|
|
1. {దావీదు చివరి మాటలు} PS దావీదు చివరి మాటలు ఇవే. యెష్షయి కుమారుడు, యాకోబు దేవుని చేత అభిషిక్తుడైన వాడు, మహా ఘనత పొందినవాడు, ఇశ్రాయేలీయుల మధుర వాగ్గేయకారుడు అయిన దావీదు పలికిన దేవోక్తి ఇదే.
|
1. Now these H428 be the last H314 words H1697 of David H1732 the son H1121 of Jesse H3448 said H5002 H1732 , and the man H1397 who was raised up H6965 on high H5920 , the anointed H4899 of the God H430 of Jacob H3290 , and the sweet H5273 psalmist H2158 of Israel H3478 , said H5002 ,
|
2. “యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుతున్నాడు ఆయన వాక్కు నా నాలుకపై ఉంది.
|
2. The Spirit H7307 of the LORD H3068 spoke H1696 by me , and his word H4405 was in H5921 my tongue H3956 .
|
3. ఇశ్రాయేలీయుల దేవుడు మాటలాడుతున్నాడు. ఇశ్రాయేలీయుల ఆశ్రయదుర్గం పలికాడు. మనుషులను నీతిన్యాయాలతో పరిపాలించేవాడు, దేవునిపట్ల భయభక్తులు కలిగి ఏలేవాడు,
|
3. The God H430 of Israel H3478 said H559 , the Rock H6697 of Israel H3478 spoke H1696 to me , He that ruleth over H4910 men H120 must be just H6662 , ruling H4910 in the fear H3374 of God H430 .
|
4. అతడు సూర్యోదయాన తొలిసంధ్య కాంతిలాగా మబ్బు లేని ఉదయం లాగా వాన వెలిసిన తరువాత కాంతులీనే కిరణాల్లో మొలకెత్తిన లేత గడ్డిలాగా ఉంటాడు.
|
4. And he shall be as the light H216 of the morning H1242 , when the sun H8121 riseth H2224 , even a morning H1242 without H3808 clouds H5645 ; as the tender grass H1877 springing out of the earth H4480 H776 by clear shining H4480 H5051 after rain H4480 H4306 .
|
5. నా సంతానం దేవుని ఎదుట అలాటి వారు కాకపోయినా ఆయన నాతో నిత్య నిబంధన చేయలేదా? ఆ నిబంధన అన్నివిధాలా సంపూర్ణమైనది, సుస్థిరమైనది కాదా? ఆయన నాకు ధారాళమైన రక్షణ చేకూర్చి, అంతా సఫలమయ్యేలా చేస్తాడు.
|
5. Although H3588 my house H1004 be not H3808 so H3651 with H5973 God H410 ; yet H3588 he hath made H7760 with me an everlasting H5769 covenant H1285 , ordered H6186 in all H3605 things , and sure H8104 : for H3588 this is all H3605 my salvation H3468 , and all H3605 my desire H2656 , although H3588 he make it not H3808 to grow H6779 .
|
6. ముళ్ళను అవతల పారవేసినట్టు దుర్మార్గులను విసిరి వేయడం జరుగుతుంది. ఎందుకంటే వారు చేత్తో పట్టుకోలేని ముళ్ళలాగా ఉన్నారు.
|
6. But the sons of Belial H1100 shall be all H3605 of them as thorns H6975 thrust away H5074 , because H3588 they cannot H3808 be taken H3947 with hands H3027 :
|
7. ఇనుప పరికరమైనా, ఈటె కోల అయినా లేకుండా మనుషులు ముళ్ళను తాకరు. దేనినీ వదలకుండా వాటన్నిటినీ ఉన్న చోటనే తగలబెడతారు.” PS
|
7. But the man H376 that shall touch H5060 them must be fenced H4390 with iron H1270 and the staff H6086 of a spear H2595 ; and they shall be utterly burned H8313 H8313 with fire H784 in the same place H7675 .
|
8. {దావీదు యోధులు} PS దావీదు యోధుల పేర్లు ఇవి: ముఖ్య వీరుల్లో మొదటివాడు యోషే బెష్షెబెతు. ఇతడు తక్మోనీ వంశం వాడు. అతడు ఒక యుద్ధంలో ఎనిమిది వందల మందిని హతం చేశాడు. PEPS
|
8. These H428 be the names H8034 of the mighty men H1368 whom H834 David H1732 had : The Tachmonite H8461 that sat H3427 in the seat H7675 , chief H7218 among the captains H7991 ; the same H1931 was Adino H5722 the Eznite H6112 : he lifted up his spear against H5921 eight H8083 hundred H3967 , whom he slew H2491 at one H259 time H6471 .
