|
|
1. {మంచి కాపరి గురించిన ఉపదేశం} (కీర్త 23; హెబ్రీ 13:20; 1పేతు 5:4) PS మీతో కచ్చితంగా చెబుతున్నాను, గొర్రెల దొడ్డిలోకి ప్రవేశ ద్వారం గుండా కాకుండా వేరే విధంగా ఎక్కి లోపలికి వచ్చేవాడు దొంగే, వాడు దోపిడీగాడే.
|
1. Verily G281 , verily G281 , I say G3004 unto you G5213 , He that entereth G1525 not G3361 by G1223 the G3588 door G2374 into G1519 the G3588 sheepfold G833 G4263 , but G235 climbeth up G305 some other way G237 , the same G1565 is G2076 a thief G2812 and G2532 a robber G3027 .
|
2. ప్రవేశ ద్వారం ద్వారా వచ్చేవాడు గొర్రెల కాపరి.
|
2. But G1161 he that entereth in G1525 by G1223 the G3588 door G2374 is G2076 the G3588 shepherd G4166 of the G3588 sheep G4263 .
|
3. అతని కోసం కాపలావాడు ద్వారం తెరుస్తాడు. గొర్రెలు అతని స్వరం వింటాయి. తన సొంత గొర్రెలను అతడు పేరు పెట్టి పిలిచి బయటకు నడిపిస్తాడు.
|
3. To him G5129 the G3588 porter G2377 openeth G455 ; and G2532 the G3588 sheep G4263 hear G191 his G846 voice G5456 : and G2532 he calleth G2564 his own G2398 sheep G4263 by G2596 name G3686 , and G2532 leadeth them out G1806 G846 .
|
4. తన సొంత గొర్రెలనన్నిటిని బయటకి ఎప్పుడు నడిపించినా, వాటికి ముందుగా అతడు నడుస్తాడు. అతని స్వరం గొర్రెలకు తెలుసు కాబట్టి అవి అతని వెంట నడుస్తాయి.
|
4. And G2532 when G3752 he putteth forth G1544 his own G2398 sheep G4263 , he goeth G4198 before G1715 them G846 , and G2532 the G3588 sheep G4263 follow G190 him G846 : for G3754 they know G1492 his G846 voice G5456 .
|
5. వేరేవారి స్వరం వాటికి తెలియదు కాబట్టి అవి వారి వెంట వెళ్ళకుండా పారిపోతాయి. PEPS
|
5. And G1161 a stranger G245 will they not G3364 follow G190 , but G235 will flee G5343 from G575 him G846 : for G3754 they know G1492 not G3756 the G3588 voice G5456 of strangers G245 .
|
6. యేసు ఈ ఉపమానం ద్వారా వారితో మాట్లాడాడు గాని ఆయన వారితో చెప్పిన ఈ సంగతులు వారికి అర్థం కాలేదు.
|
6. This G5026 parable G3942 spake G2036 Jesus G2424 unto them G846 : but G1161 they G1565 understood G1097 not G3756 what things G5101 they were G2258 which G3739 he spake G2980 unto them G846 .
|
7. అందుకు యేసు మళ్ళీ వారితో ఇలా అన్నాడు, “మీతో కచ్చితంగా చెబుతున్నాను, గొర్రెల ప్రవేశ ద్వారం నేనే.
|
7. Then G3767 said G2036 Jesus G2424 unto them G846 again G3825 , Verily G281 , verily G281 , I say G3004 unto you G5213 G3754 , I G1473 am G1510 the G3588 door G2374 of the G3588 sheep G4263 .
|
8. నా ముందు వచ్చిన వారంతా దొంగలు, దోపిడిగాళ్ళే. గొర్రెలు వారి మాట వినలేదు. PEPS
|
8. All G3956 that G3745 ever came G2064 before G4253 me G1700 are G1526 thieves G2812 and G2532 robbers G3027 : but G235 the G3588 sheep G4263 did not G3756 hear G191 them G846 .
