|
|
1. {పిలాతు ఎదుట యేసు} PS అప్పుడు వారంతా కలసి ఆయనను పిలాతు దగ్గరికి తీసుకువెళ్ళారు.
|
1. And G2532 the G3588 whole G537 multitude G4128 of them G846 arose G450 , and led G71 him G846 unto G1909 Pilate G4091 .
|
2. “ఇతడు మా ప్రజలను తిరుగుబాటుకు ప్రోత్సహిస్తున్నాడు. సీజరుకి పన్ను చెల్లించ వద్దనీ తాను క్రీస్తు అనే రాజుననీ ఇతడు చెబుతుంటే విన్నాము” అని ఆయన మీద నేరారోపణ చేశారు.
|
2. And G1161 they began G756 to accuse G2723 him G846 , saying G3004 , We found G2147 this G5126 fellow perverting G1294 the G3588 nation G1484 , and G2532 forbidding G2967 to give G1325 tribute G5411 to Caesar G2541 , saying G3004 that he himself G1438 is G1511 Christ G5547 a King G935 .
|
3. అప్పుడు పిలాతు, “నువ్వు యూదుల రాజువా?” అని ఆయనను అడిగాడు. దానికి ఆయన, “నువ్వే అంటున్నావు కదా” అన్నాడు. PEPS
|
3. And G1161 Pilate G4091 asked G1905 him G846 , saying G3004 , Art G1488 thou G4771 the G3588 King G935 of the G3588 Jews G2453 ? And G1161 he G3588 answered G611 him G846 and said G5346 , Thou G4771 sayest G3004 it.
|
4. పిలాతు ప్రధాన యాజకులతోనూ, జనంతోనూ, “ఈ వ్యక్తిలో నాకు ఎలాంటి దోషమూ కనిపించడం లేదు,” అన్నాడు.
|
4. Then G1161 said G2036 Pilate G4091 to G4314 the G3588 chief priests G749 and G2532 to the G3588 people G3793 , I find G2147 no G3762 fault G158 in G1722 this G5129 man G444 .
|
5. అయితే వారు, “ఇతడు గలిలయ నుండి ఇక్కడ వరకూ యూదయ దేశమంతా ప్రచారం చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నాడు” అని మరింత తీవ్రంగా నొక్కి చెప్పారు. PS
|
5. And G1161 they G3588 were the more fierce G2001 , saying G3004 , He stirreth up G383 the G3588 people G2992 , teaching G1321 throughout G2596 all G3650 Jewry G2449 , beginning G756 from G575 Galilee G1056 to G2193 this place G5602 .
|
6. {హేరోదు ఎదుట యేసు} PS పిలాతు ఈ మాట విని, “ఇతడు గలిలయ ప్రాంతం వాడా?” అని అడిగాడు.
|
6. When G1161 Pilate G4091 heard G191 of Galilee G1056 , he asked G1905 whether G1487 the G3588 man G444 were G2076 a Galilaean G1057 .
|
7. ఆయన హేరోదు అధికారం కింద ఉన్న ప్రదేశానికి చెందినవాడని తెలియగానే ఆయనను హేరోదు దగ్గరికి పంపించాడు. ఆ రోజుల్లో హేరోదు యెరూషలేములోనే ఉన్నాడు. PEPS
|
7. And G2532 as soon as he knew G1921 that G3754 he belonged unto G2076 G1537 Herod G2264 's jurisdiction G1849 , he sent G375 him G846 to G4314 Herod G2264 , who himself G846 also G2532 was G5607 at G1722 Jerusalem G2414 at G1722 that G5025 time G2250 .
|
8. హేరోదు యేసును చూసి ఎంతో సంతోషించాడు. ఆయనను గురించి అతడు ఎన్నో విషయాలు విని ఉన్నాడు. ఎంతో కాలంగా ఆయనను చూడాలని ఆశిస్తున్నాడు. ఆయన ఏదైనా ఒక అద్భుతం చేస్తే చూడాలని కూడా ఆశిస్తున్నాడు.