|
9. ఇతని తరువాతి వాడు అహోహీయుడైన దోదో కొడుకు ఎలియాజరు. ఇతడు దావీదు ముగ్గురు యోధుల్లో ఒకడు. ఫిలిష్తీయులు యుద్ధానికి వస్తే, ఇతడు వారిని ఎదిరించాడు. ఇశ్రాయేలీయులు వెనక్కు తగ్గితే ఇతడు నిలబడి
|
9. And after H310 him was Eleazar H499 the son H1121 of Dodo H1734 the Ahohite H1121 H266 , one of the three H7969 mighty men H1368 with H5973 David H1732 , when they defied H2778 the Philistines H6430 that were there H8033 gathered together H622 to battle H4421 , and the men H376 of Israel H3478 were gone away H5927 :
|
10. అరచెయ్యి బిగుసుకు పోయి చేతికి కత్తి అతుక్కుపోయే దాకా ఫిలిష్తీయులను ఎదుర్కొన్నాడు. ఆ రోజున యెహోవా ఇశ్రాయేలీయులకు గొప్ప విజయాన్ని ప్రసాదించాడు. దోపుడు సొమ్ము తీసుకుపోవడానికి మాత్రం ప్రజలు అతని వెనకాల వచ్చారు. PEPS
|
10. He H1931 arose H6965 , and smote H5221 the Philistines H6430 until H5704 H3588 his hand H3027 was weary H3021 , and his hand H3027 cleaved H1692 unto H413 the sword H2719 : and the LORD H3068 wrought H6213 a great H1419 victory H8668 that H1931 day H3117 ; and the people H5971 returned H7725 after H310 him only H389 to spoil H6584 .
|
11. ఇతని తరువాత హరారు ఊరివాడైన ఆగే కొడుకు షమ్మా. ఒకసారి ఫిలిష్తీయులు అలచందల చేలో గుంపు గూడి ఉండగా ఇశ్రాయేలు సైన్యం ఫిలిష్తీయులను ఎదిరించి నిలవలేక పారిపోయారు.
|
11. And after H310 him was Shammah H8048 the son H1121 of Agee H89 the Hararite H2043 . And the Philistines H6430 were gathered together H622 into a troop H2416 , where H8033 was H1961 a piece H2513 of ground H7704 full H4392 of lentils H5742 : and the people H5971 fled H5127 from H4480 H6440 the Philistines H6430 .
|
12. అప్పుడితడు ఆ పొలం మధ్యలో నిలబడి ఫిలిష్తీయులు దాని మీదికి రాకుండా అడ్డుకున్నాడు. వారిని హతం చేశాడు. యెహోవా ఇశ్రాయేలీయులకు గొప్ప విజయాన్నిచ్చాడు. PEPS
|
12. But he stood H3320 in the midst H8432 of the ground H2513 , and defended H5337 it , and slew H5221 H853 the Philistines H6430 : and the LORD H3068 wrought H6213 a great H1419 victory H8668 .
|
13. ముప్ఫై మంది వీరుల్లో ముఖ్యులైన ముగ్గురు కోతకాలంలో అదుల్లాము గుహలో ఉన్న దావీదు దగ్గరికి వచ్చారు. ఫిలిష్తీయుల సైన్యం రెఫాయీము లోయలో ఉన్నారు.
|
13. And three H7969 of the thirty H7970 chief H7218 went down H3381 , and came H935 to H413 David H1732 in H413 the harvest time H7105 unto H413 the cave H4631 of Adullam H5725 : and the troop H2416 of the Philistines H6430 pitched H2583 in the valley H6010 of Rephaim H7497 .
|
14. దావీదు తన సురక్షితమైన చోట, గుహలో ఉన్నాడు. ఫిలిష్తీయ సేన బేత్లెహేములో శిబిరం వేసుకుని ఉన్నారు.
|
14. And David H1732 was then H227 in a hold H4686 , and the garrison H4673 of the Philistines H6430 was then H227 in Bethlehem H1035 .
|
15. దావీదు మంచి నీటి కోసం తహ తహ లాడుతూ “బేత్లెహేము పురద్వారం దగ్గరున్న బావి నీళ్లు ఎవరైనా నాకు తెచ్చి ఇస్తే ఎంత బావుణ్ణు!” అన్నాడు.
|
15. And David H1732 longed H183 , and said H559 , Oh that one H4310 would give me drink H8248 of the water H4325 of the well H4480 H953 of Bethlehem H1035 , which H834 is by the gate H8179 !
|
16. ఆ ముగ్గురు బలాఢ్యులు ఫిలిష్తీయుల సైన్యం కావలి వాళ్ళను ఛేదించుకుని పోయి, బేత్లెహేము ద్వారం దగ్గరున్న బావి నీళ్లు తోడుకుని దావీదు దగ్గరికి తెచ్చారు. అయితే అతడు ఆ నీళ్లు తాగలేదు. యెహోవా సన్నిధిలో అ నీళ్ళు పారబోసి “యెహోవా, ఈ నీళ్ళు తాగడం నాకు దూరం అగు గాక.