|
9. నేనే ప్రవేశ ద్వారం, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశిస్తే వాడికి రక్షణ దొరుకుతుంది. వాడు లోపలికి వస్తూ బయటకి వెళ్తూ పచ్చికను కనుగొంటాడు.
|
9. I G1473 am G1510 the G3588 door G2374 : by G1223 me G1700 if G1437 any man G5100 enter in G1525 , he shall be saved G4982 , and G2532 shall go in G1525 and G2532 out G1831 , and G2532 find G2147 pasture G3542 .
|
10. దొంగ కేవలం దొంగతనం, హత్య, నాశనం చెయ్యడానికి మాత్రమే వస్తాడు. గొర్రెలకు జీవం కలగాలని, ఆ జీవం సమృద్ధిగా కలగాలని నేను వచ్చాను. PEPS
|
10. The G3588 thief G2812 cometh G2064 not G3756 , but G1508 for to G2443 steal G2813 , and G2532 to kill G2380 , and G2532 to destroy G622 : I G1473 am come G2064 that G2443 they might have G2192 life G2222 , and G2532 that they might have G2192 it more abundantly G4053 .
|
11. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కోసం తన ప్రాణం ఇస్తాడు.
|
11. I G1473 am G1510 the G3588 good G2570 shepherd G4166 : the G3588 good G2570 shepherd G4166 giveth G5087 his G846 life G5590 for G5228 the G3588 sheep G4263 .
|
12. జీతం కోసం పని చేసేవాడు కాపరిలాంటి వాడు కాదు. గొర్రెలు తనవి కావు కాబట్టి తోడేలు రావడం చూసి గొర్రెలను వదిలిపెట్టి పారిపోతాడు. తోడేలు ఆ గొర్రెలను పట్టుకుని చెదరగొడుతుంది.
|
12. But G1161 he that is a hireling G3411 , and G2532 not G3756 the G5607 shepherd G4166 , whose G3739 own G2398 the G3588 sheep G4263 are G1526 not G3756 , seeth G2334 the G3588 wolf G3074 coming G2064 , and G2532 leaveth G863 the G3588 sheep G4263 , and G2532 fleeth G5343 : and G2532 the G3588 wolf G3074 catcheth G726 them G846 , and G2532 scattereth G4650 the G3588 sheep G4263 .
|
13. జీతగాడు జీతం మాత్రమే కోరుకుంటాడు కాబట్టి గొర్రెలను పట్టించుకోకుండా పారిపోతాడు. PEPS
|
13. G1161 The G3588 hireling G3411 fleeth G5343 , because G3754 he is G2076 a hireling G3411 , and G2532 careth G3199 not G3756 for G4012 the G3588 sheep G4263 .
|
14. నేను గొర్రెలకు మంచి కాపరిని. నా గొర్రెలు నాకు తెలుసు. నా సొంత గొర్రెలకు నేను తెలుసు.
|
14. I G1473 am G1510 the G3588 good G2570 shepherd G4166 , and G2532 know G1097 my G1699 sheep, and G2532 am known G1097 of G5259 mine G1699 .
|
15. నా తండ్రికి నేను తెలుసు. నాకు నా తండ్రి తెలుసు. నా గొర్రెల కోసం ప్రాణం పెడతాను.
|
15. As G2531 the G3588 Father G3962 knoweth G1097 me G3165 , even so know I G2504 G1097 the G3588 Father G3962 : and G2532 I lay down G5087 my G3450 life G5590 for G5228 the G3588 sheep G4263 .
|
16. ఈ గొర్రెలశాలకు చెందని ఇతర గొర్రెలు నాకు ఉన్నాయి. వాటిని కూడా నేను తీసుకురావాలి. అవి నా స్వరం వింటాయి. అప్పుడు ఉండేది ఒక్క మంద, ఒక్క కాపరి. PEPS
|
16. And G2532 other G243 sheep G4263 I have G2192 , which G3739 are G2076 not G3756 of G1537 this G5026 fold G833 : them also G2548 I G3165 must G1163 bring G71 , and G2532 they shall hear G191 my G3450 voice G5456 ; and G2532 there shall be G1096 one G3391 fold G4167 , and one G1520 shepherd G4166 .
