|
|
1. {అంధ మత నాయకులను యేసు విమర్శించడం} (మార్కు 8:1-12) PS అప్పుడు పరిసయ్యులు, సద్దూకయ్యులు వచ్చి ఆయనను పరీక్షించడానికి తమ కోసం పరలోకం నుండి ఒక అద్భుతం చెయ్యమని అడిగారు.
|
1. G2532 The G3588 Pharisees G5330 also G2532 with the Sadducees G4523 came G4334 , and tempting G3985 desired G1905 him G846 that he would show G1925 them G846 a sign G4592 from G1537 heaven G3772 .
|
2. ఆయన వారితో ఇలా అన్నాడు, “సాయంకాలం ఆకాశం ఎర్రగా ఉంది కాబట్టి వర్షం కురవదనీ,
|
2. G1161 He G3588 answered G611 and said G2036 unto them G846 , When it is G1096 evening G3798 , ye say G3004 , It will be fair weather G2105 : for G1063 the G3588 sky G3772 is red G4449 .
|
3. అదే ఆకాశం ఉదయం ఎర్రగా, మబ్బులతో ఉంది కాబట్టి గాలివాన వస్తుందనీ మీరు చెబుతారు కదా. ఆకాశంలోని సూచనలు మీకు తెలుసు గాని ఈ కాలాల సూచనలు మాత్రం గుర్తించలేరు. PEPS
|
3. And G2532 in the morning G4404 , It will be foul weather G5494 today G4594 : for G1063 the G3588 sky G3772 is red G4449 and G2532 lowering G4768 . O ye hypocrites G5273 , ye can G1097 discern G1252 the G3588 G3303 face G4383 of the G3588 sky G3772 ; but G1161 can G1410 ye not G3756 discern the G3588 signs G4592 of the G3588 times G2540 ?
|
4. సూచక క్రియలు అడిగే ఈ తరం దుష్టత్వంతో, వ్యభిచారంతో నిండి ఉంది. యోనా ప్రవక్త గురించినది తప్ప మరే సూచనా ఈ తరానికి ఇవ్వడం జరగదు.” ఆ వెంటనే ఆయన వారిని విడిచి వెళ్ళిపోయాడు. PEPS
|
4. A wicked G4190 and G2532 adulterous G3428 generation G1074 seeketh after G1934 a sign G4592 ; and G2532 there shall no G3756 sign G4592 be given G1325 unto it G846 , but G1508 the G3588 sign G4592 of the G3588 prophet G4396 Jonah G2495 . And G2532 he left G2641 them G846 , and departed G565 .
|
5. అవతలి ఒడ్డుకు చేరినప్పుడు ఆయన శిష్యులు రొట్టెలు తెచ్చుకోవడం మర్చిపోయారు.
|
5. And G2532 when his G846 disciples G3101 were come G2064 to G1519 the G3588 other side G4008 , they had forgotten G1950 to take G2983 bread G740 .
|
6. అప్పుడు యేసు, “పరిసయ్యులు, సద్దూకయ్యులు అనే పొంగజేసే పిండిని గురించి జాగ్రత్త పడండి” అని వారితో అన్నాడు.
|
6. Then G1161 Jesus G2424 said G2036 unto them G846 , Take heed G3708 and G2532 beware G4337 of G575 the G3588 leaven G2219 of the G3588 Pharisees G5330 and G2532 of the Sadducees G4523 .
|
7. అయితే శిష్యులు “మనం రొట్టెలు తేకపోవడం చేత ఇలా అన్నాడు” అని తమలో తాము చర్చించుకున్నారు.
|
7. And G1161 they G3588 reasoned G1260 among G1722 themselves G1438 , saying G3004 , It is because G3754 we have taken G2983 no G3756 bread G740 .
|
8. యేసుకు అది తెలిసి, “అల్పవిశ్వాసులారా, మీరు రొట్టెలు తీసుకు రాని విషయం గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? PS
|
8. Which when G1161 Jesus G2424 perceived G1097 , he said G2036 unto them G846 , O ye of little faith G3640 , why G5101 reason G1260 ye among G1722 yourselves G1438 , because G3754 ye have brought G2983 no G3756 bread G740 ?