|
16. And the three H7969 mighty men H1368 broke through H1234 the host H4264 of the Philistines H6430 , and drew H7579 water H4325 out of the well H4480 H953 of Bethlehem H1035 , that H834 was by the gate H8179 , and took H5375 it , and brought H935 it to H413 David H1732 : nevertheless he would H14 not H3808 drink H8354 thereof , but poured it out H5258 H853 unto the LORD H3068 .
|
17. వీళ్ళు ప్రాణాలకు తెగించి పోయి ఇవి తెచ్చారు కదా. ఈ నీళ్ళు వీరి రక్తంతో సమానం” అని చెప్పి తాగడానికి నిరాకరించాడు. PEPS ఆ ముగ్గురు మహావీరులు ఈ పరాక్రమ కార్యాలు చేశారు. PEPS
|
17. And he said H559 , Be it far H2486 from me , O LORD H3068 , that I should do H4480 H6213 this H2063 : is not this the blood H1818 of the men H376 that went H1980 in jeopardy of their lives H5315 ? therefore he would H14 not H3808 drink H8354 it. These H428 things did H6213 these three H7969 mighty men H1368 .
|
18. సెరూయా కొడుకు, యోవాబు సోదరుడు అబీషై ఈ ముప్ఫై మందికి నాయకుడు. ఇతడొక యుద్ధంలో మూడు వందల మందిని ఈటెతో సాము చేసి హతం చేశాడు. ఇతడు ఆ ముగ్గురితో సమానంగా పేరు పొందాడు.
|
18. And Abishai H52 , the brother H251 of Joab H3097 , the son H1121 of Zeruiah H6870 , was chief H7218 among three H7992 . And he H1931 lifted up H5782 H853 his spear H2595 against H5921 three H7969 hundred H3967 , and slew H2491 them , and had the name H8034 among three H7969 .
|
19. ఇతడు ఆ ముప్ఫై మందిలో గొప్పవాడై, వారికి అధిపతి అయ్యాడు. కానీ ఆ మొదటి ముగ్గురికీ సాటి కాలేదు. PEPS
|
19. Was he not H3588 most H4480 honorable H3513 of three H7969 ? therefore he was H1961 their captain H8269 : howbeit he attained H935 not H3808 unto H5704 the first three H7969 .
|
20. కబ్సెయేలు ఊరివాడైన బెనాయా యెహోయాదా కొడుకు. అతడు పరాక్రమశాలి. మహా ప్రతాపం చూపించాడు. ఇతడు ఇద్దరు మోయాబు శూరులను హతం చేశాడు. మంచు కురుస్తున్న కాలంలో ఇతడు బావిలో దాక్కుని ఉన్న ఒక సింహాన్ని చంపేశాడు.
|
20. And Benaiah H1141 the son H1121 of Jehoiada H3077 , the son H1121 of a valiant H2428 man H376 , of Kabzeel H4480 H6909 , who had done many acts H7227 H6467 , he H1931 slew H5221 H853 two H8147 lionlike men H739 of Moab H4124 : he H1931 went down H3381 also and slew H5221 H853 a lion H738 in the midst H8432 of a pit H8432 H953 in time H3117 of snow H7950 :
|
21. ఇంకా అతడు మహాకాయుడైన ఒక ఐగుప్తు వాణ్ని చంపాడు. ఈ ఐగుప్తీయుడి చేతిలో ఈటె ఉంటే బెనాయా దుడ్డుకర్ర తీసుకు అతడి మీదికి పోయాడు. వాడి చేతిలోని ఈటె ఊడలాగి దానితోనే వాణ్ణి చంపేశాడు.
|
21. And he H1931 slew H5221 H853 an Egyptian H376 H4713 , a goodly H4758 man H376 : and the Egyptian H4713 had a spear H2595 in his hand H3027 ; but he went down H3381 to H413 him with a staff H7626 , and plucked H1497 H853 the spear H2595 out of the Egyptian's hand H4480 H3027 H4713 , and slew H5221 him with his own spear H2595 .
|
22. ఈ పరాక్రమ క్రియలు యెహోయాదా కొడుకు బెనాయా చేశాడు కాబట్టి ఆ ముగ్గురు బలాఢ్యులతోబాటు లెక్కలోకి వచ్చాడు.
|
22. These H428 things did H6213 Benaiah H1141 the son H1121 of Jehoiada H3077 , and had the name H8034 among three H7969 mighty men H1368 .
|
23. ఆ ముప్ఫై మందిలోకీ ఘనుడయ్యాడు. అయినా మొదటి ముగ్గురితో సాటి కాలేదు. దావీదు ఇతన్ని తన దేహ సంరక్షకుల నాయకునిగా నియమించాడు. PEPS
|
23. He was more honorable H3513 than H4480 the thirty H7970 , but he attained H935 not H3808 to H413 the first three H7969 . And David H1732 set H7760 him over H413 his guard H4928 .
