Bible Books

:

1. {నిబంధనను యోషీయా పునరుద్ధరణ} (23:1-3; 2దిన 34:29-32) PS అప్పుడు రాజు యూదా పెద్దలనందర్నీ, యెరూషలేము పెద్దలనందర్నీ తన దగ్గరికి పిలిపించి,
2. యూదా వాళ్ళందర్నీ, యెరూషలేము కాపురస్థులందర్నీ, యాజకులను, ప్రవక్తలను, తక్కువ వాళ్లైనా, గొప్ప వాళ్లైనా, ప్రజలందర్నీ పిలిచి, యెహోవా మందిరానికి వచ్చి వారు వింటూ ఉన్నప్పుడు, యెహోవా మందిరంలో దొరకిన నిబంధన గ్రంథంలో ఉన్న మాటలన్నీ చదివించాడు. PEPS
3. రాజు ఒక స్తంభం దగ్గర నిలబడి, యెహోవా మార్గాల్లో నడచి, ఆయన ఆజ్ఞలను, కట్టడలను శాసనాలను పూర్ణహృదయంతో, పూర్ణాత్మతో పాటించి, గ్రంథంలో రాసి ఉన్న నిబంధన సంబంధమైన మాటలన్నీ నెరవేరుస్తామని యెహోవా సన్నిధిలో నిబంధన చేశాడు. ప్రజలందరూ నిబంధనకు సమ్మతించారు. PEPS
4. రాజు బయలు దేవుడికీ, అషేరా దేవికీ, నక్షత్రాలకూ తయారు చేసిన వస్తువులన్నీ యెహోవా ఆలయంలోనుంచి బయటకు తీసుకు రావాలని ప్రధానయాజకుడు హిల్కీయాకు, రెండో వరుస యాజకులకు, ద్వారపాలకులకు ఆజ్ఞ ఇచ్చాడు. హిల్కీయా వాటిని యెరూషలేము బయట కిద్రోను పొలంలో తగలబెట్టి, బూడిద బేతేలు ఊరికి పంపేశాడు.
5. ఇంకా యూదా పట్టణాల్లో ఉన్న ఉన్నత స్థలాల్లో, యెరూషలేము చుట్టూ ఉన్న ప్రదేశాల్లో ధూపం వెయ్యడానికి యూదా రాజులు నియమించిన అర్చకులను అంటే బయలుకు, సూర్యచంద్రులకు, గ్రహాలకు, నక్షత్రాలకు ధూపం వేసే వాళ్ళను అతడు తొలగించాడు. PEPS
6. యెహోవా మందిరంలో ఉన్న అషేరాదేవి రూపాన్ని యెరూషలేము బయట ఉన్న కిద్రోను వాగు దగ్గరికి తెప్పించి, కిద్రోను వాగు ఒడ్డున దాన్ని కాల్చి, తొక్కి, బూడిద చేసి, బూడిదను సామాన్య ప్రజల సమాధుల మీద చల్లాడు.
7. ఇంకా యెహోవా మందిరంలో ఉన్న స్వలింగ సంపర్కుల గదులను పడగొట్టించాడు. అక్కడ స్త్రీలు అషేరాదేవికి వస్త్రాలు అల్లుతున్నారు. PEPS
8. యూదా పట్టణంలో ఉన్న యాజకులందర్నీ అతడు బయటకు వెళ్లగొట్టాడు. గెబా మొదలు బెయేర్షెబా వరకూ యాజకులు ధూపం వేసిన ఉన్నత స్థలాలను అతడు అపవిత్రం చేసి, పట్టణ ద్వారానికి ఎడమ వైపు పట్టణపు అధికారి అయిన యెహోషువ గుమ్మం దగ్గర ఉన్న ఉన్నత స్థలాలను పడగొట్టించాడు.
9. ఉన్నత స్థలాలమీద యాజకులుగా ఉన్న వారు యెరూషలేములో ఉన్న యెహోవా బలిపీఠం దగ్గర సేవ చెయ్యడానికి అనుమతి లేకపోయినా, తమ ఇతర యాజక సోదరుల్లా వారు కూడా పులియని రొట్టెలు తినే అవకాశం దొరికింది. PEPS
10. ఎవరూ తన కొడుకునైనా, కూతుర్నైనా మొలెకుకు దహనబలి ఇవ్వకుండా బెన్‌ హిన్నోము అనే లోయలో ఉన్న తోఫెతు అనే ప్రదేశాన్ని అతడు అపవిత్రం చేశాడు.