|
8. And G1161 when Herod G2264 saw G1492 Jesus G2424 , he was exceeding glad G5463 G3029 : for G1063 he was G2258 desirous G2309 to see G1492 him G846 of G1537 a long G2425 season, because he had heard G191 many things G4183 of G4012 him G846 ; and G2532 he hoped G1679 to have seen G1492 some G5100 miracle G4592 done G1096 by G5259 him G846 .
|
9. హేరోదు ఆయనను ఎన్నో ప్రశ్నలు వేశాడు కానీ ఆయన అతనికి జవాబేమీ ఇవ్వలేదు. PEPS
|
9. Then G1161 he questioned G1905 with him G846 in G1722 many G2425 words G3056 ; but G1161 he G846 answered G611 him G846 nothing G3762 .
|
10. ముఖ్య యాజకులూ ధర్మశాస్త్ర పండితులూ అక్కడే నిలబడి ఆయన మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు.
|
10. And G1161 the G3588 chief priests G749 and G2532 scribes G1122 stood G2476 and vehemently G2159 accused G2723 him G846 .
|
11. హేరోదు తన సైనికులతో కలిసి, ఆయనను అవమానించి, అపహసించి, ఆయనకు ప్రశస్తమైన వస్త్రాన్ని తొడిగించి తిరిగి పిలాతు దగ్గరికి పంపించాడు.
|
11. And G1161 Herod G2264 with G4862 his G848 men of war G4753 set him at naught G1848 G846 , and G2532 mocked G1702 him, and arrayed G4016 him G846 in a gorgeous G2986 robe G2066 , and sent him again G375 G846 to Pilate G4091 .
|
12. అంతకు ముందు హేరోదూ, పిలాతూ శత్రువులుగా ఉండేవారు. కానీ ఆ రోజు వారిద్దరూ స్నేహితులయ్యారు. మళ్ళీ పిలాతు ఎదుటికి, బరబ్బా విడుదల, యేసుకు మరణ శిక్ష మత్తయి 27:15-26; మార్కు 15:6-15; యోహా 18:39, 40 PEPS
|
12. And G1161 the same G846 day G2250 Pilate G4091 and G2532 Herod G2264 were made G1096 friends G5384 together G3326 G240 : for G1063 before G4391 they were G5607 at G1722 enmity G2189 between G4314 themselves G1438 .
|
13. అప్పుడు పిలాతు ముఖ్య యాజకులనూ అధికారులనూ ప్రజలనూ పిలిపించాడు.
|
13. And G1161 Pilate G4091 , when he had called together G4779 the G3588 chief priests G749 and G2532 the G3588 rulers G758 and G2532 the G3588 people G2992 ,
|
14. “ప్రజలు తిరగబడేలా చేస్తున్నాడంటూ మీరు ఈ వ్యక్తిని నా దగ్గరికి తీసుకువచ్చారు కదా. మీ ముందే నేను ఇతణ్ణి ప్రశ్నించాను. కానీ మీరితని మీద మోపిన నేరాల్లో ఒక్కటి కూడా నాకు నిజమనిపించడం లేదు.
|
14. Said G2036 unto G4314 them G846 , Ye have brought G4374 this G5126 man G444 unto me G3427 , as G5613 one that perverteth G654 the G3588 people G2992 : and G2532 , behold G2400 , I G1473 , having examined G350 him before G1799 you G5216 , have found G2147 no G3762 fault G158 in G1722 this G5129 man G444 touching those things whereof G3739 ye accuse G2723 him G846 :
|
15. హేరోదుకు కూడా ఏ దోషమూ కనిపించలేదు. హేరోదు ఇతణ్ణి నా దగ్గరకే తిరిగి పంపాడు కదా. మరణ శిక్షకు తగిన నేరమేదీ ఇతడు చేయలేదు.
