Bible Books

:
-

1. {యూదా రాజైన ఆసా} (14:2-3; 1రాజులు 15:11-12) PS అబీయా చనిపోయి తన పూర్వీకులతో కూడా కన్నుమూశాడు. ప్రజలు అతణ్ణి దావీదు పట్టణంలో పాతిపెట్టారు. అతని స్థానంలో అతని కొడుకు ఆసా రాజయ్యాడు. ఇతని రోజుల్లో దేశం 10 సంవత్సరాలు ప్రశాంతంగా ఉంది. PEPS
2. ఆసా తన దేవుడు యెహోవా దృష్టికి అనుకూలంగా, యథార్థంగా నడిచాడు.
3. అన్యదేవుళ్ళ బలిపీఠాలను పడగొట్టి, ఉన్నత స్థలాలను పాడుచేసి, ప్రతిమలను పగులగొట్టి, దేవతాస్తంభాలను కొట్టి వేయించాడు.
4. వారి పూర్వీకుల దేవుడు అయిన యెహోవాను ఆశ్రయించాలనీ ధర్మశాస్త్రాన్నీ, ఆజ్ఞలనూ పాటించాలని యూదావారికి ఆజ్ఞాపించాడు.
5. ఉన్నత స్థలాలనూ సూర్య దేవతా స్తంభాలనూ యూదా వారి పట్టాణాలన్నిటిలో నుండి తీసివేశాడు. అతని పాలనలో రాజ్యం ప్రశాంతంగా ఉంది. PEPS
6. సంవత్సరాల్లో అతనికి యుద్ధాలు లేకపోవడం చేత దేశం నెమ్మదిగా ఉంది. యెహోవా అతనికి విశ్రాంతి దయచేయడం వలన అతడు యూదాదేశంలో ప్రాకారాలు గల పట్టణాలను కట్టించాడు. PEPS
7. అతడు యూదా వారికి విధంగా ప్రకటన చేశాడు “మనం మన దేవుడైన యెహోవాను ఆశ్రయించాము. అందువలన ఆయన మన చుట్టూ నెమ్మది కలిగించాడు. దేశంలో మనం నిరభ్యంతరంగా తిరగవచ్చు. మనం పట్టణాలను కట్టించి, వాటికి ప్రాకారాలను, గోపురాలను, గుమ్మాలను, ద్వారబంధాలను అమర్చుదాం.” PEPS కాబట్టి వారు పట్టణాలను నిర్మించి వృద్ధి పొందారు.
8. కాలంలో యూదా వారిలో డాళ్ళు, ఈటెలు పట్టుకొనే వారు 3,00,000 మంది ఉన్నారు. యూదావారితోనూ, కవచాలు ధరించి బాణాలు వేసే 2, 80,000 మంది బెన్యామీనీయులతోనూ కూడిన సైన్యం ఆసాకు ఉంది. వీరంతా పరాక్రమవంతులు. PEPS
9. ఇతియోపీయా వాడు జెరహు 10,00,000 మంది సైన్యంతో, 300 రథాలతో వారిపై దండెత్తి మారేషా వరకూ వచ్చినపుడు ఆసా అతణ్ణి ఎదుర్కొన్నాడు. PEPS
10. వారు మారేషా దగ్గర జెపాతా అనే లోయలో ఎదురుగా నిలిచి యుద్ధం చేశారు.
11. ఆసా తన దేవుడు యెహోవాకు మొర్రపెట్టి “యెహోవా, మహా సైన్యం చేతిలో ఓడిపోకుండా బలం లేనివారికి సహాయం చేయడానికి నీకన్నా ఇంకెవరూ లేరు. మా దేవా, యెహోవా, మాకు సహాయం చెయ్యి. నిన్నే నమ్ముకున్నాము. నీ నామాన్ని బట్టే గొప్ప సైన్యాన్ని ఎదిరించడానికి బయలుదేరాము. యెహోవా! నువ్వే మా దేవుడివి. మానవమాత్రులను నీ మీద జయం పొందనీయకు” అని ప్రార్థించాడు. PEPS
12. అప్పుడు యెహోవా కూషీయులను ఆసా ఎదుటా, యూదా వారి ఎదుటా నిలబడనియ్యకుండా వారిని దెబ్బ తీసిన కారణంగా వారు పారిపోయారు.
13. ఆసా, అతనితో ఉన్నవారూ గెరారు వరకూ వారిని తరిమారు. కూషీయులు తిరిగి లేవలేక యెహోవా భయం చేతా ఆయన సైన్యం భయం చేతా పారిపోయారు. యూదా వారు విస్తారమైన కొల్లసొమ్ము పట్టుకున్నారు. PEPS
14. గెరారు చుట్టూ ఉన్న పట్టణాల్లోని వారందరి మీదికీ యెహోవా భయం ఆవరించింది కాబట్టి యూదా సైన్యం వాటన్నిటినీ కొల్లగొట్టి, వాటిలో ఉన్న విస్తారమైన సొమ్మంతటినీ దోచుకున్నారు.
15. అక్కడి పశువుల శాలలను పడగొట్టి, విస్తారమైన గొర్రెలనూ ఒంటెలనూ సమకూర్చుకుని యెరూషలేముకు తిరిగి వచ్చారు. PE
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×