|
9. {పొంగజేసే పదార్ధం వివరణ} (మార్కు 13-21) PS “మీరింకా గ్రహించలేదా? ఐదు రొట్టెలు ఐదు వేలమంది తిన్న తరువాత ఎన్ని పెద్ద గంపలు ఎత్తారో,
|
9. Do ye not yet G3768 understand G3539 , neither G3761 remember G3421 the G3588 five G4002 loaves G740 of the G3588 five thousand G4000 , and G2532 how many G4214 baskets G2894 ye took up G2983 ?
|
10. ఏడు రొట్టెలు నాలుగు వేలమంది తిన్న తరువాత ఎన్ని పెద్ద గంపలు ఎత్తారో అవేమీ మీకు గుర్తు లేదా?
|
10. Neither G3761 the G3588 seven G2033 loaves G740 of the G3588 four thousand G5070 , and G2532 how many G4214 baskets G4711 ye took up G2983 ?
|
11. నేను మీతో మాట్లాడింది రొట్టెలను గురించి కాదని ఎందుకు గ్రహించరు? పరిసయ్యులు, సద్దూకయ్యులు అనే పొంగజేసేపిండిని గురించి జాగ్రత్త పడండి” అని వారితో చెప్పాడు.
|
11. How G4459 is it that ye do not G3756 understand G3539 that G3754 I spake G2036 it not G3756 to you G5213 concerning G4012 bread G740 , that ye should beware G4337 of G575 the G3588 leaven G2219 of the G3588 Pharisees G5330 and G2532 of the Sadducees G4523 ?
|
12. అప్పుడు రొట్టెల్లో వాడే పొంగజేసే పదార్థాన్ని గురించి కాక పరిసయ్యులు, సద్దూకయ్యులు చేసే బోధ విషయంలో జాగ్రత్తపడమని ఆయన తమతో చెప్పాడని శిష్యులు గ్రహించారు. PS
|
12. Then G5119 understood G4920 they how G3754 that he bade G2036 them not G3756 beware G4337 of G575 the G3588 leaven G2219 of bread G740 , but G235 of G575 the G3588 doctrine G1322 of the G3588 Pharisees G5330 and G2532 of the Sadducees G4523 .
|
13. {పేతురు విశ్వాస ప్రకటన} (మార్కు 8:27-30; లూకా 9:18-21; యోహా 6:68-69) PS యేసు కైసరయ ఫిలిప్పీ ప్రాంతాలకు వచ్చినపుడు తన శిష్యులను ఇలా అడిగాడు, “మనుష్య కుమారుడు ఎవరని ప్రజలు మాట్లాడుకుంటున్నారు?”
|
13. When G1161 Jesus G2424 came G2064 into G1519 the G3588 coasts G3313 of Caesarea G2542 Philippi G5376 , he asked G2065 his G848 disciples G3101 , saying G3004 , Whom G5101 do men G444 say G3004 that I G3165 the G3588 Son G5207 of man G444 am G1511 ?
|
14. వారు, “కొందరేమో నీవు బాప్తిసమిచ్చే యోహానువనీ, మరి కొందరు ఏలీయావనీ, కొందరు యిర్మీయావనీ, లేక ఎవరో ఒక ప్రవక్తవనీ అనుకొంటున్నారు” అన్నారు.
|
14. And G1161 they G3588 said G2036 , Some G3588 say G3303 that thou art John G2491 the G3588 Baptist G910 G1161 : some G243 , Elijah G2243 ; and G1161 others G2087 , Jeremiah G2408 , or G2228 one G1520 of the G3588 prophets G4396 .
|
15. “అయితే మీరు నేనెవరినని భావిస్తున్నారు?” అని వారిని అడిగాడు.