|
15. No G235 , nor yet G3761 Herod G2264 : for G1063 I sent G375 you G5209 to G4314 him G846 ; and G2532 , lo G2400 , nothing G3762 worthy G514 of death G2288 is G2076 done G4238 unto him G846 .
|
16. అందుచేత నేనితణ్ణి శిక్షించి విడుదల చేస్తాను” అన్నాడు. PEPS
|
16. I will therefore G3767 chastise G3811 him G846 , and release G630 him.
|
17. పండగ సమయంలో పిలాతు ప్రజల కోసం ఒక ఖైదీని విడుదల చేయడం వాడుక.
|
17. ( For G1161 of necessity G318 he must G2192 release G630 one G1520 unto them G846 at G2596 the feast G1859 .)
|
18. అయితే వారంతా, “వీణ్ణి చంపి మాకు బరబ్బను విడుదల చెయ్యండి” అని ఒక్కపెట్టున కేకలు వేశారు.
|
18. And G1161 they cried out G349 all at once G3826 , saying G3004 , Away G142 with this G5126 man, and G1161 release G630 unto us G2254 Barabbas G912 :
|
19. బరబ్బ పట్టణంలో జరిగిన ఒక తిరుగుబాటు, హత్యానేరాలకై చెరసాలలో ఉన్నాడు. PEPS
|
19. ( Who G3748 for G1223 a certain G5100 sedition G4714 made G1096 in G1722 the G3588 city G4172 , and G2532 for murder G5408 , was G2258 cast G906 into G1519 prison G5438 .)
|
20. పిలాతు యేసును విడుదల చేయాలని ఆశించి వారితో మళ్ళీ మాట్లాడాడు.
|
20. Pilate G4091 therefore G3767 , willing G2309 to release G630 Jesus G2424 , spake again to them G4377 G3825 .
|
21. కాని వారంతా, “వీణ్ణి సిలువ వేయాలి, సిలువ వేయాలి” అని మరింతగా కేకలు వేశారు.
|
21. But G1161 they G3588 cried G2019 , saying G3004 , Crucify G4717 him, crucify G4717 him G846 .
|
22. మూడవ సారి అతడు, “ఎందుకు? ఇతడేమి దుర్మార్గం చేశాడు? ఇతనిలో మరణ శిక్షకు తగిన నేరమేదీ నాకు కనపడలేదు. అందుచేత ఇతణ్ణి శిక్షించి వదిలేస్తాను” అన్నాడు. PEPS
|
22. And G1161 he G3588 said G2036 unto G4314 them G846 the third time G5154 , Why G1063 , what G5101 evil G2556 hath he G3778 done G4160 ? I have found G2147 no G3762 cause G158 of death G2288 in G1722 him G846 : I will therefore G3767 chastise G3811 him G846 , and G2532 let him go G630 .
|
23. కాని వారంతా పట్టుబట్టి పెద్దగా కేకలు వేసి, “వీణ్ణి సిలువ వేయండి” అని అరిచారు. చివరికి వారి కేకలే గెలిచాయి.
|
23. And G1161 they G3588 were instant G1945 with loud G3173 voices G5456 , requiring G154 that he G846 might be crucified G4717 . And G2532 the G3588 voices G5456 of them G846 and G2532 of the G3588 chief priests G749 prevailed G2729 .
|
24. వారు కోరినట్టే జరగాలని పిలాతు తీర్పు తీర్చాడు.
|
24. And G1161 Pilate G4091 gave sentence G1948 that it should be G1096 as they required G846 G155 .
|
25. వారు కోరినట్టే తిరుగుబాటు, హత్యానేరాలకై చెరసాలలో ఉన్నవాణ్ణి విడుదల చేసి, యేసును వారికిష్టం వచ్చినట్టు చేయడానికి వారికి అప్పగించాడు. PEPS
|
25. And G1161 he released G630 unto them G846 him that for G1223 sedition G4714 and G2532 murder G5408 was cast G906 into G1519 prison G5438 , whom G3739 they had desired G154 ; but G1161 he delivered G3860 Jesus G2424 to their G846 will G2307 .