|
17. నా ప్రాణం మళ్ళీ పొందడానికి దాన్ని పెడుతున్నాను. అందుకే నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు.
|
17. Therefore G1223 G5124 doth my Father G3962 love G25 me G3165 , because G3754 I G1473 lay down G5087 my G3450 life G5590 , that G2443 I might take G2983 it G846 again G3825 .
|
18. నా ప్రాణాన్ని నానుంచి ఎవ్వరూ తీసివేయలేరు. నేను స్వయంగా నా ప్రాణం పెడుతున్నాను. దాన్ని పెట్టడానికి, తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉంది. ఈ ఆజ్ఞ నా తండ్రి నుంచి నేను పొందాను.” PEPS
|
18. No man G3762 taketh G142 it G846 from G575 me G1700 , but G235 I G1473 lay it down G5087 G846 of G575 myself G1683 . I have G2192 power G1849 to lay it down G5087 G846 , and G2532 I have G2192 power G1849 to take G2983 it G846 again G3825 . This G5026 commandment G1785 have I received G2983 of G3844 my G3450 Father G3962 .
|
19. ఈ మాటలవల్ల యూదుల్లో మళ్ళీ విభేదాలు వచ్చాయి.
|
19. There was G1096 a division G4978 therefore G3767 again G3825 among G1722 the G3588 Jews G2453 for G1223 these G5128 sayings G3056 .
|
20. వారిలో చాలా మంది, “ఇతనికి దయ్యం పట్టింది. ఇతను పిచ్చివాడు. ఇతని మాటలు మీరు ఎందుకు వింటున్నారు?” అన్నారు.
|
20. And G1161 many G4183 of G1537 them G846 said G3004 , He hath G2192 a devil G1140 , and G2532 is mad G3105 ; why G5101 hear G191 ye him G846 ?
|
21. ఇంకొంతమంది, “ఇవి దయ్యం పట్టినవాడి మాటలు కాదు. దయ్యం గుడ్డివారి కళ్ళు తెరవగలదా?” అన్నారు. యోహా 14:9; 20:28, 29 PEPS
|
21. Others G243 said G3004 , These G5023 are G2076 not G3756 the G3588 words G4487 of him that hath a devil G1139 . Can G1410 a G3361 devil G1140 open G455 the eyes G3788 of the blind G5185 ?
|
22. {యేసు తన దైవత్వాన్ని రూఢి పరచడం} PS ఆ తరువాత యెరూషలేములో ప్రతిష్ట పండగ వచ్చింది. అది చలికాలం.
|
22. And G1161 it was G1096 at G1722 Jerusalem G2414 the G3588 feast of the dedication G1456 , and G2532 it was G2258 winter G5494 .
|
23. అప్పుడు యేసు దేవాలయ ప్రాంగణంలో ఉన్న సొలొమోను మంటపంలో నడుస్తూ ఉండగా
|
23. And G2532 Jesus G2424 walked G4043 in G1722 the G3588 temple G2411 in G1722 Solomon G4672 's porch G4745 .
|
24. యూదులు ఆయన చుట్టూ చేరి ఆయనతో. “ఎంతకాలం మమ్మల్ని ఇలా సందేహంలో ఉంచుతావు? నువ్వు క్రీస్తువైతే మాతో స్పష్టంగా చెప్పు” అన్నారు. PEPS
|
24. Then G3767 came the Jews round about G2944 G3588 G2453 him G846 , and G2532 said G3004 unto him G846 , How long G2193 G4219 dost thou make us to doubt G142 G2257 G5590 ? If G1487 thou G4771 be G1488 the G3588 Christ G5547 , tell G2036 us G2254 plainly G3954 .