|
15. He saith G3004 unto them G846 , But G1161 whom G5101 say G3004 ye G5210 that I G3165 am G1511 ?
|
16. వెంటనే సీమోను పేతురు, “నీవు అభిషిక్తుడివి! సజీవుడైన దేవుని కుమారుడివి!” అని చెప్పాడు. ‘సంఘము’ మొట్టమొదటి ప్రస్తావన PEPS
|
16. And G1161 Simon G4613 Peter G4074 answered G611 and said G2036 , Thou G4771 art G1488 the G3588 Christ G5547 , the G3588 Son G5207 of the living G2198 God G2316 .
|
17. అందుకు యేసు అతనితో ఇలా అన్నాడు, “యోనా కుమారా, సీమోనూ, నీవు ధన్యుడివి. ఎందుకంటే ఈ సత్యం నీకు వెల్లడి చేసింది పరలోకంలోని నా తండ్రే గాని మానవ మాత్రులు కాదు.
|
17. And G2532 Jesus G2424 answered G611 and said G2036 unto him G846 , Blessed G3107 art G1488 thou, Simon G4613 Bar G920 -jona: for G3754 flesh G4561 and G2532 blood G129 hath not G3756 revealed G601 it unto thee G4671 , but G235 my G3450 Father G3962 which G3588 is in G1722 heaven G3772 .
|
18. ఇంకో విషయం, నీవు పేతురువి. ఈ బండమీద నా సంఘాన్ని నిర్మిస్తాను. పాతాళ లోకపు ద్వారాలు దాన్ని ఎదిరించి నిలబడలేవు.
|
18. And G1161 I say also G2504 G3004 unto thee G4671 , That G3754 thou G4771 art G1488 Peter G4074 , and G2532 upon G1909 this G5026 rock G4073 I will build G3618 my G3450 church G1577 ; and G2532 the gates G4439 of hell G86 shall not G3756 prevail against G2729 it G846 .
|
19. పరలోక రాజ్యపు తాళాలు నీకిస్తాను. నీవు భూమి మీద దేనిని బంధిస్తావో దాన్ని పరలోకంలో బంధించడం, దేనిని విడిపిస్తావో దాన్ని పరలోకంలో విడిపించడం జరుగుతుంది.”
|
19. And G2532 I will give G1325 unto thee G4671 the G3588 keys G2807 of the G3588 kingdom G932 of heaven G3772 : and G2532 whatsoever G3739 G1437 thou shalt bind G1210 on G1909 earth G1093 shall G2071 be bound G1210 in G1722 heaven G3772 : and G2532 whatsoever G3739 G1437 thou shalt loose G3089 on G1909 earth G1093 shall be G2071 loosed G3089 in G1722 heaven G3772 .
|
20. అప్పుడు తానే క్రీస్తు అని ఎవరికీ చెప్పవద్దని యేసు తన శిష్యులకు గట్టిగా ఆజ్ఞాపించాడు. PS
|
20. Then G5119 charged G1291 he his G848 disciples G3101 that G2443 they should tell G2036 no man G3367 that G3752 he G846 was G2076 Jesus G2424 the G3588 Christ G5547 .
|
21. {క్రీస్తు తన మరణ పునరుత్థానాలను ముందుగా చెప్పడం} (మార్కు 8:31-38; లూకా 9:22-27) PS అప్పటినుంచి యేసు తాను యెరూషలేము వెళ్ళి అక్కడి పెద్దల, ప్రధాన యాజకుల, ధర్మశాస్త్ర పండితుల చేతుల్లో అనేక హింసలు పొంది, చనిపోయి, మూడవ రోజు తిరిగి సజీవంగా లేవడం తప్పనిసరి అని తన శిష్యులతో చెప్పడం మొదలుపెట్టాడు.
|
21. From G575 that time forth G5119 began G756 Jesus G2424 to show G1166 unto his G848 disciples G3101 , how that G3754 he G846 must G1163 go G565 unto G1519 Jerusalem G2414 , and G2532 suffer G3958 many things G4183 of G575 the G3588 elders G4245 and G2532 chief priests G749 and G2532 scribes G1122 , and G2532 be killed G615 , and G2532 be raised again G1453 the G3588 third G5154 day G2250 .