|
26. వారాయన్ని తీసుకు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు పల్లెటూరి నుండి వస్తున్న కురేనీ ప్రాంతానికి చెందిన సీమోను అనే వ్యక్తిని పట్టుకుని, యేసు వెంటే సిలువ మోయడానికి దాన్ని అతని మీద పెట్టారు. PS
|
26. And G2532 as G5613 they led him away G520 G846 , they laid hold upon G1949 one G5100 Simon G4613 , a Cyrenian G2956 , coming G2064 out of G575 the country G68 , and on him G846 they laid G2007 the G3588 cross G4716 , that he might bear G5342 it after G3693 Jesus G2424 .
|
27. {సిలువ} (మత్తయి 27:33-38; మార్కు 15:22-28; యోహా 19:17-19) PS పెద్ద జనసమూహం, ఆయనను గురించి రొమ్ము కొట్టుకుంటూ దుఃఖిస్తున్న చాలమంది స్త్రీలూ ఆయనను వెంబడించారు. PEPS
|
27. And G1161 there followed G190 him G846 a great G4183 company G4128 of people G2992 , and G2532 of women G1135 , which G3739 also G2532 bewailed G2875 and G2532 lamented G2354 him G846 .
|
28. యేసు వారివైపు తిరిగి, “యెరూషలేము స్త్రీలారా, నా కోసం ఏడవవద్దు. మీ కోసం, మీ పిల్లల కోసం ఏడవండి. PEPS
|
28. But G1161 Jesus G2424 turning G4762 unto G4314 them G846 said G2036 , Daughters G2364 of Jerusalem G2419 , weep G2799 not G3361 for G1909 me G1691 , but G4133 weep G2799 for G1909 yourselves G1438 , and G2532 for G1909 your G5216 children G5043 .
|
29. వినండి, ‘గొడ్రాళ్ళు ధన్యులు, కనని గర్భాలూ పాలియ్యని స్తనాలూ ధన్యం’ అని చెప్పే రోజులు వస్తున్నాయి. PEPS
|
29. For G3754 , behold G2400 , the days G2250 are coming G2064 , in G1722 the which G3739 they shall say G2046 , Blessed G3107 are the G3588 barren G4723 , and G2532 the wombs G2836 that G3739 never G3756 bare G1080 , and G2532 the paps G3149 which G3739 never G3756 gave suck G2337 .
|
30. అప్పుడు ‘మా మీద పడండి’ అని పర్వతాలతో, ‘మమ్మల్ని కప్పివేయండి’ అని కొండలతో ప్రజలు చెప్పడం మొదలుపెడతారు. PEPS
|
30. Then G5119 shall they begin G756 to say G3004 to the G3588 mountains G3735 , Fall G4098 on G1909 us G2248 ; and G2532 to the G3588 hills G1015 , Cover G2572 us G2248 .
|
31. చెట్టు పచ్చిగా ఉన్నప్పుడే వారు ఇలా చేస్తే ఇక ఎండిన దానికేం చేస్తారో” అని చెప్పాడు. PEPS
|
31. For G3754 if G1487 they do G4160 these things G5023 in G1722 a green G5200 tree G3586 , what G5101 shall be done G1096 in G1722 the G3588 dry G3584 ?
|
32. ఇద్దరు నేరస్తులను ఆయనతో బాటు చంపడానికి తీసుకు వచ్చారు.
|
32. And G1161 there were also G2532 two G1417 other G2087 , malefactors G2557 , led G71 with G4862 him G846 to be put to death G337 .
