|
|
1. అడవిలోని కొండమేకలు ఈనే కాలం నీకు తెలుసా? లేళ్లు పిల్లలు పెట్టే కాలం నువ్వు గ్రహించగలవా?
|
1. Knowest H3045 thou the time H6256 when the wild goats H3277 of the rock H5553 bring forth H3205 ? or canst thou mark H8104 when the hinds H355 do calve H2342 ?
|
2. అవి కడుపుతో ఉండే నెలలెన్నో నువ్వు లెక్క పెట్టగలవా? అవి ఈనే కాలం తెలుసా?
|
2. Canst thou number H5608 the months H3391 that they fulfill H4390 ? or knowest H3045 thou the time H6256 when they bring forth H3205 ?
|
3. అవి వంగి తమ పిల్లలను కంటాయి. వాటి పురిటి నొప్పులు తీరుతాయి.
|
3. They bow H3766 themselves , they bring forth H6398 their young ones H3206 , they cast out H7971 their sorrows H2256 .
|
4. వాటి పిల్లలు పుష్టిగా పర్రల్లో పెరుగుతాయి. అవి తల్లులను విడిచిపెట్టి పోయి మళ్లీ వాటి దగ్గరికి తిరిగి రావు.
|
4. Their young ones H1121 are in good liking H2492 , they grow up H7235 with corn H1250 ; they go forth H3318 , and return H7725 not H3808 unto them.
|
5. అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవడు? గంతులు వేసే గాడిద కట్లు విప్పిన వాడెవడు?
|
5. Who H4310 hath sent out H7971 the wild ass H6501 free H2670 ? or who H4310 hath loosed H6605 the bands H4147 of the wild ass H6171 ?
|
6. నేను అడివిని దానికి ఇల్లుగాను ఉప్పుపర్రను దానికి నివాసస్థలంగాను నియమించాను.
|
6. Whose H834 house H1004 I have made H7760 the wilderness H6160 , and the barren land H4420 his dwellings H4908 .
|
7. పట్టణపు రణగొణధ్వనులను చూసి అది తిరస్కారంగా నవ్వుతుంది. తోలేవాడి అదిలింపులు అది వినదు.
|
7. He scorneth H7832 the multitude H1995 of the city H7151 , neither H3808 regardeth H8085 he the crying H8663 of the driver H5065 .
|
8. పర్వతాల వరుస దానికి మేతభూమి. అన్ని రకాల పచ్చని మొలకలను అది వెతుక్కుంటుంది.
|
8. The range H3491 of the mountains H2022 is his pasture H4829 , and he searcheth H1875 after H310 every H3605 green thing H3387 .
|
9. అడివి దున్న నీకు సంతోషంగా ఊడిగం చేస్తుందా? అది నీ కొట్టంలో ఉండడానికి ఒప్పుకుంటుందా?
|
9. Will the unicorn H7214 be willing H14 to serve H5647 thee, or H518 abide H3885 by H5921 thy crib H18 ?
|
10. పగ్గం వేసి అడివి దున్నను నాగలి దున్నించ గలవా? దాన్ని తోలుకుపోయి పల్లాలను చదును చేయించగలవా?
|
10. Canst thou bind H7194 the unicorn H7214 with his band H5688 in the furrow H8525 ? or H518 will he harrow H7702 the valleys H6010 after H310 thee?
|
11. అది మహా బలిష్ఠమైనదని దాన్ని నువ్వు నమ్ముతావా? చెయ్యమని దానికి నీ పని అప్పగిస్తావా?
|
11. Wilt thou trust H982 him, because H3588 his strength H3581 is great H7227 ? or wilt thou leave H5800 thy labor H3018 to H413 him?
|
12. అది నీ ధాన్యాన్ని ఇంటికి తెస్తుందని దానిపై ఆధారపడతావా? కళ్ళంలో ఉన్న ధాన్యాన్ని అది పోగు చేస్తుందని నమ్ముతావా?
|
12. Wilt thou believe H539 him, that H3588 he will bring home H7725 thy seed H2233 , and gather H622 it into thy barn H1637 ?
|
13. నిప్పుకోడి గర్వంగా రెక్కలు ఆడిస్తుంది. కానీ అవి ప్రేమపూర్వకమైన రెక్కలా, ఈకలా?
|
13. Gavest thou the goodly H5965 wings H3671 unto the peacocks H7443 ? or H518 wings H84 and feathers H2624 unto the ostrich H5133 ?
|
14. లేదు సుమా, అది దాని గుడ్లు నేలపై పెడుతుంది. ఇసుకే వాటిని పొదుగుతుంది.
|
14. Which H3588 leaveth H5800 her eggs H1000 in the earth H776 , and warmeth H2552 them in H5921 dust H6083 ,
|
15. దేని పాదమైనా వాటిని తొక్కుతుందని అయినా, అడవిజంతువు ఏదైనా వాటిని చితకగొడుతుందేమోనని అయినా అది మర్చిపోతుంది.
|
15. And forgetteth H7911 that H3588 the foot H7272 may crush H2115 them , or that the wild H7704 beast H2416 may break H1758 them.