|
25. అందుకు యేసు వారితో ఇలా అన్నాడు, “నేను మీకు చెప్పాను గాని మీరు నమ్మడం లేదు. నా తండ్రి పేరిట నేను చేస్తున్న క్రియలు నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి.
|
25. Jesus G2424 answered G611 them G846 , I told G2036 you G5213 , and G2532 ye believed G4100 not G3756 : the G3588 works G2041 that G3739 I G1473 do G4160 in G1722 my G3450 Father G3962 's name G3686 , they G5023 bear witness G3140 of G4012 me G1700 .
|
26. అయినా, మీరు నా గొర్రెలు కానందువల్ల మీరు నమ్మడం లేదు.
|
26. But G235 ye G5210 believe G4100 not G3756 , because G1063 ye are G2075 not G3756 of G1537 my G1699 sheep G4263 , as G2531 I said G2036 unto you G5213 .
|
27. నా గొర్రెలు నా స్వరం వింటాయి, అవి నాకు తెలుసు, అవి నా వెంట వస్తాయి.
|
27. My G1699 sheep G4263 hear G191 my G3450 voice G5456 , and I G2504 know G1097 them G846 , and G2532 they follow G190 me G3427 :
|
28. నేను వాటికి శాశ్వత జీవం ఇస్తాను కాబట్టి అవి ఎప్పటికీ నశించిపోవు. వాటిని ఎవరూ నా చేతిలోనుంచి లాగేసుకోలేరు.
|
28. And I G2504 give G1325 unto them G846 eternal G166 life G2222 ; and G2532 they shall never G3364 G1519 G165 perish G622 , neither G2532 G3756 shall any G5100 man pluck G726 them G846 out of G1537 my G3450 hand G5495 .
|
29. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికన్నా గొప్పవాడు కాబట్టి నా తండ్రి చేతిలోనుంచి ఎవరూ వాటిని లాగేసుకోలేరు.
|
29. My G3450 Father G3962 , which G3739 gave G1325 them me G3427 , is G2076 greater G3187 than all G3956 ; and G2532 no G3762 man is able G1410 to pluck G726 them out of G1537 my G3450 Father G3962 's hand G5495 .
|
30. నేను, నా తండ్రి, ఒకటే!” PEPS
|
30. I G1473 and G2532 my Father G3962 are G2070 one G1520 .
|
31. అప్పుడు యూదులు ఆయనను కొట్టడానికి రాళ్ళు పట్టుకున్నారు.
|
31. Then G3767 the G3588 Jews G2453 took up G941 stones G3037 again G3825 to G2443 stone G3034 him G846 .
|
32. యేసు వారితో, “తండ్రి నుంచి ఎన్నో మంచి పనులు మీకు చూపించాను. వాటిలో ఏ మంచి పనినిబట్టి నన్ను రాళ్ళతో కొట్టాలని అనుకుంటున్నారు?” అన్నాడు.
|
32. Jesus G2424 answered G611 them G846 , Many G4183 good G2570 works G2041 have I showed G1166 you G5213 from G1537 my G3450 Father G3962 ; for G1223 which G4169 of those G846 works G2041 do ye stone G3034 me G3165 ?
|
33. అందుకు యూదులు, “నువ్వు మనిషివై ఉండి నిన్ను నీవు దేవుడుగా చేసుకుంటున్నావు. దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొడుతున్నాం. మంచి పనులు చేసినందుకు కాదు” అని ఆయనతో అన్నారు.
|
33. The G3588 Jews G2453 answered G611 him G846 , saying G3004 , For G4012 a good G2570 work G2041 we stone G3034 thee G4571 not G3756 ; but G235 for G4012 blasphemy G988 ; and G2532 because G3754 that thou G4771 , being G5607 a man G444 , makest G4160 thyself G4572 God G2316 .