|
33. వారు కపాలం అనే చోటికి వచ్చినప్పుడు అక్కడ వారాయన్ని సిలువ వేశారు. ఆ నేరస్తుల్లో ఒకణ్ణి ఆయనకు కుడి వైపున, మరొకణ్ణి ఎడమవైపున ఆయనతోబాటు సిలువ వేశారు. PEPS
|
33. And G2532 when G3753 they were come G565 to G1909 the G3588 place G5117 , which is called G2564 Calvary G2898 , there G1563 they crucified G4717 him G846 , and G2532 the G3588 malefactors G2557 , one G3739 G3303 on G1537 the right hand G1188 , and G1161 the other G3739 on G1537 the left G710 .
|
34. అప్పుడు యేసు, “తండ్రీ, వీళ్ళేం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు. కాబట్టి వీళ్ళను క్షమించు” అని చెప్పాడు. వారు ఆయన బట్టలు పంచుకోడానికి చీట్లు వేసుకున్నారు. PEPS
|
34. Then G1161 said G3004 Jesus G2424 , Father G3962 , forgive G863 them G846 ; for G1063 they know G1492 not G3756 what G5101 they do G4160 . And G1161 they parted G1266 his G846 raiment G2440 , and cast G906 lots G2819 .
|
35. ప్రజలు నిలబడి ఇదంతా చూస్తున్నారు. అధికారులు, “వీడు ఇతరులను రక్షించాడు. వీడు దేవుడేర్పరచుకున్న క్రీస్తు అయితే తనను తాను రక్షించుకోవాలి” అంటూ ఎగతాళి చేశారు. PEPS
|
35. And G2532 the G3588 people G2992 stood G2476 beholding G2334 . And G1161 the G3588 rulers G758 also G2532 with G4862 them G846 derided G1592 him, saying G3004 , He saved G4982 others G243 ; let him save G4982 himself G1438 , if G1487 he G3778 be G2076 Christ G5547 , the G3588 chosen G1588 of God G2316 .
|
36. ఇక సైనికులు కూడా ఆయన దగ్గరికి వచ్చి ఆయనకు పులిసిపోయిన ద్రాక్షారసం ఇవ్వబోతూ
|
36. And G1161 the G3588 soldiers G4757 also G2532 mocked G1702 him G846 , coming to G4334 him, and G2532 offering G4374 him G846 vinegar G3690 ,
|
37. “నువ్వు యూదుల రాజువైతే నిన్ను నువ్వే రక్షించుకో” అని ఆయనను వెక్కిరించారు.
|
37. And G2532 saying G3004 , If G1487 thou G4771 be G1488 the G3588 king G935 of the G3588 Jews G2453 , save G4982 thyself G4572 .
|
38. “ఇతడు యూదుల రాజు” అని ఒక చెక్కపై రాసి ఆయనకు పైగా ఉంచారు. PS
|
38. And G1161 a superscription G1923 also G2532 was G2258 written G1125 over G1909 him G846 in letters G1121 of Greek G1673 , and G2532 Latin G4513 , and G2532 Hebrew G1444 , THIS G3778 IS G2076 THE G3588 KING G935 OF THE G3588 JEWS G2453 .
|
39. {పరితాపం చెందిన దొంగ} (మత్తయి 27:44; మార్కు 15:32) PS వేలాడుతున్న ఆ నేరస్థుల్లో ఒకడు ఆయనను దూషిస్తూ, “నువ్వు నిజంగా క్రీస్తువైతే నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు” అన్నాడు. PEPS
|
39. And G1161 one G1520 of the G3588 malefactors G2557 which were hanged G2910 railed on G987 him G846 , saying G3004 , If G1487 thou G4771 be G1488 Christ G5547 , save G4982 thyself G4572 and G2532 us G2248 .
|
40. కాని రెండోవాడు వాణ్ణి చీవాట్లు పెట్టాడు. “నువ్వూ అదే శిక్ష అనుభవిస్తున్నావు కదా. దేవునికి భయపడవా?
