|
|
1. రాజు హృదయం యెహోవా చేతిలో కాలవల్లాగా ఉంది. ఆయన తన ఇష్ట ప్రకారం దాన్ని మళ్ళిస్తాడు. PEPS
|
1. The king H4428 's heart H3820 is in the hand H3027 of the LORD H3068 , as the rivers H6388 of water H4325 : he turneth H5186 it whithersoever H5921 H3605 H834 he will H2654 .
|
2. ఒకడు ఎన్నుకున్న మార్గం అది ఎలాటిదైనా సరే, తన దృష్టికది న్యాయం గానే కనిపిస్తుంది. హృదయాలను పరిశీలించేది యెహోవాయే. PEPS
|
2. Every H3605 way H1870 of a man H376 is right H3477 in his own eyes H5869 : but the LORD H3068 pondereth H8505 the hearts H3826 .
|
3. బలులు అర్పించడం కంటే నీతిన్యాయాలను అనుసరించి నడచు కోవడం యెహోవాకు ప్రీతికరం. PEPS
|
3. To do H6213 justice H6666 and judgment H4941 is more acceptable H977 to the LORD H3068 than sacrifice H4480 H2077 .
|
4. అహంకారం గర్విష్టి హృదయం భక్తిహీనులు వర్ధిల్లడం పాపం. PEPS
|
4. A high H7312 look H5869 , and a proud H7342 heart H3820 , and the plowing H5215 of the wicked H7563 , is sin H2403 .
|
5. శ్రద్ధగలవారి ఆలోచనలు లాభాన్ని తెస్తాయి. తొందరపాటుగా పనిచేసే వాడికి నష్టమే. PEPS
|
5. The thoughts H4284 of the diligent H2742 tend only H389 to plenteousness H4195 ; but of every one H3605 that is hasty H213 only H389 to want H4270 .
|
6. అబద్ధాలాడి ధనం సంపాదించుకోవడం మరణ సమయంలో కొన ఊపిరితో సమానం. PEPS
|
6. The getting H6467 of treasures H214 by a lying H8267 tongue H3956 is a vanity H1892 tossed to and fro H5086 of them that seek H1245 death H4194 .
|
7. భక్తిహీనులకు న్యాయం గిట్టదు. వారు చేసే దౌర్జన్యమే వారిని కొట్టుకు పోయేలా చేస్తుంది. PEPS
|
7. The robbery H7701 of the wicked H7563 shall destroy H1641 them; because H3588 they refuse H3985 to do H6213 judgment H4941 .
|
8. దోషంతో నిండిన వాడి మార్గం వంకర మార్గం. పవిత్రులు రుజుమార్గంలో నడుచుకుంటారు. PEPS
|
8. The way H1870 of man H376 is froward H2019 and strange H2054 : but as for the pure H2134 , his work H6467 is right H3477 .
|
9. గయ్యాళితో భవంతిలో ఉండడం కంటే మిద్దెపై ఒక మూలన నివసించడం మేలు. PEPS
|
9. It is better H2896 to dwell H3427 in H5921 a corner H6438 of the housetop H1406 , than with a brawling H4079 woman H4480 H802 in a wide H2267 house H1004 .
|
10. భక్తిలేని వాడి మనస్సు అస్తమానం కీడు చేయాలని చూస్తుంటుంది. అతని పొరుగు వాడికి అతని కన్నుల్లో దయ ఎంతమాత్రం కనిపించదు. PEPS
|
10. The soul H5315 of the wicked H7563 desireth H183 evil H7451 : his neighbor H7453 findeth no H3808 favor H2603 in his eyes H5869 .
|
11. అపహాసకుడికి శిక్ష రావడం చూసి ఆజ్ఞాని బుద్ధి తెచ్చుకుంటాడు. ఉపదేశం మూలంగా జ్ఞానం గలవాడి తెలివి పెరుగుతుంది. PEPS
|
11. When the scorner H3887 is punished H6064 , the simple H6612 is made wise H2449 : and when the wise H2450 is instructed H7919 , he receiveth H3947 knowledge H1847 .
|
12. న్యాయం చేసే వాడు భక్తిహీనుల ఇల్లు ఏమైపోతున్నదో కనిపెట్టి చూస్తుంటాడు. దుర్మార్గులను ఆయన పడగొట్టి నాశనం చేస్తాడు. PEPS
|
12. The righteous H6662 man wisely considereth H7919 the house H1004 of the wicked H7563 : but God overthroweth H5557 the wicked H7563 for their wickedness H7451 .
|
13. దరిద్రుల మొర వినకుండా చెవులు మూసుకునేవాడు తాను మొర్ర పెట్టే సమయంలో దేవుడు దాన్ని వినిపించుకోడు. PEPS
|
13. Whoso stoppeth H331 his ears H241 at the cry H4480 H2201 of the poor H1800 , he also H1571 shall cry H7121 himself H1931 , but shall not H3808 be heard H6030 .
|
14. చాటున ఇచ్చిన కానుక కోపాన్ని చల్లారుస్తుంది. రహస్యంగా ఇచ్చిన బహుమానం తీవ్ర కోపాన్ని సైతం శాంతింప జేస్తుంది. PEPS
|
14. A gift H4976 in secret H5643 pacifieth H3711 anger H639 : and a reward H7810 in the bosom H2436 strong H5794 wrath H2534 .
|
15. న్యాయ క్రియలు చేయడం నీతిపరుడికి సంతోషం. పాపాత్ముడికి అది భయంకరం. PEPS
|
15. It is joy H8057 to the just H6662 to do H6213 judgment H4941 : but destruction H4288 shall be to the workers H6466 of iniquity H205 .
