్రార్థన (వాద్యాలతో పాడదగినది). PEPS
2. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుతున్నాను. PEPS యెహోవా, సంవత్సరాల్లో నీ కార్యం నూతన పరచు. PEPS రోజుల్లో నీ పనులు తెలియచెయ్యి. PEPS కోపంలో కనికరం మరచిపోవద్దు. PEPS
3. దేవుడు తేమాను * తేమాను యూదాకు దక్షిణగా ఉన్న ఎదోం దేశంలో ఉన్న ప్రాంతం లో నుండి వచ్చాడు. PEPS పరిశుద్ధ దేవుడు పారాను పారాను సీనాయికి దక్షిణ సరిహద్దులో ఉన్న బీడు భూమి లో నుండి వేంచేస్తున్నాడు (సెలా). PEPS ఆయన మహిమ ఆకాశమండలమంతటా కనబడుతున్నది. PEPS భూమి ఆయన స్తుతితో నిండి ఉంది. PEPS
4. ఆయన హస్తాలనుండి కిరణాలు వెలువడుతున్నాయి. PEPS అక్కడ ఆయన తన బలం దాచి ఉంచాడు. PEPS
5. ఆయనకు ముందుగా తెగుళ్లు నడుస్తున్నాయి. PEPS ఆయన అడుగుజాడల్లో అరిష్టాలు వెళ్తున్నాయి. PEPS
6. ఆయన నిలబడి భూమిని కొలిచాడు. రాజ్యాలను కంపింప జేశాడు. PEPS నిత్య పర్వతాలు బద్దలైపోయాయి. PEPS పురాతన గిరులు అణిగి పోయాయి. ఆయన మార్గాలు శాశ్వత మార్గాలు. PEPS
7. కూషీయుల డేరాల్లో ఉపద్రవం కలగడం నేను చూశాను. PEPS మిద్యాను దేశస్థుల గుడారాల తెరలు గజగజ వణికాయి. PEPS
8. యెహోవా, నదుల మీద నీకు కోపం కలిగిందా? PEPS నదుల మీద నీకు ఉగ్రత కలిగిందా? PEPS సముద్రం మీద నీకు ఆగ్రహం కలిగిందా? నువ్వు నీ గుర్రాల మీద స్వారీ చేస్తూ నీ రక్షణ రథం ఎక్కి రావడం అందుకేనా? PEPS
9. విల్లు వరలోనుండి తీశావు. బాణాలు ఎక్కుపెట్టావు. PEPS భూమిని బద్దలు చేసి నదులు ప్రవహింపజేశావు. PEPS
10. పర్వతాలు నిన్ను చూసి మెలికలు తిరిగాయి. PEPS జలాలు వాటిపై ప్రవాహాలుగా పారుతాయి. PEPS సముద్రాగాధం ఘోషిస్తూ తన కెరటాలు పైకెత్తుతుంది. PEPS
11. నీ ఈటెలు తళతళలాడగా ఎగిరే నీ బాణాల కాంతికి భయపడి సూర్యచంద్రులు తమ ఉన్నత నివాసాల్లో ఆగిపోతారు. PEPS
12. బహు రౌద్రంతో నీవు భూమి మీద సంచరిస్తున్నావు. PEPS మహోగ్రుడివై జాతులను అణగదొక్కుతున్నావు. PEPS
13. నీ ప్రజలను రక్షించడానికి నీవు బయలుదేరుతున్నావు. PEPS నీవు నియమించిన అభిషిక్తుణ్ణి రక్షించడానికి బయలు దేరుతున్నావు. PEPS దుష్టుల కుటుంబికుల్లో ప్రధానుడొకడైనా ఉండకుండాా వారి తలను మెడను ఖండించి నిర్మూలం చేస్తున్నావు (సెలా). PEPS
14. పేదలను రహస్యంగా మింగివేయాలని ఉప్పొంగుతూ తుఫానులాగా వస్తున్న యోధుల తలల్లో వారి ఈటెలే నాటుతున్నావు. PEPS
15. నీవు సముద్రాన్ని తొక్కుతూ సంచరిస్తున్నావు. PEPS నీ గుర్రాలు మహాసముద్ర జలరాసులను తొక్కుతాయి. PEPS
16. నేను వింటుంటే నా అంతరంగం కలవరపడుతున్నది. శబ్దానికి నా పెదవులు వణుకుతున్నాయి. నా ఎముకలు కుళ్లిపోతున్నాయి. నా కాళ్లు వణకుతున్నాయి. జనాలపై దాడి చేసే వారు సమీపించే దాకా నేను ఊరుకుని బాధ దినం కోసం కనిపెట్టవలసి ఉంది. PEPS
17. అంజూరపు చెట్లు పూత పట్టకపోయినా, PEPS ద్రాక్షచెట్లు ఫలింపక పోయినా, PEPS ఒలీవచెట్లు కాపులేక ఉన్నా, PEPS చేనులో పైరు పంటకు రాకపోయినా, PEPS గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, కొట్టంలో పశువులు లేకపోయినా, PEPS
18. నేను యెహోవా పట్ల ఆనందిస్తాను. PEPS నా రక్షణకర్తయైన నా దేవుణ్ణి బట్టి నేను సంతోషిస్తాను. PEPS
19. ప్రభువైన యెహోవాయే నాకు బలం. PEPS ఆయన నా కాళ్లను లేడికాళ్లలాగా చేస్తాడు. PEPS ఉన్నత స్థలాల మీద ఆయన నన్ను నడిపిస్తాడు. PE
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×