|
40. But G1161 the G3588 other G2087 answering G611 rebuked G2008 him G846 , saying G3004 , Dost not G3761 thou G4771 fear G5399 God G2316 , seeing G3754 thou art G1488 in G1722 the G3588 same G846 condemnation G2917 ?
|
41. మనకైతే ఇది న్యాయమే. మనం చేసిన వాటికి తగిన ప్రతిఫలం పొందుతున్నాం. కానీ ఈయన ఏ తప్పూ చేయలేదు” అన్నాడు. PEPS
|
41. And G2532 we G2249 indeed G3303 justly G1346 ; for G1063 we receive G618 the due reward G514 of our deeds G3739 G4238 : but G1161 this man G3778 hath done G4238 nothing G3762 amiss G824 .
|
42. తరువాత ఆయనను చూసి, “యేసూ, నువ్వు నీ రాజ్యంలో ప్రవేశించేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో” అన్నాడు.
|
42. And G2532 he said G3004 unto Jesus G2424 , Lord G2962 , remember G3415 me G3450 when G3752 thou comest G2064 into G1722 thy G4675 kingdom G932 .
|
43. అందుకాయన వాడితో, “ఈ రోజు నువ్వు నాతో కూడా పరలోకంలో ఉంటావని నీతో కచ్చితంగా చెబుతున్నాను” అన్నాడు. PEPS
|
43. And G2532 Jesus G2424 said G2036 unto him G846 , Verily G281 I say G3004 unto thee G4671 , Today G4594 shalt thou be G2071 with G3326 me G1700 in G1722 paradise G3857 .
|
44. అప్పుడు సుమారుగా మధ్యాహ్నమైంది. మూడు గంటల వరకూ ఆ దేశమంతటి మీదా చీకటి అలముకుంది.
|
44. And G1161 it was G2258 about G5616 the sixth G1623 hour G5610 , and G2532 there was G1096 a darkness G4655 over G1909 all G3650 the G3588 earth G1093 until G2193 the ninth G1766 hour G5610 .
|
45. సూర్యుడు అంతర్థానమయ్యాడు. దేవాలయంలో గర్భాలయం తెర రెండుగా చిరిగిపోయింది. PS
|
45. And G2532 the G3588 sun G2246 was darkened G4654 , and G2532 the G3588 veil G2665 of the G3588 temple G3485 was rent G4977 in the midst G3319 .
|
46. {యేసు తన ఆత్మను తండ్రికి అప్పగించడం} (మత్తయి 27:50; మార్కు 15:37; యోహా 19:30) PS అప్పుడు యేసు పెద్ద స్వరంతో కేకవేసి, “తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను.” అన్నాడు. ఆయన ఈ విధంగా చెప్పి ప్రాణం విడిచాడు. PEPS
|
46. And G2532 when Jesus G2424 had cried G5455 with a loud G3173 voice G5456 , he said G2036 , Father G3962 , into G1519 thy G4675 hands G5495 I commend G3908 my G3450 spirit G4151 : and G2532 having said G2036 thus G5023 , he gave up the ghost G1606 .
|
47. శతాధిపతి జరిగిందంతా చూసి, “ఈ వ్యక్తి నిజంగా నీతిపరుడే” అని చెప్పి దేవుణ్ణి కీర్తించాడు.
|
47. Now G1161 when the G3588 centurion G1543 saw G1492 what was done G1096 , he glorified G1392 God G2316 , saying G3004 , Certainly G3689 this G3778 was G2258 a righteous G1342 man G444 .
|
48. ఈ దృశ్యం చూడడానికి సమకూడిన ప్రజలు జరిగిందంతా చూసి గుండెలు బాదుకుంటూ తిరిగి వెళ్ళారు.