|
24. ఆ ముప్ఫై మంది ఎవరంటే, యోవాబు సోదరుడు అశాహేలు, బేత్లెహేము వాడైన దోదో కొడుకు ఎల్హానాను,
|
24. Asahel H6214 the brother H251 of Joab H3097 was one of the thirty H7970 ; Elhanan H445 the son H1121 of Dodo H1734 of Bethlehem H1035 ,
|
25. హరోదీయుడైన షమ్మా, హరోదీయుడైన ఎలీకా,
|
25. Shammah H8048 the Harodite H2733 , Elika H470 the Harodite H2733 ,
|
26. పత్తీయుడైన హేలెసు, తెకోవీయుడైన ఇక్కేషు కొడుకు ఈరా,
|
26. Helez H2503 the Paltite H6407 , Ira H5896 the son H1121 of Ikkesh H6142 the Tekoite H8621 ,
|
27. అనాతోతు వాడైన అబీయెజరు, హుషాతీయుడైన మెబున్నయి,
|
27. Abiezer H44 the Anethothite H6069 , Mebunnai H4012 the Hushathite H2843 ,
|
28. అహోహీయుడైన సల్మోను, నెటోపాతీయుడైన మహరై,
|
28. Zalmon H6756 the Ahohite H266 , Maharai H4121 the Netophathite H5200 ,
|
29. నెటోపాతీయుడైన బయనాకు పుట్టిన హేలెబు, బెన్యామీనీయుల గిబియాలో పుట్టిన రీబై కుమారుడు ఇత్తయి,
|
29. Heleb H2460 the son H1121 of Baanah H1196 , a Netophathite H5200 , Ittai H863 the son H1121 of Ribai H7380 out of Gibeah H4480 H1390 of the children H1121 of Benjamin H1144 ,
|
30. పిరాతోనీయుడైన బెనాయా, గాయషు లోయప్రాంతాల్లో ఉండే హిద్దయి,
|
30. Benaiah H1141 the Pirathonite H6553 , Hiddai H1914 of the brooks H4480 H5158 of Gaash H1608 ,
|
31. అర్బాతీయుడైన అబీయల్బోను, బర్హుమీయుడైన అజ్మావెతు,
|
31. Abi H45 -albon the Arbathite H6164 , Azmaveth H5820 the Barhumite H1273 ,
|
32. షయల్బోనీయుడైన ఎల్యహ్బా, యాషేను కొడుకుల్లో యోనాతాను,
|
32. Eliahba H455 the Shaalbonite H8170 , of the sons H1121 of Jashen H3464 , Jonathan H3083 ,
|
33. హరారీయుడైన షమ్మా, హరారీయుడైన షారారుకు పుట్టిన అహీయాము,
|
33. Shammah H8048 the Hararite H2043 , Ahiam H279 the son H1121 of Sharar H8325 the Hararite H2043 ,
|
34. మాయాకాతీయుడైన అహస్బయి కొడుకు ఎలీపేలెటు, గిలోనీయుడైన అహీతోపెలు కొడుకు ఏలీయాము,
|
34. Eliphelet H467 the son H1121 of Ahasbai H308 , the son H1121 of the Maachathite H4602 , Eliam H463 the son H1121 of Ahithophel H302 the Gilonite H1526 ,
|
35. కర్మెలీయుడైన హెస్రో, అర్బీయుడైన పయరై,
|
35. Hezrai H2695 the Carmelite H3761 , Paarai H6474 the Arbite H701 ,
|
36. సోబావాడైన నాతాను కొడుకు ఇగాలు, గాదీయుడైన బానీ,
|
36. Igal H3008 the son H1121 of Nathan H5416 of Zobah H4480 H6678 , Bani H1137 the Gadite H1425 ,
|
37. అమ్మోనీయుడైన జెలెకు, బెయేరోతీయుడైన నహరై. ఇతడు సెరూయా కొడుకు యోవాబు ఆయుధాలు మోసేవాడు.
|
37. Zelek H6768 the Ammonite H5984 , Naharai H5171 the Beerothite H886 , armorbearer H3627 H5375 to Joab H3097 the son H1121 of Zeruiah H6870 ,
|
38. ఇత్రీయుడైన ఈరా, ఇత్రీయుడైన గారేబు,
|
38. Ira H5896 an Ithrite H3505 , Gareb H1619 an Ithrite H3505 ,
|
39. హిత్తీయుడైన ఊరియా. ఈ కోవలో చేరినవారు మొత్తం ముప్ఫై ఏడుగురు. PE
|
39. Uriah H223 the Hittite H2850 : thirty H7970 and seven H7651 in all H3605 .
|