|
34. యేసు వారికి జవాబిస్తూ ఇలా అన్నాడు, “ ‘మీరు దేవుళ్ళని నేనన్నాను’ అని మీ ధర్మశాస్త్రంలో రాసి లేదా?
|
34. Jesus G2424 answered G611 them G846 , Is G2076 it not G3756 written G1125 in G1722 your G5216 law G3551 , I G1473 said G2036 , Ye are G2075 gods G2316
|
35. లేఖనం వ్యర్థం కాదు. దేవుని వాక్కు ఎవరికి వచ్చిందో, వారిని ఆయన దేవుళ్ళని పిలిస్తే,
|
35. If G1487 he called G2036 them G1565 gods G2316 , unto G4314 whom G3739 the G3588 word G3056 of God G2316 came G1096 , and G2532 the G3588 Scripture G1124 cannot G1410 G3756 be broken G3089 ;
|
36. తండ్రి పవిత్రంగా ఈ లోకంలోకి పంపినవాడు ‘నేను దేవుని కుమారుణ్ణి’ అని అంటే ‘నువ్వు దేవదూషణ చేస్తున్నావు’ అని మీరు అంటారా?
|
36. Say G3004 ye G5210 of him, whom G3739 the G3588 Father G3962 hath sanctified G37 , and G2532 sent G649 into G1519 the G3588 world G2889 , Thou blasphemest G987 ; because G3754 I said G3004 , I am G1510 the Son G5207 of God G2316 ?
|
37. నేను నా తండ్రి పనులు చెయ్యకపోతే నన్ను నమ్మకండి.
|
37. If G1487 I do G4160 not G3756 the G3588 works G2041 of my G3450 Father G3962 , believe G4100 me G3427 not G3361 .
|
38. అయితే, నేను నా తండ్రి పనులు చేస్తూ ఉంటే, మీరు నన్ను నమ్మకపోయినా, తండ్రి నాలోను నేను తండ్రిలోను ఉన్నామని మీరు తెలుసుకుని అర్థం చేసుకునేందుకు ఆ పనులను నమ్మండి.”
|
38. But G1161 if G1487 I do G4160 , though G2579 ye believe G4100 not G3361 me G1698 , believe G4100 the G3588 works G2041 : that G2443 ye may know G1097 , and G2532 believe G4100 , that G3754 the G3588 Father G3962 is in G1722 me G1698 , and I G2504 in G1722 him G846 .
|
39. వారు మళ్ళీ ఆయనను పట్టుకోవాలనుకున్నారు గాని ఆయన వారి చేతిలో నుండి తప్పించుకున్నాడు. PEPS
|
39. Therefore G3767 they sought G2212 again G3825 to take G4084 him G846 : but G2532 he escaped G1831 out of G1537 their G846 hand G5495 ,
|
40. యేసు మళ్ళీ యొర్దాను నది అవతలికి వెళ్ళి అక్కడే ఉన్నాడు. యోహాను మొదట బాప్తిసం ఇస్తూ ఉన్న స్థలం ఇదే.
|
40. And G2532 went away G565 again G3825 beyond G4008 Jordan G2446 into G1519 the G3588 place G5117 where G3699 John G2491 at first G4412 baptized G2258 G907 ; and G2532 there G1563 he abode G3306 .
|
41. చాలా మంది ఆయన దగ్గరికి వచ్చారు. వారు, “యోహాను ఏ సూచక క్రియలూ చేయలేదు గాని ఈయన గురించి యోహాను చెప్పిన సంగతులన్నీ నిజమే” అన్నారు.
|
41. And G2532 many G4183 resorted G2064 unto G4314 him G846 , and G2532 said G3004 , John G2491 did G4160 no G3762 miracle G4592 : but G1161 all things G3956 that G3745 John G2491 spake G2036 of G4012 this man G5127 were G2258 true G227 .
|
42. అక్కడ చాలా మంది యేసుని నమ్మారు. PE
|
42. And G2532 many G4183 believed G4100 on G1519 him G846 there G1563 .
|