|
48. And G2532 all G3956 the G3588 people G3793 that came together G4836 to G1909 that G5026 sight G2335 , beholding G2334 the things which were done G1096 , smote G5180 their G1438 breasts G4738 , and returned G5290 .
|
49. ఆయనతో పరిచయమున్న వారూ, గలిలయ నుండి ఆయనను అనుసరించిన స్త్రీలూ దూరంగా నిలబడి చూస్తున్నారు. మత్తయి 27:57-61; మార్కు 15:42, 47; యోహా 19:38, 42 PEPS
|
49. And G1161 all G3956 his G846 acquaintance G1110 , and G2532 the women G1135 that followed G4870 him G846 from G575 Galilee G1056 , stood G2476 afar off G3113 , beholding G3708 these things G5023 .
|
50. {భూస్థాపన} PS యూదుల మహాసభలో యోసేపు అనే వ్యక్తి ఉన్నాడు. ఇతడు అరిమతయి ఊరివాడు. మంచివాడు, నీతిపరుడు.
|
50. And G2532 , behold G2400 , there was a man G435 named G3686 Joseph G2501 , a G5225 counselor G1010 ; and he was a good G18 man G435 , and G2532 a just G1342 :
|
51. మహాసభ చేసిన తీర్మానానికి ఇతడు సమ్మతించలేదు. ఇతడు దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు.
|
51. (The same G3778 had G2258 not G3756 consented G4784 to the G3588 counsel G1012 and G2532 deed G4234 of them G846 ;) he was of G575 Arimathaea G707 , a city G4172 of the G3588 Jews G2453 : who G3739 also G2532 himself G846 waited for G4327 the G3588 kingdom G932 of God G2316 .
|
52. అతడు పిలాతు దగ్గరికి వెళ్ళి, యేసు శరీరాన్ని తనకిమ్మని అడిగాడు. PEPS
|
52. This G3778 man went G4334 unto Pilate G4091 , and begged G154 the G3588 body G4983 of Jesus G2424 .
|
53. తరువాత ఆయన శరీరాన్ని సిలువపైనుండి దించి, సన్న నారబట్టతో చుట్టి, తొలిచిన ఒక రాతి సమాధిలో ఉంచాడు. ఆ సమాధిలో ఎవరి దేహాన్నీ అంతకు ముందు ఎప్పుడూ ఉంచలేదు. PEPS
|
53. And G2532 he took it down G2507 G846 , and wrapped G1794 it G846 in linen G4616 , and G2532 laid G5087 it G846 in G1722 a sepulcher G3418 that was hewn in stone G2991 , wherein G3757 never man G3762 G3764 before G3756 was G2258 laid G2749 .
|
54. అది సిద్ధపడే రోజు. విశ్రాంతి దినం మొదలు కాబోతూ ఉంది.
|
54. And G2532 that day G2250 was G2258 the preparation G3904 , and G2532 the sabbath G4521 drew on G2020 .
|
55. అప్పుడు గలిలయ నుండి ఆయనతో వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధినీ, ఆయన దేహాన్నీ ఎలా ఉంచారో చూసి
|
55. And G1161 the women G1135 also G2532 , which G3748 came with G2258 G4905 him G846 from G1537 Galilee G1056 , followed after G2628 , and beheld G2300 the G3588 sepulcher G3419 , and G2532 how G5613 his G846 body G4983 was laid G5087 .
|
56. తిరిగి వెళ్ళి, సుగంధ ద్రవ్యాలూ, పరిమళ తైలాలూ సిద్ధం చేసుకున్నారు. తరువాత దేవుని ఆజ్ఞ ప్రకారం విశ్రాంతి దినం ఏ పనీ లేకుండా ఉన్నారు. PE
|
56. And G1161 they returned G5290 , and prepared G2090 spices G759 and G2532 ointments G3464 ; and G2532 rested G2270 the G3588 G3303 sabbath day G4521 according G2596 to the G3588 commandment G1785 .
|