|
22. అప్పుడు పేతురు ఆయన్ని ఒక పక్కకి తీసుకు పోయి, “ప్రభూ, అది నీకు దూరమవుతుంది, నీకలా ఎప్పటికీ జరగదు” అని గద్దింపుగా అన్నాడు.
|
22. Then G2532 Peter G4074 took G4355 him G846 , and began G756 to rebuke G2008 him G846 , saying G3004 , Be it far G2436 from thee G4671 , Lord G2962 : this G5124 shall not G3364 be G2071 unto thee G4671 .
|
23. అయితే యేసు పేతురు వైపు తిరిగి, “సాతానూ, నా వెనక్కి పో! నువ్వు నాకు దారిలో అడ్డుబండగా ఉన్నావు. నీవు దేవుని సంగతులపై కాక మనుషుల సంగతుల పైనే మనసు పెడుతున్నావు” అన్నాడు. PEPS
|
23. But G1161 he G3588 turned G4762 , and said G2036 unto Peter G4074 , Get G5217 thee behind G3694 me G3450 , Satan G4567 : thou art G1488 an offense G4625 unto me G3450 : for G3754 thou savorest G5426 not G3756 the things G3588 that be of God G2316 , but G235 those G3588 that be of men G444 .
|
24. అప్పుడు యేసు తన శిష్యులతో, “ఎవరైనా నాతో కలిసి నడవాలనుకుంటే, వాడు తనను తాను తిరస్కరించుకుని, తన సిలువను మోసుకుంటూ రావాలి.
|
24. Then G5119 said G2036 Jesus G2424 unto his G848 disciples G3101 , If any G1536 man will G2309 come G2064 after G3694 me G3450 , let him deny G533 himself G1438 , and G2532 take up G142 his G848 cross G4716 , and G2532 follow G190 me G3427 .
|
25. తన ప్రాణాన్ని కాపాడుకోవాలని చూసేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. నా కోసం తన ప్రాణాన్ని కోల్పోయేవాడు దాన్ని దక్కించుకుంటాడు.
|
25. For G1063 whosoever G3739 G302 will G2309 save G4982 his G848 life G5590 shall lose G622 it G846 : and G1161 whosoever G3739 G302 will lose G622 his G848 life G5590 for my sake G1752 G1700 shall find G2147 it G846 .
|
26. ఒక మనిషి ఈ ప్రపంచమంతా సంపాదించుకుని తన ప్రాణాన్ని కోల్పోతే అతనికేం లాభం? తన ప్రాణానికి బదులుగా మనిషి దేనిని ఇవ్వగలడు? PEPS
|
26. For G1063 what G5101 is a man G444 profited G5623 , if G1437 he shall gain G2770 the G3588 whole G3650 world G2889 , and G2532 lose G2210 his own G848 soul G5590 ? or G2228 what G5101 shall a man G444 give G1325 in exchange G465 for his G848 soul G5590 ?
|
27. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమతో దూతలను తోడుకుని వస్తాడు. అప్పుడు ఆయన ప్రతి వ్యక్తికీ వాడు చేసిన పనుల ప్రకారం ప్రతిఫలం ఇస్తాడు.
|
27. For G1063 the G3588 Son G5207 of man G444 shall G3195 come G2064 in G1722 the G3588 glory G1391 of his G848 Father G3962 with G3326 his G848 angels G32 ; and G2532 then G5119 he shall reward G591 every man G1538 according G2596 to his G848 works G4234 .
|
28. నేను మీతో కచ్చితంగా చెబుతున్నదేమంటే, ఇక్కడ నిలబడి ఉన్నవారిలో కొంతమంది మనుష్య కుమారుడు తన రాజ్యంతో రావడం చూసేవరకూ మరణించరు” అని చెప్పాడు. PE
|
28. Verily G281 I say G3004 unto you G5213 , There be G1526 some G5100 standing G2476 here G5602 , which G3748 shall not G3361 taste G1089 of death G2288 , till G2193 G302 they see G1492 the G3588 Son G5207 of man G444 coming G2064 in G1722 his G848 kingdom G932 .
|