|
16. వివేకమార్గం తప్పి తిరిగేవాడు ప్రేతాత్మల గుంపులో కాపురముంటాడు. PEPS
|
16. The man H120 that wandereth H8582 out of the way H4480 H1870 of understanding H7919 shall remain H5117 in the congregation H6951 of the dead H7496 .
|
17. సుఖభోగాల్లో వాంఛ గలవాడు దరిద్రుడౌతాడు. ద్రాక్షారసం, నూనెల కోసం వెంపర్లాడే వాడికి ఐశ్వర్యం కలగదు. PEPS
|
17. He that loveth H157 pleasure H8057 shall be a poor H4270 man H376 : he that loveth H157 wine H3196 and oil H8081 shall not H3808 be rich H6238 .
|
18. నీతిపరుని కోసం దుర్మార్గులు విడుదల వెలగా ఉంటారు. యథార్థవంతులకు ప్రతిగా విశ్వాస ఘాతకులు పరిహారంగా ఉంటారు. PEPS
|
18. The wicked H7563 shall be a ransom H3724 for the righteous H6662 , and the transgressor H898 for H8478 the upright H3477 .
|
19. ప్రాణం విసికించే జగడగొండి దానితో కాపురం చెయ్యడం కంటే ఎడారిలో నివసించడం మేలు. PEPS
|
19. It is better H2896 to dwell H3427 in the wilderness H776 H4057 , than with a contentious H4079 and an angry H3708 woman H4480 H802 .
|
20. విలువైన నిధులు, నూనె జ్ఞానుల ఇళ్ళలో ఉంటాయి. బుద్ధిహీనుడు వాటిని నిర్లక్షంగా ఖర్చు చేస్తాడు. PEPS
|
20. There is treasure H214 to be desired H2530 and oil H8081 in the dwelling H5116 of the wise H2450 ; but a foolish H3684 man H120 spendeth it up H1104 .
|
21. నీతిగా దయగా ఉండే వాడు జీవాన్ని, నీతిని ఘనతను పొందుతాడు. అతడు సరైన నిర్ణయాలు చేస్తాడు. PEPS
|
21. He that followeth H7291 after righteousness H6666 and mercy H2617 findeth H4672 life H2416 , righteousness H6666 , and honor H3519 .
|
22. జ్ఞానవంతుడు పరాక్రమశాలుల నగరం పై దాడి చేస్తాడు. అతడు దాని భద్రమైన కోటను కూలదోస్తాడు. PEPS
|
22. A wise H2450 man scaleth H5927 the city H5892 of the mighty H1368 , and casteth down H3381 the strength H5797 of the confidence H4009 thereof.
|
23. నోటిని నాలుకను కాపాడుకునేవాడు ఇబ్బందుల నుండి తనను కాపాడుకుంటాడు. PEPS
|
23. Whoso keepeth H8104 his mouth H6310 and his tongue H3956 keepeth H8104 his soul H5315 from troubles H4480 H6869 .
|
24. అహంకారి, గర్విష్టి-అతనికి అపహాసకుడు అని పేరు. అలాంటివాడు గర్వంతో మిడిసి పడతాడు. PEPS
|
24. Proud H2086 and haughty H3093 scorner H3887 is his name H8034 , who dealeth H6213 in proud H2087 wrath H5678 .
|
25. సోమరిపోతు చేతులు పనిచేయవు. వాడి కోరికలే వాడికి చావు తెచ్చిపెడతాయి. PEPS
|
25. The desire H8378 of the slothful H6102 killeth H4191 him; for H3588 his hands H3027 refuse H3985 to labor H6213 .
|
26. రోజంతా అతనిలో ఆశలు ఊరుతూనే ఉంటాయి. యథార్థంగా ప్రవర్తించేవాడు వెనుదీయకుండా ఇస్తూనే ఉంటాడు. PEPS
|
26. He coveteth H183 greedily H8378 all H3605 the day H3117 long : but the righteous H6662 giveth H5414 and spareth H2820 not H3808 .
|
27. దుష్టులర్పించే బలులు అసహ్యం. ఆ బలులు వారు దురాలోచనతో అర్పిస్తే అవి మరింకెంత అసహ్యమో గదా. PEPS
|
27. The sacrifice H2077 of the wicked H7563 is abomination H8441 : how much more H637 H3588 , when he bringeth H935 it with a wicked mind H2154 ?
|
28. అబద్ధసాక్షి నాశనమై పోతాడు. శ్రద్ధగా వినేవాడు పలికే మాటలు శాశ్వతంగా నిలిచి ఉంటాయి. PEPS
|
28. A false H3577 witness H5707 shall perish H6 : but the man H376 that heareth H8085 speaketh H1696 constantly H5331 .
|
29. దుర్మార్గుడు ముఖం మాడ్చుకుంటాడు. యథార్థవంతుడు తన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకుంటాడు. PEPS
|
29. A wicked H7563 man H376 hardeneth H5810 his face H6440 : but as for the upright H3477 , he H1931 directeth H995 his way H1870 .
|
30. యెహోవాకు విరోధమైన జ్ఞానంగానీ వివేచనగానీ ఆలోచనగానీ నిలవదు. PEPS
|
30. There is no H369 wisdom H2451 nor H369 understanding H8394 nor H369 counsel H6098 against H5048 the LORD H3068 .
|
31. యుద్ధదినానికి గుర్రాన్ని సిద్ధపరుస్తారు. అయితే విజయం యెహోవాదే. PE
|
31. The horse H5483 is prepared H3559 against the day H3117 of battle H4421 : but safety H8668 is of the LORD H3068 .
|