|
16. తన పిల్లలు తనవి కానట్టు వాటి పట్ల అది కఠినంగా ఉంటుంది. దాని కష్టం వ్యర్థమైపోయినా దానికి చింత లేదు.
|
16. She is hardened H7188 against her young ones H1121 , as though they were not H3808 hers : her labor H3018 is in vain H7385 without H1097 fear H6343 ;
|
17. దేవుడు దాన్ని తెలివిలేనిదిగా చేశాడు. ఆయన దానికి వివేచనాశక్తి ఇవ్వలేదు.
|
17. Because H3588 God H433 hath deprived H5382 her of wisdom H2451 , neither H3808 hath he imparted H2505 to her understanding H998 .
|
18. అది వడిగా పరిగెత్తితే గుర్రాన్ని, దానిపై స్వారీ చేసే వాణ్ణి చూసి హేళనగా నవ్వుతుంది.
|
18. What time H6256 she lifteth up herself H4754 on high H4791 , she scorneth H7832 the horse H5483 and his rider H7392 .
|
19. గుర్రానికి నువ్వు బలం ఇచ్చావా? జూలు వెంట్రుకలతో దాని మెడను నువ్వే కప్పావా?
|
19. Hast thou given H5414 the horse H5483 strength H1369 ? hast thou clothed H3847 his neck H6677 with thunder H7483 ?
|
20. మిడతవలె అది కదం తొక్కేలా చేశావా? దాని సకిలింపు ధ్వని భీకరం.
|
20. Canst thou make him afraid H7493 as a grasshopper H697 ? the glory H1935 of his nostrils H5170 is terrible H367 .
|
21. అది కాలు దువ్వి తన బలాన్నిబట్టి రేగిపోతుంది. అది ఆయుధాలను ఎదుర్కోడానికి ముందుకు దూకుతుంది.
|
21. He paweth H2658 in the valley H6010 , and rejoiceth H7797 in his strength H3581 : he goeth on H3318 to meet H7125 the armed men H5402 .
|
22. అది భయాన్ని వెక్కిరిస్తుంది. హడలిపోదు. కత్తిని చూసి వెనక్కి తగ్గదు.
|
22. He mocketh H7832 at fear H6343 , and is not H3808 frightened H2865 ; neither H3808 turneth he back H7725 from H4480 H6440 the sword H2719 .
|
23. దాని వీపుపై అంబుల పొది, తళతళలాడే ఈటెలు బల్లేలు గలగలలాడినప్పుడు,
|
23. The quiver H827 rattleth H7439 against H5921 him , the glittering H3851 spear H2595 and the shield H3591 .
|
24. పట్టరాని కోపంతో అది పరుగులు పెడుతుంది. అది భేరీనాదం విని ఉరకలు వేస్తుంది.
|
24. He swalloweth H1572 the ground H776 with fierceness H7494 and rage H7267 : neither H3808 believeth H539 he that H3588 it is the sound H6963 of the trumpet H7782 .
|
25. బాకా ధ్వని వినబడినప్పుడెల్లా అది హుంకరిస్తుంది. దూరం నుండి యుద్ధవాసన పసిగడుతుంది. సేనాధిపతుల సింహనాదాలను, కదనఘోషను వింటుంది.
|
25. He saith H559 among H1767 the trumpets H7782 , Ha, ha H1889 ; and he smelleth H7306 the battle H4421 afar off H4480 H7350 , the thunder H7482 of the captains H8269 , and the shouting H8643 .
|
26. డేగ నీ జ్ఞానం చేతనే ఎగురుతుందా? అది నీ ఆజ్ఞ వలననే తన రెక్కలు దక్షిణ దిక్కుకు చాస్తుందా?
|
26. Doth the hawk H5322 fly H82 by thy wisdom H4480 H998 , and stretch H6566 her wings H3671 toward the south H8486 ?
|
27. గరుడ పక్షి నీ ఆజ్ఞకు లోబడే ఆకాశవీధి కెక్కుతుందా? తన గూడును ఎత్తయిన చోట కట్టుకుంటుందా?
|
27. Doth the eagle H5404 mount up H1361 at H5921 thy command H6310 , and make her nest on high H7311 H7064 ?
|
28. అది కొండశిఖరాలపై నివసిస్తుంది. కొండకొనపై ఎవరూ ఎక్కలేని చోట గూడు కట్టుకుంటుంది.
|
28. She dwelleth H7931 and abideth H3885 on the rock H5553 , upon H5921 the crag H8127 of the rock H5553 , and the strong place H4686 .
|
29. అక్కడ నుండి తన ఎరను వెతుకుతుంది. దాని కళ్ళు దాన్ని దూరం నుండి కనిపెడతాయి.
|
29. From thence H4480 H8033 she seeketh H2658 the prey H400 , and her eyes H5869 behold H5027 afar off H4480 H7350 .
|
30. దాని పిల్లలు రక్తం తాగుతాయి. హతులైనవారు ఎక్కడ ఉంటారో అక్కడే అది ఉంటుంది. PE
|
30. Her young ones H667 also suck up H5966 blood H1818 : and where H834 the slain H2491 are , there H8033 is she H1931 .
|