1. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అనే యూదా రాజులు, యెహోయాషు కుమారుడైన ఇశ్రాయేలు రాజు యరొబాము పరిపాలించిన దినాల్లో బెయేరి కుమారుడు హోషేయకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. 1. హోషేయ భార్యబిడ్డలు PEPS
2. యెహోవా హోషేయతో మొదట మాట్లాడినప్పుడు ఇలా ఆజ్ఞాపించాడు. PEPS “వెళ్ళి ఒక వేశ్యను నీకు భార్యగా తెచ్చుకో. PEPS ఆమె వ్యభిచారం ఫలితంగా పుట్టిన సంతానాన్ని స్వీకరించు. PEPS ఎందుకంటే దేశం నన్ను విడిచిపెట్టి నీచమైన వ్యభిచార కార్యాలు చేసింది.” PEPS
3. కాబట్టి హోషేయ వెళ్ళి దిబ్లయీము కూతురు గోమెరును పెళ్ళాడాడు. PEPS ఆమె గర్భం ధరించి అతనికొక కొడుకుని కన్నది. PEPS
4. యెహోవా అతనికి ఇలా ఆజ్ఞాపించాడు. PEPS “వీడికి ‘యెజ్రెయేల్ * యెజ్రెయేల్ దేవుడు చెదరకొట్టి వేస్తాడు ’ అని పేరు పెట్టు. PEPS యెజ్రెయేలులో యెహూ వంశం వారు రక్తపాతం చేశారు. PEPS దాన్ని బట్టి ఇక కొంతకాలానికి నేను వారిని శిక్షిస్తాను. PEPS ఇశ్రాయేలువారికి రాజ్యం ఉండకుండాా తీసేస్తాను. PEPS
5. ఆ రోజుల్లో జరిగేది ఏమిటంటే, PEPS నేను యెజ్రెయేలు లోయలో ఇశ్రాయేలు వారి విల్లును విరిచేస్తాను.” PEPS
6. గోమెరు మళ్లీ గర్భం ధరించి ఆడపిల్లను కన్నది. PEPS యెహోవా అతనికి ఇలా చెప్పాడు. PEPS “దీనికి ‘లో రూహామా † లో రూహామా దయ పొందనిది ’ అని పేరు పెట్టు. PEPS ఎందుకంటే ఇకపై నేను ఇశ్రాయేలును క్షమించడం కోసం వారిపై జాలి పడను. PEPS
7. అయితే యూదావారిపై జాలి చూపుతాను. PEPS వారి దేవుడైన యెహోవా అనే నేనే వారిని రక్షిస్తాను. PEPS విల్లు, ఖడ్గం, సమరం, గుర్రాలు, రౌతులు అనే వాటి వల్ల కాదు.” PEPS
8. లో రూహామా పాలు మానిన తరువాత ఆమె తల్లి గర్భం ధరించి మరొక కొడుకును కన్నది. PEPS
9. యెహోవా ఇలా చెప్పాడు. PEPS “వీడికి ‘లో అమ్మీ ‡ లో అమ్మీ నా జనం కానిది ’ అని పేరు పెట్టు. PEPS ఎందుకంటే మీరు నా ప్రజలు కారు, PEPS నేను మీకు దేవుణ్ణి కాను. PEPS
10. అయినప్పటికీ ఇశ్రాయేలీయుల జనసంఖ్య సముద్రతీరంలో ఇసుకంత విస్తారం అవుతుంది. PEPS దాన్ని కొలవలేము, లెక్కబెట్టలేము. PEPS ఎక్కడ ‘మీరు నా ప్రజలు కారు’ అని వారితో చెప్పానో, PEPS అక్కడే ‘మీరు సజీవుడైన దేవుని ప్రజలు’ అని వారికి చెబుతారు. PEPS
11. యూదా, ఇశ్రాయేలు ఒక్క చోట సమకూడుతారు. PEPS తమపై ఒకే నాయకుణ్ణి నియమించుకుంటారు. PEPS ఆ దేశంలో నుండి బయలు దేరుతారు. PEPS ఆ యెజ్రెయేలు దినం § యెజ్రెయేలు దినం దేవుడు ఒకప్పుడు తన ప్రజల్ని శిక్షిస్తాడు మహా ప్రభావ దినం.” PE