11. ఇదే కాకుండా, అతడు యూదా రాజులు సూర్యునికి ప్రతిష్ఠించిన గుర్రాలను మంటపంలో నివసించే పరిచారకుడైన నెతన్మెలకు గది దగ్గర, యెహోవా మందిరపు ద్వారం దగ్గర నుంచి వాటిని తీసివేసి, సూర్యునికి ప్రతిష్ఠించిన రథాలను అగ్నితో కాల్చేశాడు. PEPS
12. ఇంకా యూదా రాజులు చేయించిన ఆహాజు మేడ గది మీద ఉన్న బలిపీఠాలనూ, యెహోవా మందిరపు రెండు ప్రాంగణాల్లో మనష్షే చేయించిన బలిపీఠాలనూ, రాజు పడగొట్టించి ముక్కలు ముక్కలుగా చేయించి చెత్త అంతా కిద్రోను వాగులో పోయించాడు.
13. యెరూషలేము ఎదుట ఉన్న నాశనం అనే పర్వతపు కుడివైపు అష్తారోతు దేవత అనే సీదోనీయుల విగ్రహానికీ, కెమోషు అనే మోయాబీయుల విగ్రహానికీ, మిల్కోము అనే అమ్మోనీయుల విగ్రహానికీ ఇశ్రాయేలు రాజు సొలొమోను కట్టించిన ఉన్నత స్థలాలను రాజు అపవిత్రం చేశాడు.
14. రూపాలను ముక్కలుగా కొట్టించి, అషేరాదేవి రూపాన్ని పడగొట్టించి వాటి స్థానాలను మనుషుల ఎముకలతో నింపాడు. PEPS
15. బేతేలులో ఉన్న బలిపీఠాన్ని, ఉన్నత స్థలాన్ని, అంటే, ఇశ్రాయేలువారు పాపం చెయ్యడానికి కారకుడైన నెబాతు కొడుకు యరొబాము కట్టించిన ఉన్నత స్థలం, బలిపీఠం అతడు పడగొట్టించాడు. ఉన్నత స్థలాన్ని కాల్చి పొడి అయ్యేలా తొక్కించి, అషేరాదేవి రూపాన్ని కాల్చేశాడు.
16. యోషీయా అటు తిరిగి, అక్కడ పర్వత ప్రాంతంలో సమాధులను చూసి, కొందరిని పంపి, సమాధుల్లో ఉన్న ఎముకలను తెప్పించి, దైవజనుడు యెహోవా మాట చాటించి చెప్పిన ప్రకారం వాటిని బలిపీఠం మీద కాల్చి దాన్ని అపవిత్రం చేశాడు. PEPS
17. అప్పుడు అతడు “నాకు కనబడుతున్న సమాధి ఎవరిది?” అని అడిగాడు. పట్టణం వారు “అది యూదా దేశం నుంచి వచ్చి నీవు బేతేలులో ఉన్న బలిపీఠానికి చేసిన పనులు ముందుగా తెలిపిన దైవ ప్రవక్త సమాధి” అని చెప్పారు.
18. అందుకతడు “దాన్ని తప్పించండి. ఎవరూ అతని ఎముకలను తీయకూడదు” అని చెప్పాడు. వారు అతని ఎముకలను, షోమ్రోను పట్టణం నుంచి వచ్చిన ప్రవక్త ఎముకలను ముట్టుకోలేదు. PEPS
19. ఇంకా, ఇశ్రాయేలు రాజులు షోమ్రోను పట్టణాల్లో ఉన్నతస్థలాల్లో మందిరాలు కట్టించి యెహోవాకు కోపం పుట్టించారో, మందిరాలన్నిటినీ యోషీయా తీసేసి, తాను బేతేలులో చేసినట్టే వాటికీ చేశాడు.
20. అక్కడ అతడు ఉన్నతస్థలాలకు నియామకం అయిన యాజకులు అందరినీ బలిపీఠాల మీద చంపించి, వాటిమీద మనుషుల ఎముకలను తగలబెట్టించి, యెరూషలేముకు తిరిగి వచ్చాడు. PEPS
21. అప్పుడు రాజు “నిబంధన గ్రంథంలో రాసి ఉన్న ప్రకారంగా మీ దేవుడైన యెహోవాకు పస్కా పండగ ఆచరించండి” అని ప్రజలందరికీ ఆజ్ఞాపించాడు.
22. ఇశ్రాయేలీయులకు న్యాయం తీర్చిన న్యాయాధిపతులున్న రోజుల నుంచి, ఇశ్రాయేలు రాజుల కాలం, యూదా రాజుల కాలం వరకూ ఎన్నడూ జరగనంత వైభవంగా సమయంలో పస్కా పండగ జరిగింది.
23. పండగ రాజైన యోషీయా పరిపాలన 18 సంవత్సరంలో యెరూషలేములో యెహోవాకు జరిగింది. PEPS
24. ఇంకా మృతులతోనూ ఆత్మలతోనూ మాట్లాడే వాళ్ళను, సోదె చెప్పే వాళ్ళను, గృహ దేవుళ్ళను, విగ్రహాలను, యూదాదేశంలో, యెరూషలేములో, కనబడిన విగ్రహాలన్నిటినీ యోషీయా తీసేసి, యెహోవా మందిరంలో యాజకుడైన హిల్కీయాకు దొరికిన గ్రంథంలో రాసి ఉన్న ధర్మశాస్త్ర విధులను స్థిరపరచడానికి ప్రయత్నం చేశాడు.
25. అతనికి పూర్వం పరిపాలించిన రాజుల్లో అతని వలే పూర్ణహృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణబలంతో యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రం ప్రకారం చేసిన వాడు ఒక్కడూ లేడు. అతని తరువాత కూడా అతని వంటివాడు ఒక్కడూ లేడు. PEPS
26. అయినా, మనష్షే యెహోవాకు పుట్టించిన కోపం వల్ల ఆయన కోపాగ్ని ఇంకా చల్లారకుండా, యూదా మీద మండుతూనే ఉంది.
27. కాబట్టి యెహోవా “నేను ఇశ్రాయేలు వాళ్ళను వెళ్లగొట్టినట్టు యూదా వాళ్ళను నా సముఖానికి దూరం చేసి, నేను కోరుకొన్న యెరూషలేము పట్టణాన్నీ, నా పేరును అక్కడ ఉంచుతానని నేను చెప్పిన మందిరాన్నీ నేను విసర్జిస్తాను” అనుకున్నాడు. PEPS
28. యోషీయా చేసిన ఇతర పనులు గురించి, అతడు చేసిన దానినంతటిని గురించి, యూదారాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది.
29. అతని కాలంలో ఐగుప్తురాజు ఫరో నెకో అష్షూరురాజుతో యుద్ధం చెయ్యడానికి యూఫ్రటీసు నది దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు తనను యుద్ధంలో ఎదుర్కోడానికి వచ్చిన రాజైన యోషీయాను మెగిద్దో దగ్గర చంపాడు.
30. అతని సేవకులు అతని శవాన్ని రథం మీద ఉంచి, మెగిద్దో నుంచి యెరూషలేముకు తీసుకొచ్చి, అతని సమాధిలో పాతిపెట్టారు. అప్పుడు దేశ ప్రజలు యోషీయా కొడుకు యెహోయాహాజుకు పట్టాభిషేకం చేసి, అతని తండ్రి స్థానంలో అతన్ని రాజుగా చేశారు. PEPS
31. యెహోయాహాజు పరిపాలన ఆరంభించినప్పుడు అతని వయసు 23 సంవత్సరాలు. అతడు యెరూషలేములో మూడు నెలలు ఏలాడు. అతని తల్లి పేరు హమూటలు. ఆమె లిబ్నా ఊరి వాడు యిర్మీయా కూతురు.
32. ఇతడు తన పూర్వికులు చేసినదానంతటి ప్రకారం చేసి యెహోవా దృష్టిలో చెడునడత నడిచాడు.
33. ఫరో నెకో ఇతడు యెరూషలేములో పరిపాలన చెయ్యకుండా హమాతు దేశంలో ఉన్న రిబ్లా పట్టణంలో అతన్ని బంధకాల్లో ఉంచాడు. దేశం మీద 50 మణుగుల వెండినీ, రెండు మణుగుల బంగారాన్నీ కప్పం విధించాడు. PEPS
34. యోషీయా కొడుకు ఎల్యాకీమును అతని తండ్రి యోషీయా స్థానంలో నియమించి, అతనికి యెహోయాకీము అని మారుపేరు పెట్టాడు. కాని అతడు యెహోయాహాజును ఐగుప్తు దేశానికి తీసుకెళ్ళినప్పుడు అతడు అక్కడ చనిపోయాడు.
35. యెహోయాకీము ఫరో ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం దేశం మీద పన్ను నిర్ణయించి, వెండి బంగారాలను ఫరోకు చెల్లిస్తూ వచ్చాడు. అతడు దేశ ప్రజల దగ్గర నుంచి వారికి నిర్ణయించిన ప్రకారం వసూలు చేసి ఫరో నెకోకు చెల్లిస్తూ వచ్చాడు. PS
36. {యూదా రాజైన యెహోయాకీము} (23:36-24:6; 2దిన 36:5-8) PS యెహోయాకీము పరిపాలన ఆరంభించినప్పుడు 25 సంవత్సరాల వయస్సు గలవాడు. అతడు యెరూషలేములో 11 సంవత్సరాలు ఏలాడు. అతని తల్లి పేరు జెబూదా. ఆమె రూమా ఊరి వాడు పెదాయా కూతురు.
37. ఇతడు కూడా తన పూర్వికులు చేసినట్టు చేసి, యెహోవా దృష్టిలో చెడు నడత నడిచాడు. PE
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×